అమర్ దీప్ కి మరోసారి అవమానం... చీరల గురించి ఆ ప్రశ్న ఏంటి సామీ!
హౌస్లోనే కాదు బయట కూడా అమర్ ని బకరా చేశారు స్పై బ్యాచ్. మనోడి అమాయకత్వాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు.హౌస్ నుండి బయటకు వచ్చాక మొదటిసారి కలిసిన స్పై-స్పా బ్యాచ్ మధ్య ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి.

BB Utsavam
బిగ్ బాస్ తెలుగు 7 అనేక వివాదాలకు నెలవైంది. హౌస్లో శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ ఒక టీమ్ గా అమర్ దీప్, ప్రియాంక, శోభ మరొక టీమ్ గా పోటీపడ్డారు. వీరి మధ్యే మాటల యుద్ధం జరిగేది.

BB Utsavam
షో ముగిశాక కూడా గొడవలు చోటు చేసుకున్నాయి. అమర్ దీప్ మీద పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టి దుర్భాషలాడారు. అలాగే ఇంటర్వ్యూల్లో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్ టార్గెట్ గా అమర్ దీప్ ఆరోపణలు చేయగా.. అమర్ పై శివాజీ విమర్శలు గుప్పించాడు.
BB Utsavam
ఈ గొడవల నేపథ్యంలో స్పై బ్యాచ్-స్పా బ్యాచ్ కలవలేదు. మిగతా కంటెస్టెంట్స్ తో గెట్ టుగెదర్ లు ఏర్పాటు చేసుకున్నారు కానీ... అమర్, శోభ, ప్రియాంకలతో శివాజీ, పల్లవి ప్రశాంత్, కలవలేదు. అయితే బీబీ ఉత్సవం ఈవెంట్ కోసం వీరు ఒకే వేదిక మీదకు చేరాల్సి వచ్చింది.
BB Utsavam
శ్రీముఖి యాంకర్ గా స్టార్ మా బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్స్ తో బీబీ ఉత్సవం షో ఏర్పాటు చేసింది. ఈ షోలో అమర్ దీప్ ని మరోసారి బకరా చేశారు స్పై బ్యాచ్. అమర్ దీప్ హౌస్లో చిన్న చిన్న లాజికల్ క్వచ్చన్స్ కి సమాధానం చెప్పలేక తన అమాయకత్వం నిరూపించుకున్నాడు.
BB Utsavam
ఈ క్రమంలో బీబీ ఉత్సవంలో కూడా అలాంటి సింపుల్ లాజికల్ క్వచ్చన్ అమర్ దీప్ ని శ్రీముఖి అడిగింది. ఒక చీర ఆరడానికి 30 నిమిషాల సమయం పడితే 30 చీరలు ఆరడానికి ఎంత సమయం పడుతుంది? అని అడిగింది. ఆ ప్రశ్నకు అమర్ దీప్ ముఖం మాడిపోయింది.
BB Utsavam
శివాజీ అక్కడి నుండి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోయాడు. హౌస్లో అమర్ ని బకరాని చేసిన బిగ్ బాస్... బీబీ ఉత్సవంలో కూడా అదే పని చేశాడు. దాంతో అమర్ దీప్ అంటే అంత అలుసా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
BB Utsavam
ఈ షోలో పల్లవి ప్రశాంత్ కి రతికా రోజ్ సారీ చెప్పింది. హౌస్లో నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, మనసులో పెట్టుకోకు అని చెప్పింది. శివాజీ-నయని పావని మధ్య ఎమోషనల్ సీన్ చోటు చేసుకుంది.