- Home
- Entertainment
- పూల డ్రెస్ లో ‘బిగ్ బాస్’ అరియానా అందాల విందు.. ట్రెడిషనల్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న ఆర్జీవీ గర్ల్..
పూల డ్రెస్ లో ‘బిగ్ బాస్’ అరియానా అందాల విందు.. ట్రెడిషనల్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న ఆర్జీవీ గర్ల్..
బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory) కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ క్రేజీ ఫొటోషూట్ తో దర్శనమిచ్చింది. ట్రెడిషనల్ లుక్ లో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది.

అరియానా గ్లోరీ ఈ మధ్య కాస్తా సోషల్ మీడియాలో జోరు తగ్గించింది. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు’లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత పాపులారిటీని సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇటీవల సోషల్ మీడియాపై పెద్దగా ఆసక్తి పెట్టలేదు. చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ తాజాగా దర్శనమిచ్చింది.
బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీకి కాస్తా క్రేజ్ రాగానే ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. ఫ్యాషన్ సెన్స్ తో తన అభిమానులను ఫిదా చేస్తోంది. ఎప్పుడూ తన ఫాలోవర్స్ ను ఫొటోషూట్లు, రీల్స్ తో ఖుషీ చేసే ఈ భామా.. తాజాగా మరిన్ని ఫొటోస్ ను పంచుకుంది.
ఈ పిక్స్ లో పూల డ్రెస్ లో ఉన్న అరియానా లేత అందాలను విందు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. లూస్ హెయిర్ లో లెహంగా, వోణీ ధరించిన బుల్లితెర బ్యూటీ.. ట్రెడిషనల్ ఫోజులతో కుర్రాళ్ల చూపులను తనవైపు పడేలా చేస్తోంది. చిరునవ్వును చిందిస్తూ.. నెటిజన్లను ఆకర్షిస్తోంది.
నెటిజన్ల నుంచి కూడా ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగే ఉంది. అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తున్న ఈ బ్యూటీని ఇంటర్నెట్ ఫ్యాన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా అరియా గ్లోరీ పోస్ట్ చేసిన పిక్స్ ను లైక్ చేస్తూ.. క్యూట్ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
హైదరాబాద్ కు చెందిన అమ్మాయి అరియానా గ్లోరీ అందాల విందు చేస్తోంది. టెలివిజ్ ప్రజెంటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. టీవీ షోలతో యాంకర్ గా మారిపోయింది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ టెలివిజన్ ఆడియెన్స్ కు దగ్గరైంది.
ప్రస్తుతం పలు టీవీ షోలకు, ఈవెంట్లకు హాజరవుతూ తనమార్క్ చూపిస్తోంది. బిగ్ స్క్రీన్ పై మెరిసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో పలు రీల్స్, వీడియోలు, ఫొటోషూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. గతంలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఈ బ్యూటీ దశ తిరిగిన విషయం తెలిసిందే.