MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • గంగవ్వకు నాగ మణికంఠ విలువైన బహుమతి, సంచలన ప్రకటన చేసిన మాజీ కంటెస్టెంట్! 

గంగవ్వకు నాగ మణికంఠ విలువైన బహుమతి, సంచలన ప్రకటన చేసిన మాజీ కంటెస్టెంట్! 

7వ వారం ఎలిమినేట్ అయిన నాగ మణికంఠ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కాగా అతడు గంగవ్వకు ఓ విలువైన గిఫ్ట్ ప్రకటించాడు.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Oct 23 2024, 07:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన రోజు నుండే నాగ మణికంఠ ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. గంగవ్వతో ముచ్చట్లు పెట్టేవాడు. ఇద్దరి మధ్య కొంత అనుబంధం అయితే ఏర్పడింది. తన భార్య పిల్లల గురించి కూడా గంగవ్వతో చెబుతుండేవాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎలిమినేటైన నాగ మణికంఠ వరుస ఇంటర్వ్యూలతో బిజీ ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. విన్నర్ ఎవరయ్యే ఛాన్స్ ఉందని అడగ్గా.. అప్పుడే చెప్పలేం. ఎవరైతే నిజాయితీగా గేమ్ ఆడతారో వారిదే విజయమని నాగ మణికంఠ వెల్లడించాడు. 

టైటిల్ కొట్టాలని బిగ్ బాస్ షోకి వెళ్ళాను. కానీ ఆరోగ్యం సహకరించలేదు. ఒక వేళ ప్రైజ్ మనీ గెలిస్తే ఆ డబ్బులు హెచ్ ఐ వి బారిన పడిన చిన్నారుల కోసం ఖర్చు చేసేవాడినని నాగ మణికంఠ అన్నాడు. ఒకసారి ఆసుపత్రిల హెచ్ ఐ వీ పాజిటివ్ కిడ్ ని చూసి చలించిపోయానని, అందుకే వారికి ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చినట్లు నాగ మణికంఠ తెలియజేశాడు. 

36
Bigg boss telugu 8

Bigg boss telugu 8

కాగా నాగ మణికంఠ గంగవ్వకు గిఫ్ట్ ప్రకటించడం విశేషం. ఆమె బయటకు వచ్చాక అర్ధ తులం బంగారం ఇస్తానని అన్నాడు. నాగ మణికంఠ చేసిన వాగ్దానానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. గంగవ్వపై మణికంఠకు ఇంత ప్రేమ, అభిమానం ఉన్నాయా అని బిగ్ బాస్ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. 

అనూహ్యంగా నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు.  నాగ మణికంఠ స్ట్రాంగ్ ప్లేయర్ అనడంలో సందేహం లేదు. నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ... అతడు కంటెంట్ ఇచ్చేవాడు. మొదటి వారమే కన్నీటి గాథలు మొదలుపెట్టడంతో ఒకింత విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇతడు మరో పల్లవి ప్రశాంత్. సింపతీ గేమ్ తో టైటిల్ విన్నర్ కావాలని అనుకుంటున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 
 

46

నాగ మణికంఠ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడని రోజులు గడిచే కొద్దీ అర్థమైంది. హౌస్ మొత్తాన్ని నాగ మణికంఠ కన్ఫ్యూషన్ లో పడేశాడు. అతడి పట్ల ఎలా ప్రవర్తించాలో కంటెస్టెంట్స్ కి అర్థం కాని పరిస్థితి. ఒక దశలో నాగ మణికంఠను అందరూ టార్గెట్ చేశారు. అది వాళ్లకు మైనస్ అవుతుందని, అతడికి ప్లస్ అవుతుందనే సందేహం మరలా వారిలో కలిగింది. 

నాగ మణికంఠ సింపతీ గేమ్ తనను టార్గెట్ చేస్తున్న కంటెస్టెంట్స్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందనే చర్చ హౌస్లో మొదలైంది. అంతగా నాగ మణికంఠ ఇతర కంటెస్టెంట్స్ మైండ్స్ ట్యూన్ చేశాడు. అదే సమయంలో అమ్మాయిలతో నాగ మణికంఠ ప్రవర్తన విమర్శలకు దారి తీసింది. నాగ మణికంఠ హగ్ చేసుకోవడం నాకు నచ్చలేదని యష్మి అసహనం ప్రదర్శించింది. 
 

56


యష్మితో పాటు ఇతర లేడీ కంటెస్టెంట్స్ ని కూడా నాగ మణికంఠ అవసరం ఉన్నా లేకున్నా హగ్ చేసుకునేవాడు. సోనియా ఆకులను పక్కకు తీసుకెళ్లి హగ్ కావాలని అడిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయినప్పటికి ప్రేక్షకుల్లో నాగ మణికంఠకు క్రేజ్ ఏర్పడింది. దాదాపు ప్రతి వారం నామినేషన్స్ లో ఉంటున్న నాగ మణికంఠ ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అయ్యాడు. 

7వ వారం సైతం నాగ మణికంఠ ఓటింగ్ లో టాప్ 3-4 లో ఉన్నాడు. టేస్టీ తేజ, గౌతమ్ చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు సమాచారం. ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం గౌతమ్ ఎలిమినేట్ కావాల్సింది. కానీ నాగ మణికంఠ స్వయంగా వెళ్లిపోతానని చెప్పడంతో... నాగార్జున ఫైనల్ గా కంటెస్టెంట్స్ ఓటింగ్ తీసుకున్నాడు. మెజారిటీ ఇంటి సభ్యులు నాగ మణికంఠకు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో ఎలిమినేట్ అయ్యాడు. 

66

కాగా తాను బిగ్ బాస్ షోకి వచ్చిందే భార్య పిల్లల కోసమని నాగ మణికంఠ పలుమార్లు వెల్లడించాడు. వారు తనకు దక్కాలన్న, అత్తారింటిలో గౌరవం పొందాలన్న బిగ్ బాస్ టైటిల్ గెలవాలి అనేవాడు. అలాంటి నాగ మణికంఠ ప్రేక్షకుల అభిప్రాయానికి వ్యతిరేకంగా, బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చేశాడు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image2
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image3
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved