- Home
- Entertainment
- డేంజర్ జోన్‌లో కాంట్రవర్సీ కంటెస్టెంట్, పులిహోర పప్పులు ఉడకడం లేదు.. బిగ్ బాస్ తెలుగు 9 ఓటింగ్
డేంజర్ జోన్‌లో కాంట్రవర్సీ కంటెస్టెంట్, పులిహోర పప్పులు ఉడకడం లేదు.. బిగ్ బాస్ తెలుగు 9 ఓటింగ్
బిగ్ బాస్ తెలుగు 9 మొదటి వారం నామినేషన్స్ కి సంబంధించి రిజల్ట్ బయటకు వచ్చింది. ఈ వారంలో కాంట్రవర్సీ కంటెస్టెంట్ డేంజర్ జోన్‌లో ఉంది. పులిహోర వ్యవహారాలు పనిచేయడం లేదు.

బిగ్ బాస్ తెలుగు 9 మొదటి వారం ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ షో రోజు రోజు కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, ఇతరులు అర్థం కావడం, దీంతోపాటు నెమ్మదిగా తమ ఒరిజినాలిటీని బయటపెడుతున్నారు కంటెస్టెంట్లు. దీంతో షో కాస్త రసవత్తరంగా మారుతుంది. ఆడియెన్స్ లో కొంత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. అయితే అదే సమయంలో మొదటి వారం చివరికి చేరుకుంది. నామినేషన్‌లో ఉన్న వారిలో ఎవరు ఉంటారు, ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తాజాగా ఓటింగ్ రిజల్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎవరు టాప్‌లో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారనేది చూస్తే.
నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లు వీరే
మొదటి వారం నామినేషన్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వారిలో తనూజ గౌడ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సంజనా గల్రానీ, రాము రాథోడ్, రీతూ చౌదరీ, ఫ్లోరా సైనీ, శ్రష్టి వర్మ ఉన్నారు. అయితే వీరికి సంబంధించిన ఓటింగ్ రిజల్ట్ వచ్చేసింది. ఊహించని కంటెస్టెంట్లు టాప్‌లో ఉంటే, స్ట్రాంగ్ కంస్టెంట్లుగా భావించిన వారు చివర్లో ఉన్నారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
డేంజర్ జోన్‌లో శ్రష్టి వర్మ
సోషల్ మీడియాలో ఓటింగ్ ప్రకారం మొదటి వారం నామినేషన్‌లో ఉన్న వారిలో డేంజర్ జోనర్‌లో కాంట్రవర్సి కంటెస్టెంట్ శ్రష్టి వర్మ ఉన్నారు. ఆమె జానీ మాస్టర్‌కి సంబంధించిన వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనని వేధించాడని చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కింది. ఈ కేసులో జానీమాస్టర్ కొన్ని రోజులు జైల్‌కి కూడా వెళ్లి వచ్చాడు. దీంతో ఈ కేసు విషయంలోనే పాపులర్ అయ్యింది శ్రష్టి వర్మ. దీంతోపాటు `పుష్ప 2` చిత్రానికి ఆమె కొరియోగ్రఫీ చేయడం విశేషం. దీంతో మరింతగా అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. అయితే తాజాగా ఆమె డేంజర్ జోన్ లో ఉంది. ఓటింగ్‌లో చివర్లో ఉంది. ఆమెకి కనీసం మూడు శాతం ఓటింగ్ కూడా లేదు. దీంతో ఈ వారం ఎలిమినేట్ కావడం పక్కా అనే టాక్ వినిపిస్తుంది.
పులిహోర వేషాలు పనిచేయడం లేదా?
ఆమెతోపాటు రీతూ చౌదరీ, రాము రాథోడ్ కూడా డౌన్‌లో ఉన్నారు. గ్లామర్‌తో ఫిదా చేసే కంటెస్టెంట్ రీతూ చౌదరీ ఓటింగ్ లో వెనకబడింది. ఆమె గ్లామర్, పులిహోర వ్యవహారాలు ఇందులో పనిచేయడం లేదని అర్థమవుతుంది. సిన్సియర్‌గా టాస్క్ లు ఆడే కంటెస్టెంట్లు, రియాలిటీగా ఉన్న కంటెస్టెంట్లనే ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఓటింగ్‌కి శుక్రవారం టైమ్ ఉంది. కాబట్టి ఈ లోపు ఏదైనా మార్పు ఉంటుందా అనేది చూడాలి. కానీ ఒక్క రోజులోపెద్దగా మార్పు ఉండదని చెప్పొచ్చు.
మొదటి వారం ఎలిమినేషన్ ఉండదా?
ఇక టాప్‌లో తనూజ గౌడ ఉన్నారు. ఆ తర్వాత సుమన్ శెట్టి రెండో స్థానంలో నిలిచారు. సుమన్ శెట్టి డల్‌గా ఉన్నాడని తోటి కంటెస్టెంట్లు కామెంట్ చేశారు. నామినేట్ కూడా చేశారు. కానీ ఓటింగ్‌లో మాత్రం దూసుకుపోతున్నారు సుమన్ శెట్టి. మూడో స్థానంలో ఇమ్మాన్యుయెల్ ఉన్నారు. ఆయన కామెడీతో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక నాల్గో స్థానంలో సంజనా గల్రానీ నిలిచింది. ప్రారంభం నుంచి అంతా ఆమెని టార్గెట్ చేసిన నేపథ్యంలో ఆమె మంచి స్థానంలోనే ఉండటం విశేషం. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో తొలి కెప్టెన్ ఆమెనే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే మొదటి వారం చాలా వరకు ఎలిమినేషన్ ఉండదు. గత సీజన్లలో అదే చేశారు. కొత్తగా వస్తారు కాబట్టి బిగ్ బాస్ ఆ ఫ్రీడమ్ ఇస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా అదే చేస్తారా? లేక ట్విస్ట్ ఇస్తారా? అనేది చూడాలి. అయితే ప్రారంభం నుంచి ఈ సారి రణరంగమే అని, మామూలు ట్విస్ట్ లు ఉండవని చెబుతున్నారు హోస్ట్ నాగార్జున. ఆ లెక్క ప్రకారం మొదటివారం ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యం లేదు.