- Home
- Entertainment
- అయేషాతో పవన్ రొమాన్స్, కొత్తవాళ్లు రాగానే రీతూని వదిలేశాడు.. బిగ్ బాస్ ఆస్తులు అమ్ముకునేలా రమ్య కోరికలు
అయేషాతో పవన్ రొమాన్స్, కొత్తవాళ్లు రాగానే రీతూని వదిలేశాడు.. బిగ్ బాస్ ఆస్తులు అమ్ముకునేలా రమ్య కోరికలు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 38 వ రోజు కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగాయి. హౌస్ లోకి కొత్తవాళ్లు రాగానే పవన్ రీతూని వదిలేశాడు అంటూ ఇమ్మాన్యుయేల్ కామెంట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

బిగ్ బాస్ తెలుగు 9
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో వైల్డ్ కార్డు సభ్యులు వచ్చాక మరింత హంగామాగా మారింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో దివ్య రేషన్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. ఫుడ్ విషయంలో దివ్య, మాధురి మధ్య గొడవతో 38వ రోజు ప్రారంభం అయింది. తనకి చెప్పకుండా ఫుడ్ పెట్టుకున్న మాధురిని దివ్య ప్రశ్నించింది. దీనితో మాధురి వెంటనే కోపం తెచ్చుకుని.. అందరికీ ఫుడ్ అవసరం, నేను కూడా అమ్మనే.. అందుకే కొంచెం పెట్టుకున్నట్లు తెలిపింది.
దివ్య వర్సెస్ మాధురి
అసలు ఇక్కడ అమ్మ అనే విషయం ఎందుకు వచ్చింది.. నేను ప్రశ్నిస్తున్నడి నాకు చెప్పకుండా ఎందుకు ఫుడ్ పెట్టుకున్నారు అని.. రేషన్ మేనేజర్ కి చెప్పాలనే విషయం తెలియదా అంటూ దివ్య కౌంటర్ ఇచ్చింది. దీనితో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ లో భాగంగా రమ్య, సుమన్ శెట్టి లకు.. బిగ్ బాస్ ని తమకి నచ్చిన ఫుడ్ రిక్వస్ట్ చేసుకునే అవకాశం వచ్చింది.
రమ్య కోరికలు తీర్చాలంటే బిగ్ బాస్ ఆస్తులు అమ్ముకోవాలి
ఛాన్స్ దొరికింది కదా అని రమ్య మోక్ష బిగ్ బాస్ ముందు తనకి ఇష్టమైన ఫుడ్ లిస్ట్ విప్పింది. ఆమె కోరికలు మొత్తం తీర్చాలంటే బిగ్ బాస్ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎగ్ పెసరట్టు, ఎగ్ బిర్యానీ, చికెన్ జాయింట్స్, కాఫీ, ఐస్ క్రీమ్, పిజ్జా, నెయ్యి, మిక్చర్, పచ్చి మామిడి కాయ ఇలా రమ్య ఫుడ్ లిస్ట్ చెబుతూ బిగ్ బాస్ ని రిక్వస్ట్ చేసింది. ఆమె తన కోర్కెల చిట్టా విప్పుతుంటే వెనుక నుంచి చూస్తున్న రీతూ చౌదరి ఆశ్చర్యపోయింది.
అయేషాతో పవన్ రొమాన్స్
ఆ తర్వాత పవన్, అయేషా జీనత్ మధ్య చిన్నపాటి రొమాన్స్ జరిగింది. ఇద్దరూ కలిసి గార్డెన్ ఏరియాలో డ్యాన్స్ చేశారు. పవన్.. అయేషాని పైకి ఎత్తుకుని గిరగిరా తిప్పాడు. ఇదంతా చూస్తున్న ఇమ్మాన్యుయేల్ పవన్ పై ఫన్నీ సెటైర్లు వేశాడు. కొత్త వాళ్ళు రాగానే రీతూని వదిలేశాడు అంటూ కామెంట్స్ చేశాడు. ఇమ్మాన్యుయేల్ మాటలు అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. ఈ నిద్ర ముఖమోడు కొత్త వాళ్ళు రాగానే మా పిల్లని వదిలేశాడు.. ఇంత దారుణం చేస్తాడు అనుకోలేదు అమ్మో అంటూ ఇమ్మాన్యుయేల్ రన్నింగ్ కామెంట్రీ చెప్పాడు.
అలిగిన రీతూ చౌదరి
అందరూ సరదాగా తీసుకున్నారు కానీ.. పవన్.. అయేషాతో రొమాన్స్ చేయడం రీతూకి నిజంగానే నచ్చలేదు. దీనితో ఆమె అలిగేసింది. ఆ తర్వాత పవన్ రీతూని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. ఇక చివర్లో కిచెన్ లో పాత్రలు తోమే విషయంలో రీతూ, అయేషా మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు గట్టిగా కేకలు వేసుకుంటూ గొడవకి దిగారు. రాత్రి క్లీన్ చేయాల్సిన పాత్రలని రీతూ చేయకుండా అలాగే ఉంచింది అని అయేషా గొడవ పెట్టుకుంది.