MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ

Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ

అగ్ని పరీక్ష 2 ద్వారా బిగ్‌బాస్‌లోకి వెళ్లే అవకాశం కోల్పోయిన రామకృష్ణకు చివరికి వైల్డ్ కార్డ్‌తో ఛాన్స్ దక్కింది. బిగ్‌బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 11 2026, 09:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అగ్ని పరీక్షలో అవకాశం మిస్
Image Credit : Asianet News

అగ్ని పరీక్షలో అవకాశం మిస్

బిగ్‌బాస్ తెలుగు 10లోకి మరో కంటెస్టెంట్ అడుగుపెట్టాడు. అగ్ని పరీక్ష 2 కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన రామకృష్ణ.. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాడు. సామాన్యుల విభాగం నుంచి హౌస్‌లోకి వెళ్లాలని ఆశపడిన ఆయనకు అగ్ని పరీక్షలో అవకాశం దక్కలేదు. ఆ సమయంలో నిరాశ ఎదురైనా, బిగ్‌బాస్‌లోకి వెళ్లాలనే తన లక్ష్యాన్ని మాత్రం ఆయన వదులుకోలేదు. రామకృష్ణ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం కి చెందిన యువకుడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అపూర్వ, మిథిలేశ్‌ వచ్చినప్పుడూ దక్కని ఛాన్స్
Image Credit : Asianet News

అపూర్వ, మిథిలేశ్‌ వచ్చినప్పుడూ దక్కని ఛాన్స్

అగ్ని పరీక్ష 2 తర్వాత బిగ్‌బాస్ తెలుగు 10లోకి వెళ్లేందుకు రామకృష్ణకు మరో అవకాశం వస్తుందని ఆసక్తి నెలకొంది. అయితే అపూర్వ, మిథిలేశ్‌ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి ప్రవేశించిన సమయంలోనూ ఆయనకు చోటు దక్కలేదు. దీంతో బిగ్‌బాస్‌లోకి వెళ్లాలనే ఆయన ప్రయత్నం మరోసారి ఆగిపోయింది. వరుసగా అవకాశాలు చేజారడంతో ఈసారి ఆయనకు అవకాశం వస్తుందా లేదా అనే ఆసక్తి నెలకొంది.

35
ఎట్టకేలకు హౌస్‌లోకి అడుగుపెట్టిన రామకృష్ణ
Image Credit : Asianet News

ఎట్టకేలకు హౌస్‌లోకి అడుగుపెట్టిన రామకృష్ణ

ఇప్పటివరకు ఎదురైన నిరాశలకు తెరదించుతూ రామకృష్ణకు ఎట్టకేలకు బిగ్‌బాస్ తెలుగు 10లోకి ప్రవేశించే అవకాశం వచ్చింది. అక్టోబర్ 11న ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఆయన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. మొదట అగ్ని పరీక్ష ద్వారా దక్కని అవకాశాన్ని ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అందిపుచ్చుకున్నాడు. దీంతో ఆయన బిగ్‌బాస్ ప్రయాణం మొదలైంది.

45
క్యాటరింగ్ చేయాల్సి వచ్చింది
Image Credit : Asianet News

క్యాటరింగ్ చేయాల్సి వచ్చింది

నవరసాలు మావ అంటూ రామకృష్ణ యూట్యూబర్ గా పాపులర్ అయ్యారు. రామకృష్ణకు పోలీస్ ఉద్యోగం సాధించాలనేది కల. అగ్ని పరీక్ష 2 సమయంలో తన వ్యక్తిగత లక్ష్యాల గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. రామకృష్ణ చిన్నతనం నుంచి ఆర్థిక ఇబ్బందులు చూస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తన తల్లిదండ్రులు తమ ముగ్గురు అన్నదమ్ములని చాలా బాగా పెంచారని తెలిపారు. వాళ్ళ కోసం ఏమీ చేయలేకపోయాను అనే బాధ ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యాను. పోలీస్ కావాలనేది నా కల. కానీ ఆర్థిక అవసరాల కోసం క్యాటరింగ్ చేయాల్సి వచ్చింది అని రామకృష్ణ తెలిపారు.

55
బిగ్‌బాస్‌లో రామకృష్ణ ఆట ఎలా ఉండబోతోంది?
Image Credit : Asianet News

బిగ్‌బాస్‌లో రామకృష్ణ ఆట ఎలా ఉండబోతోంది?

అగ్ని పరీక్ష 2లో అవకాశం రాకపోయినా, బిగ్‌బాస్ తెలుగు 10లోకి రావాలనే లక్ష్యాన్ని రామకృష్ణ సాధించాడు. ఇప్పుడు హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్లతో ఆయన ఎలా కలిసిపోతాడు? టాస్కుల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడు? ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకోగలడా? అనేది ఆసక్తికరంగా మారింది. మొదటిసారి చేజారిన అవకాశాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం రామకృష్ణ ముందున్న సవాలు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Recommended image2
Neethu Natraj: నటరాజ్ మాస్టర్ తో ప్రేమ,పెళ్లి.. తెలుగు అమ్మాయి కాదు కానీ.. నీతూ గురించి ఈ విషయాలు తెలుసా
Recommended image3
Dakkshi: కాస్టింగ్ కౌచ్ కష్టాలు దాటుకుని ఆర్జీవీ సినిమాలో ఛాన్స్.. బిగ్ బాస్ లోకి కరోనా వైరస్ బ్యూటీ దక్షి
Related Stories
Recommended image1
Chiranjeevi: నా డబ్బు తిరిగి రావాలంటే చిరంజీవి ఒక్కడే మార్గం..ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్ నే ముంచేసిన డైరెక్టర్
Recommended image2
Dakkshi: కాస్టింగ్ కౌచ్ కష్టాలు దాటుకుని ఆర్జీవీ సినిమాలో ఛాన్స్.. బిగ్ బాస్ లోకి కరోనా వైరస్ బ్యూటీ దక్షి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved