ట్రాన్స్జెండర్ తో రొమాన్స్ చేసిన పెళ్ళైన మానస్... బిగ్ బాస్ హౌస్ లో జరగనిది ఇక్కడ!
సీరియల్ నటుడు మానస్ ఇటీవల ఓ ఇంటివాడు అయ్యాడు. ఆయనకు వివాహం జరిగింది. అయితే పెళ్ళైన మానస్ ట్రాన్స్జెండర్ తో రొమాన్స్ చేయడం చర్చకు దారి తీసింది. ఇద్దరూ హగ్గులతో రెచ్చిపోయారు.
బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ మానస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫైనలిస్ట్స్ లో ఒకడైన మానస్ సీరియల్ నటుడిగా కొనసాగుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న బ్రహ్మముడి సీరియల్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. మంచి రేటింగ్ రాబడుతుంది.
Maanas
మానస్ ఇటీవల వివాహం చేసుకున్నాడు. గత ఏడాది నవంబర్ లో శ్రీజ అనే అమ్మాయి మెడలో తాళి కట్టాడు. విజయవాడ వేదికగా మానస్ వివాహం ఘనంగా జరిగింది. బంధు మిత్రులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Maanas
కాగా పెళ్ళైన మానస్ ట్రాన్స్ జెండర్ తో రొమాన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. అది ఎవరో కాదు పింకీ అలియాస్ ప్రియాంక సింగ్. ఒకప్పటి సాయి తేజ తన జెండర్ మార్చుకుని ప్రియాంక సింగ్ అయ్యింది. కొన్నాళ్ళు జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసిన సాయి తేజ సడన్ గా ప్రియాంక సింగ్ గా బిగ్ బాస్ హౌస్లో ప్రత్యక్షం అయ్యాడు.
Maanas
కాగా ప్రియాంక హౌస్లో మానస్ ని ఇష్టపడింది. తన ప్రేమను తోటి కంటెస్టెంట్స్ తో బహిరంగంగానే చెప్పింది. మానస్ మాత్రం ఆమెను దగ్గరకు తీసుకోలేదు. మరీ రిజెక్ట్ చేయకుండా ఒక లైన్ మైంటైన్ చేశాడు. ట్రాన్స్జెండర్ తో లవ్ ట్రాక్ అంటే జనాలు ఎలా అర్థం చేసుకుంటారో అని భయపడ్డారు.
Maanas
పింకీ మాత్రం మానస్ లోకంగా బ్రతికింది. అతను మాట్లాడకపోతే భోజనం కూడా చేసేది కాదు. అంతగా మానస్ ని ప్రియాంక ఇష్టపడింది. బయటకు వచ్చాక ఇద్దరూ పెద్దగా కలిసింది లేదు.
Maanas
తాజాగా డాన్స్ రియాలిటీ షో ఢీ లో దర్శనం ఇచ్చారు. ప్రియాంక-మానస్ కలిసి ఒక పాటకు డాన్స్ చేశారు. తర్వాత ప్రియాంక గురించి చెప్పాలని మానస్ ని అడగ్గా... తాను చాలా అందంగా ఉంటుంది. ఆమె మనసు కూడా అందమైనదే... అని చెప్పాడు.
ఆమె కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగాలని కోరుకున్నాడు. దాంతో ప్రియాంక... థాంక్స్ మానస్ గారు, అని చెప్పింది. గారు ఏంటని... మానస్ అడగ్గా, అయితే ఏంట్రా మానస్ అని సెటైర్ వేసింది. మానస్-ప్రియాంక మధ్య చోటు చేసుకున్న రొమాంటిక్ సీన్ ప్రేక్షకులను అలరించింది.