MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బయటపడ్డ బిగ్ బాస్ మోసం పైడ్ ఆర్టిస్ట్స్ తో అలాంటి పనులు... అమ్మ నాగార్జునా నీ హస్తం కూడా ఉందా!

బయటపడ్డ బిగ్ బాస్ మోసం పైడ్ ఆర్టిస్ట్స్ తో అలాంటి పనులు... అమ్మ నాగార్జునా నీ హస్తం కూడా ఉందా!

బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ గురించి ఓ షాకింగ్ విషయం బయటికొచ్చింది. షో కోసం నిర్వాహకులు పెయిడ్ ఆర్టిస్ట్స్ ని రంగంలోకి దించారట. ప్రేక్షకులను నాగార్జున నేతృత్వంలో మోసం చేస్తున్నారట.  

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 27 2022, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

బిగ్ బాస్ షోపై లెక్కకు మించిన అనుమానాలున్నాయి. కంటెస్టెంట్స్ ఎంపిక నుండి టైటిల్ విన్నర్ వరకు అన్నీ సందేహాలే. ఎందుకంటే ఈ షోకి ఎలాంటి ప్రామాణికత లేదు. బిగ్ బాస్ దే తుది నిర్ణయం. ఆయన నిర్ణయాన్ని ఎవరైనా అనుసరించాల్సిందే. అలాగే ప్రేక్షకుల ఓట్లకు లెక్కలు కానీ, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని చెప్పే నాథుడు కానీ ఉండడు. 
 

26

మంచిగా గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్ కి ఓట్లు రాలేదని బయటికి పంపిస్తారు. అదేంటని అడిగితే.. ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయంటారు. సోషల్ మీడియా పోలింగ్స్ కి బిగ్ బాస్ ఓటింగ్ కి పొంతన ఉండదు. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ షో పలుమార్లు విమర్శల పాలైంది. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా కాకుండా తమ ఇష్ట ప్రకారం నిర్వాహకులు ఎలిమినేషన్ కి పాల్పడుతున్నారనే వాదన ఉంది. 

36

ఇదిలా ఉంటే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ లో పాల్గొంటున్న ఆడియన్స్ కూడా ఫేకే అంటూ కొత్త వాదన తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 6 వీకెండ్ ఎపిసోడ్స్ కి ఆడియన్స్ హాజరవుతున్నారు. ఈ ఆడియన్స్  కంటెస్టెంట్ తప్పొప్పులు, పెర్ఫార్మన్స్ పై తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. వాళ్లకు మైక్ ఇచ్చి నాగార్జున ప్రత్యేకంగా మాట్లాడిస్తున్నారు. 
 

46
Bigg boss Telugu 6

Bigg boss Telugu 6


అయితే ఈ ఆడియన్స్ పెయిడ్ ఆర్టిస్ట్స్ అన్న వాదన తెరపైకి వచ్చింది. దానికి రుజువుగా ఓ అమ్మాయిని చూపిస్తున్నారు. బిగ్ బాస్ షో ఆడియన్ గా వచ్చిన ఓ అమ్మాయి శ్రీముఖి హోస్ట్ గా ఆదివారం ప్రసారమైన స్టార్ మా పరివార్ ఈవెంట్ లో కూడా కనిపించింది. దీంతో ప్రణాళిక ప్రకారం కొందరు ఆర్టిస్ట్స్ కి డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ ఆడియన్స్ గా తీసుకువస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ పెయిడ్ ఆర్టిస్టులను ముందుగా ప్రిపేర్ చేసి... తమకు నచ్చిన విధంగా మాట్లాడిస్తున్నారంటున్నారు. 

56


మరి ఈ వాదనలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ... సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. పెద్ద ఎత్తున దీనిపై ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే సరైన టీఆర్పీ రాక నానా కష్టాలు పడుతున్న నిర్వాహకులకు ఇలాంటి ఆరోపణలు తలనొప్పిగా మారాయి. షో క్రెడిబిలిటీ దెబ్బతీస్తూ మరింత డామేజ్ చేస్తున్నాయి. 

66
Image: Nagarjuna Akkineni/Twitter

Image: Nagarjuna Akkineni/Twitter


బిగ్ బాస్ సీజన్ 6 టీఆర్పీ దారుణంగా ఉన్నట్లు సమాచారం. వీక్ డేస్ లో అత్యంత కనిష్టంగా  2 నుండి 2.5 రేటింగ్ మాత్రమే వస్తుందట. వీకెండ్స్ లో కూడా అదే పరిస్థితి అట. శని, ఆదివారాల్లో ఈ రేటింగ్ 3 నుండి 3.5 గా ఉంటుందట. భారీ ఖర్చుతో ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ షోకి వస్తున్న టీఆర్పీ నిర్వాహకులకు నిద్ర లేకుండా చేస్తుందట. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image2
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Recommended image3
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved