- Home
- Entertainment
- Bigg Boss Telugu 9: హౌజ్‌లో ఫస్ట్ కెప్టెన్ సంజనా గల్రానీ.. కంటెస్టెంట్లని జంతువులతో పోలిక
Bigg Boss Telugu 9: హౌజ్‌లో ఫస్ట్ కెప్టెన్ సంజనా గల్రానీ.. కంటెస్టెంట్లని జంతువులతో పోలిక
బిగ్ బాస్ తెలుగు 9లో మొదటి కెప్టెన్‌గా సంజనా గల్రానీ ఎంపికయ్యారు. ఇక ఇమ్మాన్యుయెల్ భార్యగా, ప్రియా తల్లిగా, సుమన్ శెట్టి కొడుకుగా, పవన్ కళ్యాణ్ భర్తగా ప్రదర్శించిన స్కిట్ నవ్వులు పూయించింది.

సంజనా గల్రానీ బిగ్ బాస్ తెలుగు 9 ఫస్ట్ కెప్టెన్
బిగ్ బాస్ తెలుగు 9 ఐదో రోజు(శుక్రవారం) ఎపిసోడ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హౌజ్‌కి మొదటి కెప్టెన్ ఫైనల్ అయ్యారు. నిన్నటి నుంచి గేమ్ జరుగుతుంది. ఈ గేమ్‌లో చివరి వరకు ఉండి శ్రీజ గెలుపొందారు. ఆ గెలుపుకి కారణమైన సంజనాని కెప్టెన్‌గా ప్రకటించింది దమ్ము శ్రీజ. బిగ్ బాస్ హౌజ్‌లో మొదటి కెప్టెన్‌గా గెలిచిన సంజనాకి వారం రోజులపాటు లగ్జరీ ఫెసిలిటీస్ దొరుకుతాయి. హోనర్‌గా ఉండబోతుంది.
గ్రూపులుగా విడిపోయిన బిగ్ బాస్ హౌజ్
తాను బాధ్యతలు తీసుకున్నాక, తన రూమ్‌లోకి వచ్చే అవకాశం శ్రీజ, మనీష్‌లకు ఇచ్చింది సంజనా. దీనిపై హౌజ్‌లో చర్చ జరిగింది. ఇద్దరు ముగ్గురు గ్రూపులుగా మారి చర్చించుకున్నారు. ఇమ్మాన్యుయెల్, భరణి.. హరీష్, ప్రియా, మనీష్‌లు, రీతూ పవన్ కల్యాణ్, పవన్‌లతో చర్చించుకున్నారు. మరోవైపు సంజనా తనూజ కలిసిపోయి మాట్లాడుకున్నారు. తమ టీమ్ సభ్యురాలు కాకుండా ప్రత్యర్థి టీమ్ కి చెందిన సంజనాని కెప్టెన్ చేయడాన్ని హరీష్ అభ్యంతరం తెలియజేస్తూ వచ్చారు.
ఫుడ్ కోసం బిగ్ బాస్ హౌజ్‌లో గొడవలు
ఇదిలా ఉంటే ఇందులో తమ బాడీ షేమింగ్ కామెంట్లపై ఇమ్మాన్యుయెల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. భరణి కూడా ఆయనకు సపోర్ చేశారు. ఎవరికి వారు గ్రూపులుగా మారి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ఫన్నీ సీన్లు చోటు చేసుకున్నాయి. ఇంతలో కెప్టెన్ సంజనా.. వంట చేసే తనూజకి కొన్ని వంటకాల స్పెషల్ ఆర్డర్ ఇచ్చింది. ఈ విషయంలో తనూజ రచ్చ చేసింది. ఇలా డిక్టేట్ చేస్తుందంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. రోజూ ఇంట్లో ఫుడ్ కోసం గొడవలు అవుతున్నాయని ఇమ్మాన్యుయెల్ చెప్పడం విశేషం.
కంటెస్టెంట్లకి జంతువుల పేర్లు
ఇక కెప్టెన్‌గా తనకు కూల్ డ్రింగ్స్ రావడంతో వాటిని కంటెస్టెంట్లకి ఇచ్చేందుకురెడీ అయ్యింది. కాకపోతే వాళ్లు తనని ఇంప్రెస్ చేయాలనే రూల్ పెట్టింది. దీనికి హరీష్ ఏకంగా దొంగతనం చేయడం విశేషం. కాసేపు ఈ డ్రామా జరిగింది. అనంతరం సంజన, ఇమ్మాన్యుయెల్ మధ్య సరదా కన్వర్జేషన్ చోటు చేసుకుంది. హౌజ్‌మేట్స్ ని జంతువులతో పోల్చాలని ఇమ్మూ అడగ్గా, సంజనా రెచ్చిపోయింది. రీతూ చౌదరీ చిరుతా అని, పవన్ కళ్యాణ్ బ్లాక్ ఫాంథర్ అని, భరణి లయన్ అని, ప్రియా బేర్ అని, శ్రష్టి ఫాక్స్ అని, తనూజ ఉడుత అని, హరీష్ హైనా అని, శ్రీజ ఎలుక అని, సుమన్ శెట్టి తాబేలు అని, మనీష్ ఆనకొండ అని, ఫ్లోరా సైనీ మంకీ అని, ఇమ్మాన్యుయెల్ ఏనుగు అని, తాను టైగర్ అని చెబుతుంది సంజనా.
భార్యాభర్తల గొడవల స్కిట్ నవ్వులే నవ్వులు
అనంతరం హౌజ్‌లో ఇంట్రెస్టింగ్ కామెడీ స్కిట్‌ని ప్రదర్శించారు. రెండు కుటుంబాల, భార్యాభర్తల మధ్య గొడవలకు సంబంధించిన స్కిట్. ఇందులో ఇమ్మాన్యుయెల్ కూతురుగా, ప్రియా వాళ్ల అమ్మగా, సుమన్ శెట్టి ఇమ్మాన్యుయెల్ కొడుకుగా కనిపిస్తే, శ్రీజ అత్తగా, పవన్ కళ్యాణ్ భర్తగా, రీతూ చౌదరీ చెల్లిగా, భరణి లాయర్‌గా, తనూజ యాంకర్‌గా కనిపించారు. భార్యాభర్తలు మధ్య గొడవేంటి? అనేది బతుకు జట్కా బండి తరహాలో నడిపించారు. ఈ స్కిట్ ఆద్యంతం నవ్వులు పూయించింది. హైలైట్‌గా నిలిచింది. అనంతరం కెప్టెన్ సంజనా బాగా చేసిన వారికి తన వద్ద ఉన్న థంబ్సప్‌లను గిఫ్ట్ లుగా ఇవ్వడం విశేషం.