బిగ్ బాస్ సంజన చెల్లెలు, స్టార్ హీరోయిన్, తెలుగు హీరో భార్య ఎవరో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో సంజన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సంజన చెల్లెలు ఇండస్ట్రీలో హీరోయిన్ అని మీకు తెలుసా? ఆమె స్టార్ హీరోభార్య కూడా. ఇంతకీ ఎవరామె.

రసవత్తరంగా బిగ్ బాస్ 9
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు రసవత్తరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే రెండో వారంలోకి ప్రవేశించింది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా, వారిలో తొలివారంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం హౌస్‌లో 14 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వారితో ప్రత్యేకంగా నిలిచింది సంజనా
బిగ్ బాస్ లో సంజనా గల్రానీ
ఈసారి హౌస్‌లోకి ప్రవేశించిన కంటెస్టెంట్స్‌లో ప్రముఖ నటి సంజనా గల్రానీ ఒకరు. ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా కనిపించిన సంజనా, కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. ఇదే సమయంలో మాదక ద్రవ్యాల కేసులోనూ ఆమె పేరు తెరపైకి రావడంతో వార్తల్లో నిలిచారు. ఆమె పెళ్లి కూడా ఒకసారి సోషల్ మీడియాలో పెద్దగా చర్చకు దారితీసింది.
ఫస్ట్ కెప్టెన్ గా షాక్ ఇచ్చిన సంజనా
హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే సంజనా ఆటతీరు మరింత నెగెటివ్‌గా కనిపించింది. తోటి కంటెస్టెంట్లు ఆమెతో సానుకూలంగా లేకపోవడమే కాకుండా, సోషల్ మీడియాలోనూ ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కెప్టెన్సీ టాస్క్‌లో అనూహ్యంగా విజయాన్ని సాధించిన సంజనా, బిగ్‌బాస్ సీజన్ 9కి ఫస్ట్ కెప్టెన్‌గా ఎంపికై అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
సంజనా గల్రానీ చెల్లెలు నిక్కీ గల్రానీ
అయితే సంజనా గల్రానీ చెల్లెలు ఓ హీరోయిన్ అని మీకు తెలుసా? టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేయడంతో పాటు ఆమె ఓ హీరోను కూడా పెళ్లాడిందని తెలుసా? ఆమె చెల్లెలు ఎవరో కాదు నిక్కీ గల్రానీ. టాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో ఆమె హీరోయిన్. నిక్కీ గల్రానీ తెలుగు ప్రేక్షకులకు మలుపు, కృష్ణాష్టమి సినిమాల ద్వారా పరిచయం. సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి చిత్రంలో నిక్కీ హీరోయిన్‌గా నటించింది.
ఆది పినిశెట్టితో పెళ్లి
2022లో హీరో ఆది పినిశెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకుంది నిక్కీ. మలుపు సినిమా షూటింగ్ సమయంలో నిక్కీ, ఆది పినిశెట్టి మధ్య ప్రేమ చిగురించింది. అది కాస్తా పెళ్లితో ముగిసింది. 2022 మార్చిలో ఎంగేజ్‌మెంట్, అదే ఏడాది మేలో పెళ్లి జరిగింది. ప్రస్తుతం నిక్కీ సినిమాలకు కొంత విరామం ఇచ్చి, మ్యారెడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుండగా, ఆది మాత్రం వెబ్ సిరీస్‌లతో సహా సినిమాలలో బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన అతని వెబ్‌సిరీస్ మయసభ సూపర్ హిట్‌గా నిలిచింది.
సంజనా ఏం చేయబోతోంది
బిగ్‌బాస్ హౌస్‌లో గతవారం కెప్టెన్‌గా ఉన్న సంజనా గల్రానీ, ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యింది. ఇక ఆమెపై దాడికి రెడీగా ఉన్నారు కంటెస్టెంట్స్..నెక్ట్స్ వీక్ పక్కాగా నామినేట్ చేసి, ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు. మరి ఆమె ఆటతీరుతో ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలను రాబట్టే అవకాశం ఉందో చూడాలి. . రాబోయే రోజుల్లో ఆమె హౌస్‌లో ఎలా ప్రదర్శిస్తుందనేది ఆసక్తికర అంశంగా మారింది.