- Home
- Entertainment
- టిల్లుని నమ్ముకుంటే అలా చేశాడు, చెత్త వాగుడు..లిప్స్ అందుకే ఇలా మారాయి.. తప్పు చేశా, శ్రీసత్య కామెంట్స్
టిల్లుని నమ్ముకుంటే అలా చేశాడు, చెత్త వాగుడు..లిప్స్ అందుకే ఇలా మారాయి.. తప్పు చేశా, శ్రీసత్య కామెంట్స్
తన లిప్స్ ఇలా మారడానికి బిగ్ బాస్ శ్రీసత్య కారణం తెలిపింది. అదే విధంగా సినిమాల్లో అవకాశాలు అడుగుతుంటే కొందరు చెత్తగా వాగుతున్నారని పేర్కొంది.

బుల్లితెర నటి శ్రీసత్య బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని అందరిని ఆకర్షించింది. అప్పటి వరకు సీరియల్ నటిగా ఉన్న శ్రీసత్య బిగ్ బాస్ తర్వాత క్రేజీ సెలబ్రిటిగా మారింది. క్రేజ్ అయితే వచ్చింది కానీ అది వర్కౌట్ కావడంలేదు. ఎలాగైనా సినిమాల్లో నటిగా రాణించాలనేది శ్రీసత్య కల.
కానీ కల నెరవేరడం లేదు. కొన్ని ఆఫర్స్ వచ్చినా చివరికి ఎడిటింగ్ లో లేచిపోతున్నాయి. డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ లో ఛాన్స్ వచ్చింది. సంగీత్ సాంగ్ లో నేను డ్యాన్స్ చేశాను. కానీ ఎడిటింగ్ లో మొత్తం తీసేశారు. ఎక్కడో ఒక చోట హాఫ్ సెకండ్ మాత్రమే చూపించారు అని శ్రీసత్య వాపోయింది.
దీనితో శ్రీసత్య చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోందట. అందం విషయంలో శ్రీసత్యకి తిరుగులేదు. అయినప్పటికీ ఆమెకి ఛాన్సులు రావడం లేదు. సినిమా ఆఫర్స్ అడుగుతుంటే ఒక్కొక్కరు ఒక్కోరకంగా కామెంట్స్ చేస్తున్నారట.
కొందరతే నువ్వు సీరియల్స్ లో నటిస్తున్నావు కాబట్టి ఆఫర్స్ రావు అని చెప్పారు. దీనితో సీరియల్స్ లో నటించడం మానేశా. ఇంకొందరు నీ లిప్స్ చూస్తుంటే చిన్న పిల్లలా అనిపిస్తున్నావు అని అన్నారు. అందుకే ఆఫర్స్ ఇవ్వకుండా మానేస్తున్నారు. దీనితో లిప్స్ కి పిల్లర్స్ చేయించుకున్నా. అందుకే లిప్స్ ఇలా మారాయి అని శ్రీసత్య క్లారిటీ ఇచ్చింది.
శ్రీసత్య పెదాలకు సర్జరీ చేయించుకుని చెడగొట్టుకుంది అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై శ్రీసత్య స్పందించింది. పెదాలు మూడు నాలుగు నెలలు మాత్రమే ఇలా కనిపిస్తాయి. ఆ తర్వాత నార్మల్ గా ఉంటాయి అని తెలిపింది. కొన్ని డ్యాన్స్ షోలలో చేస్తున్నా. ఎవరి పక్కన డ్యాన్స్ చేస్తున్నా వారితో సంబంధం అంటగట్టేస్తున్నారు. ఇద్దరి మధ్య ఏదో ఉందని చెత్తగా వాగుతున్నారు. అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నారు.
ఎంటర్టైన్మెంట్ వేరు.. పర్సనల్ లైఫ్ వేరు. దయచేసి రెండింటిని కలిపి చూడొద్దు అని శ్రీసత్య అంటోంది. ఇక బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పే. ఆ విషయం తెలుసుకున్న తర్వాత వాటి జోలికి వెళ్ళలేదు అని శ్రీసత్య పేర్కొంది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినప్పుడు నన్ను నమ్మి మోసపోయిన వారికి నా సొంత డబ్బులు ఇచ్చానని శ్రీసత్య తెలిపింది. ఇకపై ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని తేల్చేసింది.