MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Rajamouli Acting : జక్కన్న నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? వామ్మో ఏకంగా యాంకర్‌తో రొమాన్స్

Rajamouli Acting : జక్కన్న నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? వామ్మో ఏకంగా యాంకర్‌తో రొమాన్స్

రాజమౌళి సినిమాల్లో అడపాదడపా మెరుస్తుంటారు. అలా తళుక్కున మెరుస్తూ వాహ్‌ అనిపిస్తారు. అయితే ఆయన ఒక సీరియల్‌లో నటించారు. స్టార్‌ యాంకర్‌తో రొమాన్స్ కూడా చేయడం విశేషం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 11 2025, 12:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియన్‌ సినిమా దశ దిశ మార్చేసిన రాజమౌళి
Image Credit : Asianet News

ఇండియన్‌ సినిమా దశ దిశ మార్చేసిన రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం దేశం గర్వించదగ్గ దర్శకుడిగా రాణిస్తున్నారు. ఆయన తెలుగు సినిమానే కాదు, ఇండియన్‌ మూవీ దశ దిశని మార్చేశారు. ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలు, గ్లోబల్‌ ఫిల్మ్స్ వస్తున్నాయంటే అందుకు ఆయనే కారణం. `బాహుబలి` మూవీతో ఆయన చేసిన రిస్క్.. ఎంతో మందికి దారులు చూపించింది. ఇప్పుడు చాలా మంది ఆయన వేసిన దారిలో వెళ్తున్నారని చెప్పొచ్చు. రాజమౌళి ప్రస్తుతం మహేష్‌ బాబుతో గ్లోబల్‌ ట్రోట్ మూవీ చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. నవంబర్‌లో దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ రాబోతుంది. హాలీవుడ్‌ మూవీ స్థాయిలో దీన్ని తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఇప్పటికే లీక్‌ అయిన ఫోటోలు, వీడియోలు మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యాక్టర్‌గా మారిన రాజమౌళి
Image Credit : instagram

యాక్టర్‌గా మారిన రాజమౌళి

ఇదిలా ఉంటే శుక్రవారం రాజమౌళి తన 52వ పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ క్రమంలో రాజమౌళికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రాజమౌళి తాను రూపొందించిన చాలా సినిమాల్లో అలా తళుక్కున మెరిశారు. క్లైమాక్స్ లో అలా కొన్ని సెకన్లపాటు మెరవడం జరుగుతూనే ఉంది. తాను డైరెక్ట్ చేయని `రెయిన్‌ బో`, `మజ్ను`, `కల్కి 2898 ఏడీ` చిత్రాల్లో కూడా కనిపించారు. ప్రభాస్‌ `కల్కి`లో కాసేపు మెరిసి ఆయనకే వార్నింగ్‌ ఇచ్చాడు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే సినిమాల్లోనే కాదు, బుల్లితెరపై కూడా మెరిశారు. రాజమౌళి ఓ సీరియల్‌లో నటించారు. కేవలం క్యామియోగా కొన్ని సెకన్లపాటు మెరవడం కాదు. ఏకంగా ఆయన ఓ ఎపిసోడ్‌లోనే నటించారు.

35
యువ సీరియల్‌లో నటించిన రాజమౌలి
Image Credit : Asianet News

యువ సీరియల్‌లో నటించిన రాజమౌలి

జక్కన్న నటించిన ఏకైక సీరియల్‌ `యువ`. ఇది మా టీవీలో ప్రసారం అయ్యింది. ఇందులో రాజమౌళి ఆల్మోస్ట్ ఒక హీరో రేంజ్‌ క్యారెక్టర్‌ చేశారు. అంతేకాదు యాంకర్‌ రష్మి గౌతమ్‌కి లవర్‌గా కనిపించారు. రష్మి ఇందులో రేడియో జాకీగా చేస్తుంది. ఆమెకి రేడియో ద్వారా రాజమౌళి పరిచయం అవుతారు. అది కాస్త ప్రేమ వైపుకు దారితీస్తుంది. ఓ రోజు ఈ ఇద్దరు మీట్ అవుతారు. ఆయా సీన్లల్లో రాజమౌళి నటించారు. ఒకటి రెండు ఎపిసోడ్లలో ఆయన నటించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ లు ఆ మధ్య వైరల్‌ అయ్యాయి. ఇందులో రాజమౌళిని చూసి రష్మి ఫిదా అవ్వడం, ఆయనతో మాట్లాడేందుకు సిగ్గుపడటం, అంతేకాదు జింతాకా జింతాకా అంటూ స్టెప్పులేయడం విశేషం. ఇద్దరు కలిసి డ్యూయెట్లు పాడుకున్నారు.

45
యాంకర్‌ రష్మితో రొమాన్స్ చేసిన జక్కన్న
Image Credit : our own

యాంకర్‌ రష్మితో రొమాన్స్ చేసిన జక్కన్న

ఇందులో రాజమౌళిని ఫస్ట్ టైమ్‌ చూడగానే మెలికలు తిరుగుతుంది రష్మి, ఫస్ట్ క్రష్‌ లాగా, ఫస్ట్ మీట్‌లో ఆమె చాలా టెన్షన్‌ పడుతుంది. `నేను ఇది నమ్మలేకపోతున్నా` అని రష్మి అంటే, `ఫర్వాలేదు నమ్మొచ్చు` అని సింపుల్‌గా చెప్పేస్తాడు రాజమౌళి. `ఇన్ని రోజులు నాతో మాట్లాడుతున్నది మీరా?` అని రష్మి అడగ్గా, `రోజులు కాదు, గంటలు, అరగంటకోసారైనా మాట్లాడాలి కదా. కుచ్‌ కుచ్‌ హోతా హై, నీకు తెలుసు కదా. అవును నేను అంకుల్‌ అయితే ఏం చేసేదానివి` అని అడుగుతాడు రాజమౌళి, ఆంటీ అయ్యేదాన్ని అని రష్మి సమాధానం చెప్పడం విశేషం.

55
`చంద్రముఖి` సీరియల్‌లో
Image Credit : our own

`చంద్రముఖి` సీరియల్‌లో

దీనికి దెబ్బకి షాక్‌ తిన్న జక్కన్న `అబ్బా రేడియోలోనే కాదు, బయట కూడా బాగానే మాట్లాడుతున్నావే` అంటూ పంచ్‌ వేస్తాడు. దీనికి `ఇంకా బాగా మాట్లాడతా` అని చెబుతుంది రష్మి. అంతటి ఆగలేదు, నాకు సిగ్గేస్తుందంటూ మెలికలు తిరుగుతుంది. నాకు తొందరగా ఉందంటాడు రాజమౌళి. అప్పుడే వెళ్లాలా అని రష్మి అంటుంది. ఏ వెళ్లనివ్వవా అంటే ఫీలింగ్‌ షైగా ఉంది అని చెబుతుంది. రాజమౌళి చేయిపై చేయి పెట్టి సిగ్గుపడుతుంది. తెలుస్తూనే ఉందంటూ, చెప్పు అంటాడు ప్రేమగా రాజమౌళి. తప్పదా అంటుంది రష్మి. తప్పదు అంటాడు జక్కన్న. దీంతో తలసైడ్‌కి తిప్పి కళ్లు మిటమిట కొడుతుంది. ఇది అర్థం కాని రాజమౌళి ఏంటి కళ్లు మండుతున్నాయా? అంటాడు. దీంతో ఒక్కసారిగా కోపానికి గురైన రష్మి, షటప్‌ దాని అర్థం ఐ లవ్యూ, నీకు కూడా తెలియదా? అని కేఫ్‌లో అందరి ముందు గట్టిగా అరుస్తుంది, దెబ్బకి బిత్తరపోయి చూస్తాడు రాజమౌళి. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో మధ్యలో ఇద్దరు కలిసి పాట కూడా పాడుకోవడం విశేషం. ఈ వీడియో క్లిప్‌ ఆ మధ్య బాగా వైరల్‌ అయ్యింది. ఇదే కాదు `చంద్రముఖి` అనే సీరియల్‌ 1500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాసేపు గెస్ట్ గా బుల్లితెరపై కనిపించారు జక్కన్న. ఒక ఎపిసోడ్‌ని తనే డైరెక్ట్ చేశాడు. ఈ క్రమంలో కాసేపు అలా తళుక్కున మెరిశారు. ఇలా కొన్ని షోస్‌, డాక్యుమెంటరీలు, వెబ్‌సిరీస్‌లోనూ కనిపించారు. అయితే రాజమౌళి పూర్తి స్థాయిలో యాక్టర్‌గా మారి నటించిన సీరియల్‌ మాత్రం `యువ` అనే చెప్పాలి. ఇది 2008లో మాటివీలో ప్రసారమైంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి
రష్మీ గౌతమ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Ari Movie Review: `అరి` మూవీ రివ్యూ, రేటింగ్‌.. అనసూయ నటించిన సినిమా ఆకట్టుకునేలా ఉందా?
Recommended image2
Bigg Boss Telugu 9: డేంజర్‌ జోన్‌లో గ్లామర్ బ్యూటీ, ఎలిమినేట్‌ చేస్తాడా?.. బిగ్‌ బాస్‌కే సవాల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved