నా కూతురు జెన్యూన్ అర్జున్ కళ్యాణ్ ట్రై చేశాడు... శ్రీసత్య ఫాదర్ కామెంట్స్ వైరల్
కంటెస్టెంట్స్ శ్రీసత్య-అర్జున కళ్యాణ్ రిలేషన్ పై ఆమె ఫాదర్ స్పందించారు. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రచారం అవుతున్న పుకార్లకు చెక్ పెట్టారు.

Bigg Boss Telugu 6
శ్రీసత్య తండ్రి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ... రోడ్డుపై అన్నా చెల్లెలు వెళుతున్నా వారి రిలేషన్ ఏమిటో తెలుసుకోకుండా కామెంట్స్ చేసే పరిస్థితి నేడు ఉంది. శ్రీసత్యకు అర్జున్ కళ్యాణ్ తో ఉన్న రాపో చూసి కొన్ని ఛానల్స్ తప్పుగా కథనాలు ప్రసారం చేశాయి. అర్జున్ కళ్యాణ్, శ్రీసత్య మంచి ఫ్రెండ్స్ మాత్రమే. శ్రీసత్యకు అర్జున్ కళ్యాణ్ కి బాగా తెలిసిన వ్యక్తి. అందుకే ఎలిమినేషన్ రోజు నేను చూసుకుంటాను అన్నాడు. అర్జున్ కళ్యాణ్ మంచి అబ్బాయి.
Bigg Boss Telugu 6
హౌస్లో శ్రీసత్య నా క్రష్ అని ఎందుకు చెప్పాడో నాకు తెలియదు. అతను శ్రీసత్యకు ఫ్రెండ్ మాత్రమే. తర్వాత దీనిపై అతడు క్లారిటీ ఇచ్చాడు. హౌస్ నుండి బయటకు వచ్చాక అర్జున్ కళ్యాణ్ పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూలు నేను చూశాను. హౌస్లో నిజంగా అతడు అలా అన్నాడో లేక నిర్వాహకులు చూపించారో తెలియదు. ఎందుకంటే... టీఆర్పీ కోసం రియాలిటీ షోస్ లో ఇలా చేస్తారు.
Bigg Boss Telugu 6
శ్రీసత్య కారణంగానే అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు అనడంలో కూడా నిజం లేదు. శ్రీసత్య నాకూతురు. ఆమె ఇంటి సభ్యులు అందరితో ఒకే రకమైన రాపో కలిగి ఉంది. అర్జున్ మాత్రం శ్రీసత్యకు ట్రై చేశాడు. కానీ శ్రీసత్య రిజెక్ట్ చేస్తూనే ఉంది. ఒకసారి తాకకుండా మాట్లాడు అని చెప్పింది. నేను అలా కాదు, నువ్వు ఎలాంటి రిలేషన్స్ ఊహించుకోకు అని చెప్పింది.
Bigg Boss Telugu 6
శ్రీసత్య లాంటి అందమైన అమ్మాయి భార్యగా రావాలని అందరూ కోరుకుంటారు. అర్జున్ కళ్యాణ్ కూడా శ్రీసత్యను అలా ఊహించుకొని ఉండవచ్చు. శ్రీసత్య నాకూతురు. ఆమె మాత్రం జెన్యూన్ గా వ్యవహరించింది. ఇక జనాల పుకార్లు నేను లెక్క చేయను, అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Bigg Boss Telugu 6
మొదటి వారం నుండి అర్జున్ కళ్యాణ్ శ్రీసత్యను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. శ్రీసత్య ఫాదర్ చెప్పినట్లు ఆమె స్పందించలేదు. అర్జున్ మాత్రం ఆమె కోసం గేమ్ వదిలేయడం, త్యాగాలు చేయడం చేశాడు. దీనికి కొన్ని శిక్షలు కూడా అనుభవించాడు. ఎలిమినేషన్ రోజు శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్ ఒకరి కోసం మరొకరు ఏడ్చుకున్నారు. దీంతో కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి.