MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్‌ బాస్‌ టాస్క్ ని అడ్డు పెట్టుకుని తమ కోర్కెలు తీర్చుకుంటున్న కంటెస్టెంట్లు.. హగ్‌లు, గోరుముద్దులు.. ఇంకా

బిగ్‌ బాస్‌ టాస్క్ ని అడ్డు పెట్టుకుని తమ కోర్కెలు తీర్చుకుంటున్న కంటెస్టెంట్లు.. హగ్‌లు, గోరుముద్దులు.. ఇంకా

బిగ్‌ బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ రియాలిటీ షో 23వ రోజు ఎపిసోడ్‌ మాస్‌ మసాలాగా మారింది. హగ్గులు, ఐటెమ్‌ సాంగ్‌లతో హోరెత్తింది. బిగ్‌ బాస్‌ టాస్క్ షోని రక్తికట్టిస్తుంది. కొందరు పర్సనల్‌ కోర్కెలను తీర్చుకోవడం విశేషం.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 28 2022, 12:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ముందుగా నామినేషన్లకి సంబంధించిన చర్చ జరిగింది. ఇనయపై షాకింగ్‌ కామెంట్‌ చేశారు శ్రీహాన్‌. యాక్టింగ్‌లో ఆస్కార్‌ ఇవ్వొచ్చని అన్నాడు. ఫైమా సైతం తన వాదన వినిపించింది. మరోవైపు ఆదిరెడ్డి, రేవంత్‌ల మధ్య ఎలిమినేషన్‌ చర్చ జరిగింది. ఈ వారం చాలా కాంపిటీషన్‌ ఉందని, ఎవ్వరైనా వెళ్లొచ్చని, చాలా కష్టంగా ఉందని చెప్పాడు. ఈ క్రమంలో సూర్య, ఆరోహిల మధ్య రిలేషన్‌ డిస్కషన్‌ జరిగింది. తాను ఇతరులతో కనెక్ట్ కావడంపై ఇద్దరూ చర్చించుకున్నారు. నువ్వు ఇద్దరితో కనెక్ట్ అయితే, నేను నలుగురితో కనెక్ట్ అవుతున్నా అని సూర్య చెప్పాడు. దీంతో అలిగివెళ్లిపోయింది ఆరోహి. ఆ తర్వాత గేమ్‌ పై ఫోకస్‌ పెట్టాలని అనుకున్నాడు. అర్జున్‌ సైతం అదే నిర్ణయించుకున్నాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బిగ్‌ బాస్‌ షో మంగళవారం షోలో బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లకి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. `హోటల్‌ వర్సెస్‌ హోటల్‌` టాస్క్ లో `బీబీ హోటల్‌`, `గ్లామ్‌ హోటల్‌` అనే రెండు హోటల్స్ లో కంటెస్టెంట్ల సర్వెంట్లుగా, చెఫ్‌లుగా, గెస్ట్ లుగా వ్యవహరిస్తారు. చంటి హెల్పర్‌గా ఉండాల్సి ఉంటుంది. పైగా ఆయనకు ఓ సీక్రెట్‌ టాస్క్ ని ఇచ్చాడు బిగ్‌ బాస్‌. దీని ప్రకారం గెస్ట్ లను బీబీ హెటల్‌ నుంచి గ్లామ్‌ హోటల్ కి పంపించాల్సి ఉంటుంది.
 

36

ఇక మిగిలిన సభ్యుల్లో గ్లామ్‌ హోటల్లో ఐదు అమ్మాయిలు పనిచేస్తుంటారు. వారిలో ఫైమా మేనేజర్‌ కాగా, శ్రీసత్య, ఆరోహి, కీర్తి, వసంతి సర్వెంట్లు. ఇక బీబీ హోటల్లో సుదీప మేనేజర్ కాగా, రేవంత్‌, బాలాదిత్య, గీతూ, మరీనా సర్వెంట్లు. ఇనయ రాజకుటుంబంలో పుట్టిన ఒంటరి అమ్మాయి. రోహిత్‌ భార్య పారిపోవడంతో ఆమె కోసం వెతుక్కుంటూ వచ్చిన అతిథి, శ్రీహాన్‌ హీరో, పేరు కోసం ప్రయత్నిస్తుంటారు. సూర్య మతిస్థితిమితం సరిగా లేదని వ్యక్తి. ఆది ఫుడ్ రివ్యూవర్‌. రాజ్‌, అర్జున్‌ తీయబోయే సినిమా కోసం లోకేషన్‌ చూడ్డానికి వచ్చిన వారు. ఈ టాస్క్ లో గెస్ట్ లు సర్వెంట్ల చేత పనిచేయించుకుని డబ్బులివ్వాలి, హోటల్‌ స్టాఫ్‌ పనిచేసి, ఫుడ్‌ పెట్టి గెస్ట్ ల నుంచి డబ్బులు పొందాలి. ఎక్కువ డబ్బులు ఉన్న వారి కెప్టెన్ కి పోటీదారులవుతారు. 

46

ఈ టాస్క్ మొత్తంగా హౌజ్‌ని మసాజ్‌ సెంటర్‌గా, లవర్స్ కి అడ్డగా మార్చేసింది. అంతేకాదు పబ్‌గానూ మారిపోయింది. గ్లామ్‌ హోటల్‌ స్టాప్‌ ఫైమా, శ్రీసత్య, ఆరోహి, వసంతి ఐటెమ్‌ సాంగ్‌లకు డాన్సులేస్తూ రచ్చ చేశారు. అతిథులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించి డబ్బులు రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే బిగ్‌ బాస్‌ టాస్క్ కాస్త వ్యక్తిగత కోరికలు తీర్చుకునేదిగా మారినట్టుగా అనిపించింది. అంతేకాదు లవర్స్ జోడీలను కన్ఫమ్‌ చేసింది. 

56

ఇందులో సూర్య.. ఆరోహితో క్లోజ్‌గా మూవ్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ టాస్క్ లో ఆయన ఏకంగా ఆరోహితో మసాజ్‌ చేయించుకున్నాడు. బట్టలు విప్పిమరి మసాజ్‌ చేయించుకోవడం విశేషం. అంతకు ముందు ఏకంగా హగ్‌ కూడా చేసుకున్నాడు సూర్య. అలాగే శ్రీసత్యని తనకు ఫుడ్ తినిపించాలని, అలా చేస్తే ఎక్కువ డబ్బులిస్తానని అర్జున్‌ కండీషన్‌ పెట్టాడు. దీంతో ఆమె అర్జున్‌కి ఫుడ్‌ కలిపి గోరు ముద్దులు పెట్టింది. ఆయనకు తినిపించింది. ఈ క్రమంలో శ్రీసత్య, అర్జున్‌ మధ్య ఓ తెలియని బాండింగ్‌ కనిపించడం విశేషం. 
 

66

అలాగే రోహిత్‌, మరీనాలు సైతం హగ్‌లిచ్చుకున్నారు. రోహిత్‌ భార్య కోసం వెతుకుతున్న నేపథ్యంలో భర్త వదిలేసిన ఒంటరి మహిళ మరీనాకి హోటల్లో కనెక్ట్ అవుతాడు. వీరిద్దరు హగ్ లిచ్చుకోవడం విశేషం. ఏదో కనెక్షన్‌ ఉందంటూ ఈ జంట చేసిన రచ్చ మామూలు కాదు. మరోవైపు గీతూ తన యాటిట్యూడ్‌ని చూపించుకుంది. పక్క హోటల్‌ సర్వెంట్‌ అయి ఉండి, గ్లామ్ హోటల్‌లోకి వచ్చి శ్రీసత్యతో కాళ్లు మసాజ్, క్లీన్ చేయించుకోవడం విశేషం. డబ్బుల కోసం కంటెస్టెంట్లు ఏ పని చేయడానికైనా వెనకాడటం లేదు. మంగళవారం షోలో ఈ ఎపిసోడ్‌ హైలైట్‌గా మారింది. ఆడియెన్స్ కి కావాల్సిన మసాలా అందించింది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Paradise Mistakes: ప్యారడైజ్‌ సినిమాపై నెగటివ్‌ టాక్‌కి 5 కారణాలు.. శ్రీకాంత్‌ ఓడెల చేసిన మిస్టేక్‌ ఏంటంటే?
Recommended image2
SV Krishna Reddy: అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు ఒక్కటి కూడా చూడడం లేదు, అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ దారుణం
Recommended image3
KCR: ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్.. థియేటర్లలో ఈలలు, అరుపులతో రచ్చ రచ్చ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved