MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • రైతు బిడ్డ జల్సాలు మామూలుగా లేవుగా, అందుకు శివాజీ సపోర్ట్... మరి సాయం సంగతి ఏమిటీ?

రైతు బిడ్డ జల్సాలు మామూలుగా లేవుగా, అందుకు శివాజీ సపోర్ట్... మరి సాయం సంగతి ఏమిటీ?

పల్లవి ప్రశాంత్ లగ్జరీ కారు కొన్నాడు. కారు కొనేందుకు తన గురు శివాజీని వెంటబెట్టుకుని పోయాడు. కొత్త కారు కోన్ ఆనందాన్ని తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. అయితే పల్లవి ప్రశాంత్ బాధ్యతను నెటిజెన్స్ గుర్తు చేస్తున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : May 30 2024, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Pallavi Prashanth

Pallavi Prashanth

బిగ్ బాస్ సీజన్ 7 లో సంచలనం నమోదు అయ్యింది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి పల్లవి ప్రశాంత్ కప్పు గెలవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Pallavi Prashanth

Pallavi Prashanth

బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షల నగదు బహుమతిని అందుకున్నాడు. రూ. 50 లక్షలు ప్రైజ్ మనీ కాగా... ప్రిన్స్ యావర్ 4వ స్థానంలో రూ. 15 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకున్నాడు. దాంతో పల్లవి ప్రశాంత్ పొందాల్సిన ప్రైజ్ మనీ తగ్గింది. నగదు బహుమతితో పాటు ఒక కారు, నెక్లెస్ కూడా ఇచ్చారు. 
 

38
Pallavi Prashanth

Pallavi Prashanth

మారుతీ సుజుకీ బ్రీజా కారు ధర రూ. 15 లక్షలు. నెక్లెస్ ధర కూడా రూ. 15 లక్ష్లలు. ఈ బహుమతులు పల్లవి ప్రశాంత్ కి వెంటనే ఇవ్వలేదు. షో ముగిసిన ఐదు నెలలకు జాన్ అలుకాస్ ప్రకటించిన నెక్లెస్ పల్లవి ప్రశాంత్ కి అందజేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పల్లవి ప్రశాంత్ తెలియజేశాడు.

48
Pallavi Prashanth

Pallavi Prashanth

కాగా బహుమతులు కాకుండా ప్రైజ్ మనీ రూ. 35 లక్షలు పేద రైతులకు పంచుతానని పల్లవి ప్రశాంత్ ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. టాక్స్ కటింగ్స్ పోను పల్లవి ప్రశాంత్ కి రూ. 16 లక్షలు వస్తాయట. ఈ మొత్తం పల్లవి ప్రశాంత్ పేద రైతులకు దానం చేయాల్సి ఉంది. 
 

58
Pallavi Prashanth

Pallavi Prashanth

కాగా పల్లవి ప్రశాంత్ తాజాగా ఓ లగ్జరీ కారు కొన్నాడు. మారుతీ సుజుకీ చెందిన రెడ్ కలర్ ఓపెన్ టాప్ కారును సొంతం చేసుకున్నాడు. దీనికి సంబందించిన వీడియో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. 

68
Pallavi Prashanth

Pallavi Prashanth

తన గురువు శివాజీతో పాటు ఈ కారు కొనేందుకు పల్లవి ప్రశాంత్ షో రూమ్ కి వెళ్ళాడు. కారు డెలివరీ తీసుకున్న వెంటనే మొదటి డ్రైవ్ శివాజీ చేశాడు. అనంతరం ఓపెన్ టాప్ నుండి శివాజీ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ పరిణామం కొందరికి కాలుతుంది అన్నాడు. సామాన్యుడు పైకి రావాలని అన్నాడు. 

78
Pallavi Prashanth

Pallavi Prashanth

పల్లవి ప్రశాంత్ కారు కొనడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ పేద రైతులకు ప్రైజ్ మనీ పంచకుండా లగ్జరీలు ఎంజాయ్ చేయడమే జనాలకు నచ్చడం లేదు. రూ. 35 లక్షలు ప్రైజ్ మనీగా తీసుకున్న పల్లవి ప్రశాంత్ కేవలం రూ. 1 లక్ష మాత్రమే పంచాడు. ఆ సాయం చేసి నెలలు గడుస్తున్నా మరొక సాయం చేయలేదు. 

 

88
Pallavi Prashanth

Pallavi Prashanth

సామాన్యుడిగా టైటిల్ గెలిచి పల్లవి ప్రశాంత్ చేసే పనులు ఓటు వేసిన వాళ్లకు నచ్చడం లేదు. శివాజీ అతన్ని ప్రోత్సహిస్తున్నారు. డబ్బులు పంచే విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నాడు. మరి భవిష్యత్ లో అయినా పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ పంచుతాడో లేదో చూడాలి.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image2
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image3
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved