- Home
- Entertainment
- నా కళ్ళలో నిన్ను చూడాలనివుంది... ప్రియుడి కోసం దివి విరహవేదన, ఇంతకీ ఎవరా లక్కీ ఫెలో?
నా కళ్ళలో నిన్ను చూడాలనివుంది... ప్రియుడి కోసం దివి విరహవేదన, ఇంతకీ ఎవరా లక్కీ ఫెలో?
వయసు మీద పడుతుంటే దివి విరహ వేదనతో అల్లాడిపోతోంది. ప్రియుడి చూపుల కోసం ఆశగా ఎదురు చూస్తుంది. ఓ రొమాంటిక్ ఫోటో షేర్ చేసి, దివి పోస్ట్ చేసిన కామెంట్ పలు అనుమానాలకు దారి తీసింది.

Bigg Boss Telugu 6
దివి ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. క్లోజప్ షాట్ లో కళ్ళు హైలెట్ అయ్యేలా ఫోటో షేర్ చేసింది. దివి కళ్ళను చూస్తుంటే ఎవరి కోసమో ఎదురుచూస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఆ రొమాంటిక్ ఫోటోకు దివి జోడించిన కామెంట్ ఆసక్తి రేపుతోంది. ''నా కళ్ళల్లో నిన్ను చూడాలనివుంది'' అని ఆమె చెప్పడం ప్రియుడిని ఉద్దేశించే అంటున్నారు.
Bigg Boss Telugu 6
విరహ వేదనతో అల్లాడిపోతున్న దివి... తన మనసులో మాట ఆ విధంగా బయటపెట్టింది అంటున్నారు. ఇక దివి లాంటి సుందరాంగిని దక్కించుకున్న ఆ లక్కీ ఫెలో ఎవరని ఈర్ష్య వ్యక్తం చేస్తున్నారు. దివి చేయి అందుకే అదృష్టవంతుడిని చూడాలని ఆతృత పడుతున్నారు. దివి ప్రేమలో పడ్డట్లు ఎలాంటి ఊహాగానాలు, పుకార్లు తెరపైకి వచ్చిన దాఖలాలు లేవు. దీంతో పెద్ద సస్పెన్సుగా మారింది.
Divi
ఇక దివి కెరీర్ ఇప్పుడిప్పుడే గాడినపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి లేటెస్ట్ హిట్ గాడ్ ఫాదర్ మూవీలో దివి ఒక రోల్ చేసిన విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్ విజయం సాధించిన నేపథ్యంలో దివి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దివికి మరిన్ని ఆఫర్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.
Bigg Boss Divi
మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన దివి హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చారు. ఆమె బిగినింగ్ లో చిన్న సినిమాలు చేశారు. అనంతరం మహర్షి మూవీలో స్టూడెంట్ గా కనిపించారు.దివి అనే ఓ హీరోయిన్ ఉందని బిగ్ బాస్ ద్వారానే తెలిసింది. సీజన్ 4 లో దివికి అవకాశం దక్కింది. దివి గ్లామర్ బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇతర లేడీ కంటెస్టెంట్స్ మాదిరి ఆమె అఫైర్స్, స్కిన్ షోకి దూరంగా ఉన్నారు. అలాగే గేమ్ అంత అగ్రెసివ్ గా ఉండేది కాదు.
Divi Vadthya
ఎక్కువగా అమ్మ రాజశేఖర్ తో స్నేహం చేసింది. ఆ కారణంగా దివి కనీసం ఫైనల్ కి కూడా చేరుకోలేదు. షో మధ్యలోనే ఆమె ఆట ముగిసింది. ఆ సీజన్ లో అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అఖిల్ రన్నర్ గా నిలిచారు. అరియానా, సోహైల్, అలేఖ్య ఫైనల్ కి చేరారు. ఫైనల్ కి చేరకున్నా దివికి మాత్రం ఫేమ్ దక్కింది. బిగ్ బాస్ షో తర్వాత ఆమెకు ఆఫర్స్ మొదలయ్యాయి. గతంతో పోల్చితే ఆమెకు లీడ్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం లంబసింగి టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే ఏటీఎం టైటిల్ తో ఓ వెబ్ సీరీస్ చేస్తున్నారు.
ఒక ప్రక్కన అంది వచ్చిన అవకాశాలు కాదనకుండా చేస్తూనే సోషల్ మీడియా వేదికగా గ్లామర్ విందు చేస్తుంది. దర్శక నిర్మాతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. మరి చూడాలి దివి ఆశలు ఎంత మేరకు నెరవేరుతాయా..