- Home
- Entertainment
- Bigg Boss Telugu 6: బిగ్ బాస్ వేదికపై బాలయ్య... అతిపెద్ద రియాలిటీ షో ఫినాలేకి సిద్ధం కండి!
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ వేదికపై బాలయ్య... అతిపెద్ద రియాలిటీ షో ఫినాలేకి సిద్ధం కండి!
బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా బాలయ్య వస్తున్నారనే న్యూస్ కాకరేపుతుంది. అదే జరిగితే టీఆర్పీ బాక్సులు పగిలిపోతాయని అందరూ అంచనాలు వేస్తున్నారు.

Bigg Boss Telugu 6
వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 18 ఆదివారం జరగనుంది. అంటే ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. హౌస్లో ఆదిరెడ్డి, రోహిత్, రేవంత్, శ్రీహాన్, కీర్తి ఉన్నారు. ఈ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ నుండి ఒకరు విన్నర్ గా టైటిల్ అందుకోనున్నారు.
Bigg Boss Telugu 6
బిగ్ బాస్ ఫినాలే ఫీవర్ తెలుగు రాష్ట్రాల్లో మొదలైపోయింది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ నడుస్తుంది. ఎవరికి వారు తమ అభిమాన కంటెస్టెంట్ విన్నర్ కావాలని కోరుకుంటున్నారు. సదరు కంటెస్టెంట్ కి అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు . శుక్రవారం వరకు వారి ఫేవరెట్ కంటెస్టెంట్ గెలుపు కోసం ఓట్లు వేసిన ఆడియన్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటిస్తున్నారు.
విన్నర్ ఆయనే అంటూ కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నప్పటికీ ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు చెప్పలేం. కాబట్టి టైటిల్ అందుకునే ఛాన్స్ ఫైనల్ కి చేరిన ఐదుగురు కంటెస్టెంట్స్ కి ఉంది. వారు ఎంతో కష్టపడ్డారు కాబట్టే ఆటలో చివరి వరకు నిలిచారు.
Bigg Boss Telugu 6
బిగ్ బాస్ ఇంటిలో వారాల తరబడి ఉండటం అంత సులభం ఏమీ కాదు. కంటెస్టెంట్స్ మానసికంగా, శారీరకంగా యుద్ధం చేయాల్సి ఉంటుంది. కొన్ని టాస్క్స్ లో దెబ్బలు తగులుతాయి. పొరపాటున మేజర్ ప్రమాదానికి గురైతే మధ్యలో షో నుండి బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఫైనల్ కి చేరిన కీర్తి చేతి వేలు విరగ్గొట్టుకుంది. ఒక టాస్క్ లో ఆమె ఏలికి గాయమైంది. అది ఇంకా మానలేదు.
Bigg Boss Telugu 6
అందుకే బిగ్ బాస్ విన్నర్ కి పెద్ద మొత్తం ప్రైజ్ మనీగా అందిస్తారు. బిగ్ బాస్ తెలుగు 6(Bigg Boss Telugu 6) విన్నర్ టైటిల్ తో పాటు రూ. 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుపొందుతాడు. అలాగే రూ. 25 లక్షల రూపాయల విలువైన సువర్ణ భూమి ప్లాట్ సొంతం అవుతుంది. అలాగే మారుతీ సుజుకీ తరఫునుండి, బ్రీజా కార్ దక్కుతుంది.
Bigg Boss Telugu 6
కాగా బిగ్ బాస్ తెలుగు 6 గ్రాండ్ ఫినాలే గెస్ట్ అంటూ నటసింహం బాలకృష్ణ పేరు వినిపిస్తుంది. ఆయన ఫినాలేలో నాగార్జునతో పాటు బిగ్ బాస్ వేదికపై సందడి చేయనున్నాడట. అన్ స్టాపబుల్ షోతో హోస్ట్ గా తానేమిటో నిరూపించిన బాలకృష్ణ(Balakrishna) బిగ్ బాస్ షో ఫినాలే గెస్ట్ గా వస్తే టీఆర్పీ బాక్సులు బద్దలవుతాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Bigg Boss Telugu 6
బాలకృష్ణ వస్తే ఎపిసోడ్ కి చాలా ప్లస్ అవుతుంది. లాంచింగ్ ఎపిసోడ్ విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులకు భారీ షాక్ తగిలింది. దారుణమైన టీఆర్పీ ఆ ఎపిసోడ్ కి వచ్చింది. ఈ క్రమంలో బాలయ్యను ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఆయన వస్తే బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలే ఎపిసోడ్ రికార్డు టీఆర్పీ రాబట్టడం ఖాయం.