- Home
- Entertainment
- Bigg Boss Telugu 9 Nominations: ఐదో వారం నామినేషన్‌లో ఉన్నది వీరే.. రీతూ చౌదరీ, దివ్యలో రియలైజేషన్
Bigg Boss Telugu 9 Nominations: ఐదో వారం నామినేషన్‌లో ఉన్నది వీరే.. రీతూ చౌదరీ, దివ్యలో రియలైజేషన్
బిగ్ బాస్ తెలుగు 9 ఐదు వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా కొత్తగా, విభిన్నంగా జరిగింది. ఈ వారం ఇద్దరు తప్ప మిగిలిన వారంతా నామినేషన్స్ లో ఉన్నారు. వాళ్లెవరో చూద్దాం.

బిగ్ బాస్ తెలుగు 9 ఐదో వారం నామినేషన్
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ నాలుగు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. నాల్గో వారం హరిత హరీష్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ప్రారంభం నుంచి హౌజ్‌లో తన ప్రత్యేకతని చాటుకుంటూ వచ్చిన ఆయన స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలిచారు. కానీ తన ప్రవర్తన కారణంగా వివాదాలకు కేరాఫ్ అయ్యారు. నాల్గో వారం ఆయన హౌజ్‌ని వీడాల్సి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు హౌజ్ నుంచి శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, ఇప్పుడు హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌజ్‌లో సంజనా, ఇమ్మాన్యుయెల్, తనూజ, భరణి, శ్రీజ దమ్ము, రీతూ చౌదరీ, కళ్యాణ్, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఫ్లోరా సైనీతోపాటు మధ్యలో ఎంట్రీ ఇచ్చిన దివ్య ఉన్నారు.
ఐదో వారం నామినేషన్ లో బిగ్ బాస్ ట్విస్ట్
ఇక ఐదో వారం నామినేషన్ జరిగింది. సోమవారం(29వ రోజు) ఎపిసోడ్‌లో నామినేషన్ల ప్రక్రియ ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ సారి నామినేషన్స్ ని కొత్తగా నిర్వహిస్తున్నారు. ఒక కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయడం అనేది పాత ట్రెండ్. కానీ దానికి బ్రేక్ ఇచ్చింది బిగ్ బాస్ టీమ్. గేమ్స్, టాస్క్ ల ద్వారా నామినేషన్స్ చేయడం విశేషం. ఐదో వారంలో కెప్టెన్ రాము రాథోడ్ తప్ప మిగిలిన వారంతా నామినేషన్‌లో ఉంటారని బిగ్ బాస్ తెలిపారు. డైరెక్ట్ నామినేషన్స్ లో ఉండేవారి పేర్లని ప్రకటించి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఆ నామినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు కావాల్సిన ఇమ్మ్యూనిటీని పొందే అవకాశం కల్పించారు. అందుకోసం ఓ టాస్క్ ఉచ్చారు. గార్డెన్ ఏరియాలో ఒక బెడ్ ని ఏర్పాటు చేసి, అందులో నామినేషన్‌లో ఉన్న వారంతా ఉంటారు. ఎండ్ బజర్ మోగేంత వరకు ఎవరైతే ఆ బెడ్‌పై ఉంటారో(ఎక్కువసేపు) వాళ్లు ఇమ్యూనిటీని పొందుతారని తెలిపారు.
నామినేషన్ నుంచి సేవ్ అయిన ఇమ్మాన్యుయెల్
ఈ టాస్క్ కాస్త రసవత్తరంగానే సాగింది. ప్రారంభంలోనే సంజనా బెడ్‌పై నుంచి కాలు కింద పెట్టి ఇమ్మూనిటీ కోల్పోయారు. ఆ తర్వాత దివ్యని తోసేసారు. ఆమెని తోసేసేందుకు బాయ్స్ అంతా చెమటోడ్చాల్సి వచ్చింది. దమ్ముంటే మిగిలిన వారిని తోయండి అంటూ ఆమె సవాల్ కూడా విసిరింది. అనంతరం డీమాన్ పవన్‌ని తోసేశారు. డీమాన్ పవన్‌ని తప్పించడం ఫెయిర్ నిర్ణయం కాదని సంచాలకులుగా ఉన్న రాము రాథోడ్, ఫ్లోరాని నిలదీశారు కంటెస్టెంట్లు. కానీ తమ ఇష్టమనే కండీషన్ ఉండటంతో దాన్ని సమర్థించుకున్నారు. ఈ విషయంలో చాలా సేపే చర్చ జరిగింది. ఆ తర్వాత రీతూ చౌదరీని కిందకు తోశారు. చివరగా శ్రీజని తోసేశారు. ఫైనల్‌గా ఇమ్మాన్యుయెల్, భరణి, కళ్యాణ్, తనూజ ఉన్నారు. ఈ నలుగురికి `గాలి నిప్పు నీరు` అనే మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో మూడు బ్రిగ్స్ ని సాధించి టేబుల్‌పై సమాంతరంగా పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయెల్ సత్తా చాటాడు. విన్నర్‌గా నిలిచాడు.
ఐదో వారం నామినేసన్లలో ఉన్నది వీరే
దీంతో ఐదో వారం నామినేషన్ నుంచి ఇమ్మాన్యుయెల్ తప్పించుకున్నారు. రాము రాథోడ్ కెప్టెన్ కారణంగా ఈ నామినేషన్స్ లో లేరు. కానీ మిగిలిన వారంతా ఈ వారం నామినేషన్‌లో ఉంటారని చెప్పారు బిగ్ బాస్. అలా ఐదో వారం నామినేషన్‌లో భరణి, సంజనా, తనూజ, ఫ్లోరా, కళ్యాణ్, డీమాన్ పవన్, రీతూ చౌదరీ, శ్రీజ, సుమన్ శెట్టి, దివ్య నామినేషన్‌లో ఉన్నట్టుగా బిగ్ బాస్ ప్రకటించారు. మరి వీరిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
రీతూ చైదరీ, దివ్యలో రియలైజేషన్
ఇదిలా ఉంటే ఈ టాస్క్ ల సమయంలో ఆసక్తికర చర్చ జరిగింది. టాస్క్ లో తనకు సపోర్ట్ చేస్తారనుకున్న కళ్యాణ్ హ్యాండిచ్చాడు. ఇమ్మాన్యుయెల్ కూడా అదే చేశారు. దీంతో ఇందులో ఎవరినీ నమ్మొద్దని, ఎవరి గేమ్ వాళ్లు ఆడాలని, అయ్యో పాపం అని ఎవరి విషయంలోనూ అనుకోవద్దని, తాను అనుకుని మోసపోయినట్టు రీతూ రియలైజ్ అయ్యింది. తనూజతో చెబుతూ ఎమోషనల్ అయ్యింది. మరోవైపు దివ్య కూడా అదే విషయాన్ని వెల్లడించారు. భరణిని ఎంతో నమ్మినట్టు, తన కోసం నిలబడతాడని, సపోర్ట్ చేస్తాడని తాను భావించానని, కానీ తనని తోసేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఎవరి గేమ్ వాళ్లే ఆడాలని ఆమె కూడా తెలిపింది. మరోవైపు శ్రీజని తోసేసే విషయంలో భరణి కూడా విమర్శలను ఫేస్ చేశారు. రేలంగి మామయ్యలా నటిస్తున్నావని, మంచి వాడిలా పైకి కనిపిస్తూ నటిస్తున్నావని భరణీని పట్టుకుని నిలదీసింది. మొత్తంగా ఇందులో రీతూ, దివ్య ఎవరి ఆట వాళ్లే ఆడాలనే విషయాన్ని రియలైజ్ అయ్యారు.