MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అవార్డ్ అందుకున్న శోభా శెట్టి, బిగ్ బాస్ నుంచి రాగానే లక్కీ ఛాన్స్..

అవార్డ్ అందుకున్న శోభా శెట్టి, బిగ్ బాస్ నుంచి రాగానే లక్కీ ఛాన్స్..

ఇలా బిగ్ బస్ నుంచి వచ్చిందోలేదో.. అలా లక్కీ ఛాన్స్ కొట్టేసింది కార్తీక దీపం విలన్ మోనితా.. అలియాస్ శోభా శెట్టి. వచ్చీ రాగానే కొన్ని రోజులకు అవార్డ్ సాధించి సత్తా చాటింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 27 2023, 08:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Shobha shetty

Shobha shetty

మోనితా అలియాస్  శోభాశెట్టి. ‘కార్తీక దీపం’ సీరియల్ తో ఎంత ఫేమస్ అయ్యిందో.. బిగ్ బాస్ తో ఇంకా ఫేమస్ అయ్యింది. అచ్చంగా కార్తీక దీపం  మోనితలాగే ప్రవర్తించి కాస్త నెగెటివిటీని మూటగట్టుకుంది శోభాశెట్టి.  తెలుగు బిగ్ బాస్ సీజన్ 7  లో  శోభ శెట్టి చూపించిన సినిమాలు గొడవలు, అన్నీ ఇన్ని కావు. ఇక  శోభ బిగ్ బాస్ ఫైనల్స్ కు వారం ముందు ఎలిమినేట్ అయ్యింది. చివరి వరకూ ఉండి.. కంటెస్టెంట్ గా తన సత్తా ఏంటో చూపించింది. అయితే ఇలా బిగ్ బాస్  హౌస్ నుంచి వచ్చిందో లేదో..అలా అరుదైన గౌరవాన్ని పొందింది శోభా శెట్టి. 
 

25

శోభా శెట్టిని  రాష్ట్రీయ గౌరవ్ అవార్డు వరించింది. అవార్డు వచ్చిన సంబరాన్ని శోభా శెట్టి  తన సోషల్ మీడియా ఫేజ్ లో చెప్పుకుని దిల్ ఖుష్ అయ్యింది. ఇన్‌ స్టాగ్రామ్‌లో  దానికి సబంధించిన ఫోటోలను శేర్ చేసుకుంది. కార్తీక దీపం సీరియల్ ఎంతటి ప్రజాదరణ పొందిందో తెలిసిందే. ఈ సీరియల్‌లో విలన్ పాత్రలో నటించిన శోభా శెట్టికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. 
 

35

ఇక లేడీ విలన్‌గా శోభా శెట్టికి  తిరుగులేని ఇమేజ్ వచ్చింది. అందంలో హీరోయిన్లకు పోటీ ఇవ్వగల శోభ.. నెగెటీవ్ క్యారెక్టర్స్ లో.. హావభావాలతో అదరగొట్టింది. అయితే ఈమె 5 వారాలకే హౌస్ నుండి వెళ్లిపోతుందని అంతా ఎక్స్‌పెక్ట్ చేసారు. కాని గట్టిగా నిలబడి..  అందరి అంచనాలను తారుమారు చేసి. శోభా శెట్టి 14 వారాలు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగారు. టాప్ 7 కంటెస్టెంట్‌గా నిలిచింది. అయితే బిగ్ బాస్ ఈమెను బయటకు వెళ్ళకుండా కాపాడాడు.. నాగార్జున వల్లే ఈమె ఎలిమినేట్ కావల్సి ఉండగా.. హౌస్ లోకొనసాగింది అని విమర్ష కూడా ఉంది. 
 

45

 ఈ భామ బిగ్ బాస్ సీజన్ పూర్తై బయటకు వచ్చారో లేదో రాష్ట్రీయ గౌరవ్ అవార్డు వరించింది.అయితే  ఈ అవార్డ్ కూడా ఆహెకు కార్తీక దీపం సీరియల్‌ వల్లే వచ్చింది. ఈ సీరియల్ లో లో విలన్ పాత్రకు గాను శోభా శెట్టిని రాష్ట్రీయ గౌరవ్ అవార్డు వరించింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ పీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి చేతుల మీదుగా శోభా శెట్టి అ వార్డు అందుకున్నారు. 
 

55

ఈ ఆనందాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు శోభా శెట్టి. ‘కార్తీక దీపం సీరియల్‌లో మోనిత పాత్రకు రాష్ట్రీయ గౌరవ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.. నా జర్నీలో నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చింది బ్యూటీ. కన్నడ పరిశ్రమకుచెందిన శోభా శెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్ లోయాక్టీవ్ గా ఉంది. నెక్ట్స్ ఏసీరియల్ లో నటిస్తుంది అనే సమాచారం మాత్రంతెలియరాలేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
Oscar Tributes: కోట శ్రీనివాసరావుని ప్రత్యేకంగా గౌరవించిన ఆస్కార్‌.. ఈ ముగ్గురి దిగ్గజాలకు అకాడమీ నివాళ్లు
Recommended image2
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌ పెద్ద 420, నేను అస్సలు నమ్మను.. బండారం బయటపెట్టిన నటి
Recommended image3
Sneha Ullal: ఐశ్వర్య రాయ్‌లా ఉన్నందుకే సల్మాన్ ఛాన్స్ ఇచ్చాడు.. ఇన్నేళ్ల తర్వాత సీక్రెట్ చెప్పిన స్నేహా ఉల్లాల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved