- Home
- Entertainment
- చిరంజీవిని పదిసార్లు అవమానించిన స్టార్ హీరోయిన్.. మెగాస్టార్ అలాంటి రియాక్షన్‌ని ఎవరూ ఊహించరు
చిరంజీవిని పదిసార్లు అవమానించిన స్టార్ హీరోయిన్.. మెగాస్టార్ అలాంటి రియాక్షన్‌ని ఎవరూ ఊహించరు
చిరంజీవి ఇప్పుడు చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నారు. ఏ విమర్శలకైనా చాలా కూల్‌గా రియాక్ట్ అవుతారు. కానీ ఒకప్పుడు చిరంజీవి వేరు అని వెల్లడించారు మెగా బ్రదర్ నాగబాబు. ఓ హీరోయిన్‌కి మాస్ వార్నింగ్ ఇచ్చాడట.

హుందాతనానికి కేరాఫ్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మనస్తత్వం, వ్యక్తిత్వం ఏంటో ఇప్పుడు అందరికి తెలుసు. సినిమాలను ఫాలో అయ్యే వాళ్లందరికి చిరు గురించి తెలిసే ఉంటుంది. ఆయన ఎంత సౌమ్యంగా, ఎంతటి హుందాగా ఉంటారో ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైనా తనని విమర్శిస్తే హుందాగా రియాక్ట్ అవుతారు, పెద్దగా పట్టించుకోరు, చాలా కూల్‌గా ముందుకు సాగిపోతారు. అనవసరమైన విషయాలకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వరు. అయితే చిరంజీవి ఓ సందర్భంలో మాత్రం తనలోని మరో యాంగిల్ చూపించాడు. స్టార్ హీరోయిన్‌కి మాస్ వార్నింగ్ ఇచ్చాడు.
ఐదేళ్ల వరకు స్ట్రగుల్ అయిన చిరంజీవి
చిరంజీవి `ప్రాణంఖరీదు` చిత్రంతో నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1978లో ఈ మూవీ విడుదలైంది. ప్రారంభంలో ఆయన హీరోగా, విలన్‌గా నటిస్తూ వచ్చాడు. ఇతర హీరోల సినిమాల్లో సెకండ్ లీడ్‌గానూ చేశాడు. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకుంటూ ఎదిగాడు. `కోతలరాయుడు`, `పున్నమి నాగు`, `కొత్తపేట రౌడీ` వంటి చిత్రాలతో నటుడిగా నిరూపించుకున్నారు చిరంజీవి. `ఖైదీ` వరకు సినిమాలు చేస్తున్నారు, బాగానే ఆకట్టుకుంటున్నాడు, కానీ స్టార్ ఇమేజ్ రాలేదు. సరైన బ్రేక్ రాలేదు. దీంతో అప్పట్లో చాలా మంది చిరంజీవిని కొంత లోకువగా చూసేవారట.
చిరంజీవిని అవమానించిన హీరోయిన్
ఓ హీరోయిన్ మాత్రం చిరంజీవిని బాగా హర్ట్ చేసిందట. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా పది సార్లు వివిధ రకాలుగా అవమానిస్తుందట. చిరంజీవి భరించారు, భరిస్తూనే ఉన్నారు. తాను అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న నేపథ్యంలో ఎంతో ఓపికగా ఆమె అవమానాలను భరించాడు. అయితే అది మితిమీరిపోతుంది. దాదాపు పది సార్లు ఇలానే అవమానాలు ఫేస్ చేయాల్సి వచ్చింది. దీంతో రెచ్చిపోయాడు చిరంజీవి. పదకొండో సారి ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. తంతాను అనే రేంజ్‌లో లేసి వార్నింగ్ ఇచ్చాడట. ఎదవ వేషాలు వేస్తే చంపేస్తానంటూ బెదిరించాడట. ఆ దెబ్బతో ఆ హీరోయిన్ అక్కడి నుంచి పారిపోయిందట.
ఇప్పుడు కనిపించేంత సాఫ్ట్ కాదు అన్నయ్య
ఈ విషయాన్ని మెగాబ్రదర్ నాగబాబు వెల్లడించారు. `అప్పట్లో అన్నయ్య కొత్తగా వస్తోన్న హీరో. దీంతో అప్పటికే స్టార్లుగా ఉన్న హీరోయిన్లు అన్నయ్య ముందు కొంత స్టయిల్ కొట్టేవారు. ఇబ్బందులు పెట్టేవారు, ఆయన్ని చులకనగా మాట్లాడేవారు. ఇవన్నీ భరించినంతకాలం భరించాడు. ఒక రోజు తిక్కలేచి తంతాను అన్నట్టుగా లేచాడు. దెబ్బకి ఆ పెద్ద హీరోయిన్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. ఆమె అంతగా అవమానించింది. రెండు మూడు సార్లు, నాలుగైదు సార్లు కాదు, ఏకంగా పది సార్లు. అన్ని సార్లు అంటే పిల్లే అడ్డం తిరుగుతుంది. అలాంటి అన్నీ చేయగలిగే సత్తా ఉండి కూడా భరించాడు. పదకొండో సారి మాత్రం రెచ్చిపోయాడు. `చంపేస్తా జాగ్రత్త, ఎదవ వేషాలు నా వద్ద వేయోద్దు` అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు కనిపించిన చిరంజీవి వేరు. ఇప్పుడు చాలా సాఫ్ట్ అయ్యాడు, ఇంకా సాఫ్ట్ అయ్యాడు. కానీ బేసిక్‌గా అన్నయ్య చాలా అగ్రెసివ్ పర్సన్` అని తెలిపారు నాగబాబు.
అన్నయ్య అగ్రెసివ్ పర్సన్ కాని ఎప్పుడూ ఔట్ ఆఫ్ కంట్రోల్ వెల్లలేదు
చెన్నైలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ హరిప్రసాద్, సుధాకర్‌లతో కలిసి ఉండేవారు. పాండీబజార్‌లో ఎవరో ఇబ్బంది పెడితే వెళ్లి వారికి వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. అన్నయ్య చాలా గట్టివాడు. కాకపోతే ఎప్పుడూ దాన్ని ఔట్ ఆఫ్ కంట్రోల్ వెల్లలేదు. అలా వెళ్లి ఉంటే ఏదో జరిగిపోయేది, ఎక్కడో ఉండేవాడు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి. తన లక్ష్యం వేరు, మధ్యలో ఇవన్నీ పట్టించుకోకూడదని ఆయన లెక్కచేయలేదు. తాను అనుకున్నది సాధించే దిశగా వెళ్లాడు. సాధించాడు` అని తెలిపారు నాగబాబు. కిరణ్ టీవీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు ఈ విషయాలను వెల్లడించారు.