- Home
- Entertainment
- హౌస్ లోకి దివ్య వైల్డ్ కార్డు ఎంట్రీ, దిమ్మతిరిగే షాకిచ్చిన బిగ్ బాస్.. శ్రీజ పరువు తీసిన అనూష
హౌస్ లోకి దివ్య వైల్డ్ కార్డు ఎంట్రీ, దిమ్మతిరిగే షాకిచ్చిన బిగ్ బాస్.. శ్రీజ పరువు తీసిన అనూష
Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ తెలుగు 9లో 18వ రోజు అగ్ని పరీక్ష సభ్యుల్లో ఒకరైన దివ్య నిఖిత వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఎంట్రీ ఇలా జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

సంజన, తనూజ వివాదంలో ఇరుక్కుపోయిన రాము
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 18వ రోజు బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. హౌస్ లోకి ఒకరిని వైల్డ్ కార్డు రూపంలో తీసుకువచ్చారు. ఎప్పటిలాగే ఫుడ్ విషయంలో గొడవలతో 18వ రోజు ప్రారంభం అయింది. తనూజ, సంజన మధ్య వివాదంలో రాము నలిగిపోయాడు. సంజనకి కాఫీ ఇచ్చాడని తనూజ అతడిపై ఒక రేంజ్ లో ఫైర్ అయింది. ఇమ్మాన్యూల్ కలగజేసుకుని తనూజని కూల్ చేసే ప్రయత్నం చేశాడు.
హౌస్ లోకి అగ్నిపరీక్ష సభ్యులు
ఆ తర్వాత ఇంటి సభ్యులకు బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చారు. హౌస్ లోకి అగ్నిపరీక్ష సభ్యులు దివ్య నిఖిత, షకీబ్, నాగ, అనూష ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కొందరికి హౌస్ లోకి వైల్డ్ కార్డు రూపంలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కుతుంది అని బిగ్ బాస్ తెలిపారు. అయితే అది హౌస్ మేట్స్ చేతుల్లోనే ఉంది అని బిగ్ బాస్ అన్నారు. ముందుగా అగ్నిపరీక్ష సభ్యులు ప్రస్తుతం ఉన్న హౌస్ లో ఎలాంటి లోపాలు ఉన్నాయి ? తమకి అవకాశం వస్తే వాటిని ఎలా సరిచేస్తారు అని బిగ్ బాస్ సభ్యులకు వివరించాలి. ఆ తర్వాత తాము హౌస్ లోకి వచ్చేందుకు ఓటింగ్ చేయాలి అప్పీల్ చేసుకోవాలి.
శ్రీజ పరువు తీసిన అనూష
దివ్య, నాగ, షకీబ్, అనుష్క తమకి తోచిన విధంగా హౌస్ లో ఉన్న లోపాలు చెప్పారు. కొందరు హౌస్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గింది అని తనకి వస్తే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తానని షకీబ్ లాంటి వారు తెలిపారు. ఆ తర్వాత ఇంటి సభ్యులు వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. అనూషని పిలిచి నువ్వు హౌస్ లోకి రావాలంటే ఒకరిని స్వాప్ చేయాల్సి వస్తే ఎవరిని చేస్తావు అని ప్రశ్నించారు. దీనికి అనుష్క శ్రీజ పేరు చెప్పింది. ఎందుకు అని ప్రశ్నించగా.. శ్రీజ ఎప్పుడూ నెగిటివ్ మెంటాలిటీలోనే ఉంటుంది. కాబట్టి ఆమెని స్వాప్ చేస్తా అని అనూష పేర్కొంది. నాగని ఇదే ప్రశ్న అడగా అతడు కళ్యాణ్ ని స్వాప్ చేస్తానని తెలిపారు. కళ్యాణ్ అసలు గేమ్ లో కనిపించడమే లేదని విమర్శించారు. దివ్య కూడా శ్రీజ పేరునే చెప్పింది. శ్రీజకి తాను బిగ్ బాస్ కంటే ఎక్కువ అనే ఫీలింగ్ ఉంది అని దివ్య పేర్కొంది. ఇక హౌస్ లో నీకు ఎవరు కాంపిటీషన్ అని అనూషని ప్రశ్నించారు. దీనికి అనూష బదులిస్తూ సంజన, తనూజ పేరు చెప్పింది. సంజన ఎవరి గురించి పట్టించుకోకుండా తాను అనుకున్న విధానంలో గేమ్ ఆడుతూ వెళ్లిపోతున్నారని అనూష పేర్కొంది .
హౌస్ లోకి దివ్య వైల్డ్ కార్డు ఎంట్రీ
ఆ తర్వాత బిగ్ బాస్ అగ్ని పరీక్ష సభ్యులని హౌస్ నుంచి బయటకు పంపారు. ఇంట్లో ఉన్న సభ్యులు ఒక్కొక్కరు నాగ, అనూష, షకీబ్, దివ్య లలో ఎవరు హౌస్ లోకి వైల్డ్ కార్డుగా రావాలని భావిస్తున్నారో నిర్ణయించుకుని ఇద్దరికి ఓటింగ్ చేయాలని తెలిపారు. దీనితో ఇంటి సభ్యులు సీక్రెట్ గా ఓటింగ్ చేశారు. ఓటింగ్ రిజల్ట్ ప్రకారం అత్యధిక ఓట్లు వచ్చిన అగ్ని పరీక్ష సభ్యులు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తారు. ఆ సస్పెన్స్ కూడా ఇప్పుడే వీడిపోతుంది అని బిగ్ బాస్ తెలిపారు. బిగ్ బాస్ హౌస్ గేట్లు తెరుచుకోగానే దివ్య లోపలికి ఎంట్రీ ఇచ్చింది. అంటే నలుగురిలో ఒక్కరికి మాత్రమే వైల్డ్ కార్డుగా అవకాశం దక్కింది.
ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్
ఇంటి సభ్యులంతా కొత్త హౌస్ మేట్ దివ్యకి కంగ్రాట్స్ చెప్పారు. దివ్య అత్యధిక ఓట్లు సాధించి హౌస్ లోకి రాలేదని.. ఆమెకి అతి తక్కువ ఓట్లు వచ్చాయని ట్విస్ట్ ఇచ్చారు. అయినా కూడా ఆమెకి వైల్డ్ కార్డుగా అవకాశం ఇవ్వడానికి కారణం ఉంది. ఇది బిగ్ బాస్ చదరంగం కాదు.. రణరంగం.. కాబట్టి ఏదైనా నేను అనుకున్నట్లే జరుగుతుంది. ఇది మీకు నేను వేసిన వ్యూహం అని బిగ్ బాస్ సమాధానం ఇచ్చారు.