- Home
- Entertainment
- బిగ్ బాస్ కంటెస్టెంట్లకి పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా? వాళ్లకైతే దెబ్బకి లైఫ్ సెటిల్‌మెంట్
బిగ్ బాస్ కంటెస్టెంట్లకి పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా? వాళ్లకైతే దెబ్బకి లైఫ్ సెటిల్‌మెంట్
బిగ్ బాస్ తెలుగు 9 మరి కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. మరి ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లకి ఎంత పారితోషికం ఇస్తారనేది తెలుసుకుందాం. వాళ్లకైతే లైఫ్ సెటిల్‌మెంట్.

బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. షో కాసేపట్లో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సారి ఎవరెవరు కంటెస్టెంట్లుగా వస్తారు? కొత్తగా ఏం చూపించబోతున్నారు? హౌజ్ ఎలా ఉండబోతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే కంటెస్టెంట్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది తెలుసుకునేందుకు ఆతృతగా ఉన్నారు ఆడియెన్స్.
షో ప్రారంభంలోనే కంటెస్టెంట్ కి బిగ్ బాస్ ఝలక్
ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో వచ్చింది. ఇందులో హౌజ్‌ని పరిచయం చేశారు నాగ్. ఈ సారి సరికొత్తగా ఉండబోతుంది, కలర్‌ఫుల్‌గా ఉండబోతుంది. అదే సమయంలో డబుల్ హౌజ్ ఉండనుందట. మరి ఆ ట్విస్ట్ ఏంటనేది బిగ్ బాస్ చెప్పబోతున్నారు. అంతేకాదు ఓ కంటెస్టెంట్ తనతోపాటు ఒక ఐటెమ్ తెచ్చుకున్నారు. అది కూడా తన బాడీలో పార్ట్ అన్నాడు. దీన్ని బిగ్ బాస్ అలౌ చేయలేదు. దీంతో అతను బయటకు వెళ్లిపోయారు. వీటితోపాటు ముందుంది ముసళ్ల పండగ అని బిగ్ బాస్ చెప్పడం విశేషం.
బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్లు వీరేనా?
ఇదిలా ఉంటే ఈ సారి 15 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి రాబోతున్నారట. వీరిలో 9 మంది రెగ్యూలర్ సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఉంటారు. ఆరుగురు కామనర్స్ ఉంటారని సమాచారం. వాళ్లెవరనేది ఇప్పటికే పేర్లు వినిపించాయి. ఇమ్మాన్యుయెల్, తనూజా గౌడ, ఆషా సైనీ, భరణి, సంజనా గాల్రానీ, శ్రష్టి వర్మ, రీతూ చౌదరీ, రాము రాథోడ్, సుమన్ శెట్టి వంటి వారు కంటెస్టెంట్లుగా రాబోతున్నారట. మరోవైపు వీరితోపాటు కామనర్స్ నుంచి మనీష్, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా, హరీష్ హౌజ్‌లోకి రాబోతున్నారట. వీళ్లు ఫైనల్ కంటెస్టెంట్లు అని తెలుస్తోంది.
బిగ్ బాస్ కంటెస్టెంట్ల పారితోషికాలు
అయితే బిగ్ బాస్ హౌజ్‌లోకి రావడం వల్ల మంచి పేరు, పాపులారిటీ వస్తుంది. గతంలో తెలియని వారు ఈ షోతో స్టార్స్ అయిపోతారు. సెలబ్రిటీ హోదా పొందుతారు. అదే సమయంలో కొందరు సినిమా అవకాశాలు, సీరియల్స్ అవకాశాలు దక్కించుకున్నా ఆశ్చర్యం లేదు. ఇలా చాలా మంది సినిమా ఆఫర్లు దక్కించుకున్న వాళ్లు కూడా ఉన్నారు. మరోవైపు ఈ షోకి వచ్చిన కంటెస్టెంట్ల పారితోషికాలు కూడా బాగానే వస్తాయి. కామనర్స్ కి రోజుకి 15 వేల నుంచి 20 వేల వరకు ఇస్తారు. కాస్త పాపులారిటీ ఉన్నవారికి 20-25 వేల వరకు, అలాగే జనాలకు బాగా నోటెడ్ అయిన సెలబ్రిటీలకు రూ.30వేలకుపైగానే ఉన్నాయి. ఇక స్టార్స్ కేటరిగీలో ఉన్న వారికి, బాగా డిమాండ్ ఉన్నవారికి రూ.40వేలకుపైగా పారితోషికం(రోజుకి) ఉంటుంది.
వాళ్లకి దెబ్బకి లైఫ్ సెటిల్‌మెంట్
కామనర్స్ చివరి వరకు ఉంటే దాదాపు రూ.20 లక్షల వరకు పారితోషికం అందుకునే అవకాశం ఉంది. అదే సెలబ్రిటీ హోదాలో డిమాండ్ ఉన్న కంటెస్టెంట్లు అయితే ఆల్మోస్ట్ విన్నర్ కి వచ్చిన అమౌంట్ వస్తుంది. అంటే రూ.40-50 లక్షల వరకు పారితోషికం రూపంలో వస్తుంది. ఇక విన్నర్‌కి ఈ పారితోషికంతోపాటు విన్నింగ్ ప్రైజ్ మనీ వస్తుంది. అంటే కోటీకిపైగానే పారితోషికం పొందుతారు. విన్నర్స్ కి పారితోషికం, ప్రైజ్ మనీ, అలాగే కార్డ్ గిఫ్ట్ లు, రియల్ ఎస్టేట్ సంస్థలు భాగమైతే విల్లాలు, ఫ్లాట్‌లు ఫ్రీగా వస్తాయి. వీటితోపాటు ఇతర బెనిఫిట్స్ అందుతాయి. విన్నర్‌కి దాదాపు ఏడాదిపాటు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, ఇతర కమర్షియల్ యాడ్స్ లో భాగం కావడం జరుగుతుంది. ఇలా బిగ్ బాస్ విన్నర్ లైఫ్ సెట్ అయిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.