MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • కూలీగా మారిన యాంకర్ లాస్య, ఆమె దీన స్థితికి కారణం?

కూలీగా మారిన యాంకర్ లాస్య, ఆమె దీన స్థితికి కారణం?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, యాంకర్ లాస్య కూలీగా మారింది. ఆఫర్స్ లేక లాస్య ఈ స్థితికి వచ్చిందా, అని ఫ్యాన్స్ వాపోతున్నారు.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Oct 10 2024, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Anchor Lasya

Anchor Lasya

యాంకర్ లాస్య మంజునాథ్ ప్రేమ వివాహం చేసుకుని బుల్లితెరకు దూరమైంది. గతంలో ఆమె పలు టెలివిజన్ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. 2012లో ప్రసారమైన సంథింగ్ స్పెషల్ ఆమెకు పాపులారిటీ తెచ్చింది. యాంకర్ రవితో పాటు ఆమె యువతను అలరించారు. మా మ్యూజిక్ ఛానల్ లో ఈ షో ప్రసారమయ్యేది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Anchor Lasya

Anchor Lasya


అనంతరం మొండి మొగుడు పెంకి పెళ్ళాం, మా ఊరి వంట, ఢీ అల్టిమేట్ డాన్స్ షోలకు లాస్య యాంకర్ గా వ్యవహరించింది. యాంకర్ రవిని ఆమె ప్రేమించారనే పుకార్లు ఉన్నాయి. అప్పట్లో రూమర్స్ గట్టిగా వినిపించాయి. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఎమ్మెల్యే మూవీలో సిస్టర్ రోల్ చేసింది. కాగా సడన్ గా లాస్య బుల్లితెరకు దూరమైంది. 

 

2020లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో లాస్య కంటెస్ట్ చేసింది. లాస్య హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అవతరించింది. లాస్య చాలా సాఫ్ట్ గా ఉండేవారు. ఆమె ఇతర కంటెస్టెంట్స్ పై విరుచుకు పడిన సందర్భాలు చాలా అరుదు. నామినేషన్స్ లో కూడా లాస్య  చాలా వరకు కూల్ గా ఉండేవారు. ఈ క్రమంలో ఆమె సేఫ్ గేమ్ ఆడుతున్నారనే అపవాదు మూటగట్టుకుంది. 
 

36
Anchor Lasya

Anchor Lasya

హోస్ట్ నాగార్జున సైతం ఫేక్ గేమ్ అంటూ లాస్యను ఎద్దేవా చేశాడు. హౌస్లో లాస్య చెఫ్ గా వ్యవహరించింది. కంటెస్టెంట్స్ అందరికీ రుచి కరమైన భోజనం వండి పెట్టేది. అలాగే ఆమె ఒక బ్యాచ్ ని మైంటైన్ చేసింది. అభిజీత్, నోయల్, హారికలతో ఎక్కువ సన్నిహితంగా ఉండేది. లాస్య 11వ వారం ఎలిమినేట్ అయ్యింది. 

 

లాస్యకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. హౌస్ నుండి బయటకు వచ్చాక ఆమె యూట్యూబ్ ఛానల్ కి ఆదరణ పెరిగింది. వీడియోలకు పెద్ద మొత్తంలో వ్యూస్ దక్కుతున్నాయి. ఇప్పుడు కూడా బుల్లితెర షోలకు లాస్య దూరంగా ఉంటుంది. ఇక మంజునాథ్ అనే వ్యక్తిని లాస్య ప్రేమ వివాహం చేసుకున్నట్లు బిగ్ బాస్ హౌస్లో వెల్లడించింది. 
 

46

లాస్య ప్రేమను తండ్రి అంగీకరించలేదట. దాంతో కొన్నాళ్లు పేరెంట్స్ కి దూరంగా బతకాల్సి వచ్చిందట. లాస్యకు కొడుకు పుట్టాక పేరెంట్స్ మనసు కరిగిందట. ఆమెను దగ్గరకు తీసుకున్నారట. లాస్యకు ఇద్దరు కుమారులు. ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రతి విషయాన్ని లాస్య షేర్ చేసుకుంటుంది. 

 

లాస్య ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఏకంగా 1.7 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. కాగా లాస్య భవన నిర్మాణ కార్మికురాలిగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంకలో చంటి బిడ్డను పెట్టుకుని, ఆమె ఎర్రటి ఎండలో ఇటుకలు మోస్తుంది. లాస్య దీన స్థితి చూసి ఫ్యాన్స్ ఆవేదన చెందారు. ఆమెకు ఇంతటి పరిస్థితి ఎందుకు వచ్చిందని వాపోతున్నారు. 
 

56
Anchor Lasya

Anchor Lasya

అయితే నిజంగా లాస్య కూలి పనికి వెళ్ళలేదు. ఒక ఫోటో షూట్ చేసింది. ఉమెన్  ఎమ్పవ్ర్మెంట్  తెలియజేస్తూ.. సదరు ఫోటో షూట్ ఆమె చేశారు. అదన్నమాట సంగతి. ఈ విషయాన్ని ఆమె ఇంస్టాగ్రామ్ లో తెలియజేసింది. ఇతర మాధ్యమాల్లో కూలీగా ఉన్న లాస్య లుక్ వైరల్ కావడంతో అభిమానులు ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. 

 

కొందరు మాత్రం లాస్య ఫోటోలపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఫోటో షూట్ కోసం నాలుగు ఇటుకలు మోయడం కాదు. నిజంగా ఒకరోజు ఆ పని చేస్తే నీకు ఆ మహిళా కూలీల కష్టం తెలుస్తుందంటున్నారు. 
 

66
Anchor Lasya

Anchor Lasya

కాగా లాస్య భర్త మంజునాథ్ ప్రైవేట్ ఎంప్లాయ్ అని సమాచారం. అతడు కూడా లాస్యతో పాటు వీడియోలు, రీల్స్ చేస్తుంటాడు. లాస్య మాత్రం కేవలం సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుంది. యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ ఆమె ప్రధాన ఆదాయ వనరులు అని తెలుస్తుంది. బుల్లితెర షోల పట్ల లాస్య ఎందుకో ఆసక్తి చూపడం లేదు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved