రెచ్చగొట్టి పైశాచిక ఆనందం పొందే వ్యక్తి శ్రీసత్య.. అర్జున్ ని నాగ్ ఆడేసుకున్నారుగా
బిగ్ బాస్ సీజన్ 6 35 వ ఎపిసోడ్ శనివారం చాలా ఫన్ ఎలిమెంట్స్ తో సాగింది. వీకెండ్ కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యుల మధ్య ఎప్పటిలాగే చిన్న చిన్న మనస్పర్థలు, సంభాషణలతో శనివారం ఎపిసోడ్ మొదలైంది.

బిగ్ బాస్ సీజన్ 6 35 వ ఎపిసోడ్ శనివారం చాలా ఫన్ ఎలిమెంట్స్ తో సాగింది. వీకెండ్ కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యుల మధ్య ఎప్పటిలాగే చిన్న చిన్న మనస్పర్థలు, సంభాషణలతో శనివారం ఎపిసోడ్ మొదలైంది. ఇక నాగార్జున ఇంటి సభ్యులతో ముచ్చటిస్తూ ఒక్కొక్కరి ఆటతీరు గురించి ఈ వారం అనుభవాల గురించి తెలుసుకున్నాడు.
రేవంత్ మాట్లాడుతూ.. కెప్టెన్సీ అనుకున్నంత ఈజీ కాదు సర్ అని తెలిపాడు. ఇక నాగార్జున ఈ ఐదు వారాలలో ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ అని తెలుసుకునేందుకు సరదాగా ఒక గేమ్ పెట్టారు. ముందుగా చాలా సన్నిహితంగా ఉంటున్న సూర్య, ఇనయలని వేర్వేరు బోన్ లలో నిలబెట్టారు. వీరిద్దరిలో ఎవరు ఫ్లాప్ ఎవరు హిట్ అనేది బోన్ లో నిల్చుని అభిప్రాయం చెప్పాలి. సూర్య తాను హిట్ అని అన్నాడు. ఇనయ హౌస్ లో కేవలం కెమెరాల కోసమే ఉన్నట్లు ఉంటుంది అని అందుకే ఆమె ఫ్లాప్ అని తెలిపాడు.
ఇతర ఇంటి సభ్యులు కూడా సూర్య హిట్ అని తేల్చారు. అనంతరం ఆదిరెడ్డి, గీతూ బోన్ లోకి వెళ్లగా ఆదిరెడ్డి హిట్ అని ఇంటి సభ్యులు తేల్చేశారు. అలాగే చంటి, సుదీప బోన్ లోకి వెళ్లగా.. చంటి తనని తానే ఫ్లాప్ గా డిసైడ్ చేసుకున్నాడు. నువ్వు చెప్పే మాటలని ప్రేక్షకులు గమనిస్తున్నారు అంటూ నాగార్జున వార్నింగ్ ఇచ్చారు. అర్జున్,వాసంతి బోన్ లోకి వెళ్ళగా నవ్వులు విరిశాయి. నాగార్జున తరచుగా అర్జున్ , సత్య గురించి సెటైర్లు వేస్తూనే ఉన్నాడు.
అర్జున్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో చిక్కుకుపోయాడు అని నాగార్జున అనడంతో ఇంటి సభ్యులు అంతా నవ్వేశారు. చివరకి వాసంతి హిట్ అని.. అర్జున్ ఫ్లాప్ అని ఇంటి సభ్యులు తేల్చారు. ఇక నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేసే ప్రక్రియ మొదలైంది. చంటి, బాలాదిత్య, ఫైమా, వాసంతి, అర్జున్, ఇనయ, ఆది రెడ్డి, మెరీనా నామినేషన్స్ లో ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి ఒక్కో బెలూన్ ఇచ్చారు.
బెలూన్ పగలగొట్టగా అందులో ఒక చీటీ ఉంటుంది. ఆ చీటీ తెరచి చూస్తే వాళ్ళు సేఫ్ , అన్ సేఫ్ అనేది తెలుస్తుంది. ఇందులో ఆదిరెడ్డి మాత్రమే సేఫ్ అయ్యాడు. మరోసారి నామినేషన్ ప్రక్రియ నిర్వహించగా అందులో ఫైమా సేవ్ ఐంది. ఇక శ్రీహన్, శ్రీసత్య బోన్ లోకి వెళ్లగా.. శ్రీహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
శ్రీసత్య ఎదుటివాళ్ళని రెచ్చగొట్టి ఫైసాచిక ఆనందం పొందుతుంది అని చెప్పాడు. ముఖ్యంగా అర్జున్ ని ఏడిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుందని అని తెలిపాడు.శ్రీసత్య .. శ్రీహన్ తో డ్యాన్స్ చేస్తుండగా.. అర్జున్ ఎలా బాధపడుతున్నాడో నాగార్జున వీడియో రూపంలో చూపించారు. దీనితో ఇంటి సభ్యులంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఇక చివరగా రేవంత్ ఒక్కడే మిగిలాడు. రేవంత్ కెప్టెన్సీ బావుందని ఎక్కువమంది ఇంటి సభ్యులు తెలిపారు. దీనితో రేవంత్ హిట్ అని నాగార్జున తేల్చారు. మరోసారి నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించగా బాలాదిత్య సేఫ్ అని తేలాడు.