MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • చిరంజీవి `గూండా` దెబ్బకి తలపట్టుకున్న సూపర్‌స్టార్‌ కృష్ణ.. హిట్‌ కావాల్సిన మూవీ కాస్త అడ్రస్‌ గల్లంతు

చిరంజీవి `గూండా` దెబ్బకి తలపట్టుకున్న సూపర్‌స్టార్‌ కృష్ణ.. హిట్‌ కావాల్సిన మూవీ కాస్త అడ్రస్‌ గల్లంతు

మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ కృష్ణ మధ్య సినిమాల పోటీ చాలా సార్లు నెలకొంది. అయితే చిరు `గూండా` సినిమా దెబ్బకి హిట్‌ కావాల్సిన కృష్ణ మూవీ కాస్త అడ్రస్‌ లేకుండా పోయింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 07 2025, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్‌ స్టార్‌ కృష్ణకి పోటీ ఇచ్చిన చిరంజీవి
Image Credit : Asianet News

సూపర్‌ స్టార్‌ కృష్ణకి పోటీ ఇచ్చిన చిరంజీవి

మాస్‌ యాక్షన్‌ సినిమాల విషయంలో మొదట ఎన్టీఆర్‌కి, సూపర్‌ స్టార్‌ కృష్ణకి మధ్య పోటీ ఉండేది. పౌరాణిక చిత్రాలు పక్కనపెడితే ఎన్టీరామారావు ఎక్కువగా మాస్‌, కమర్షియల్‌ ఎలిమెంట్లతో కూడిన యాక్షన్‌ సినిమాలే చేశారు. ఆ తర్వాత అదే పంథాలో సూపర్‌ స్టార్‌ కృష్ణ యాక్షన్‌ మూవీస్‌ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య పోటీ ఉండేది. రామారావు సినిమాలు మానేశాక.. కృష్ణ, చిరంజీవి మధ్య ఆ పోటీ నెలకొంది. డాన్సులు, ఫైట్లు, ఫాటలతో చిరు మాస్‌ ఆడియెన్స్ ని ఉర్రూతలూగించారు. దీంతో కృష్ణకి చిరు గట్టి పోటీ ఇచ్చారని చెప్పొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మంచి వసూళ్లని రాబట్టిన కృష్ణ `రక్తసంబంధం`
Image Credit : etv win

మంచి వసూళ్లని రాబట్టిన కృష్ణ `రక్తసంబంధం`

అయితే చిరంజీవి `గూండా` సినిమా సమయంలో సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన ఓ మూవీ దారుణంగా దెబ్బతిన్నది. హిట్‌ కావాల్సిన మూవీ కాస్త అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది.  ఆ మూవీ ఏంటనేది చూస్తే. సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా ఆయన భార్య విజయ నిర్మల దర్శకత్వంలో `రక్తసంబంధం` అనే మూవీ తెరకెక్కింది. ఇందులో రాధా హీరోయిన్‌గా నటించింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం 1984 ఫిబ్రవరి 16న విడుదలైంది. మంచి టాక్‌ తెచ్చుకుంది. మొదటివారం మంచి వసూళ్లని కూడా రాబట్టింది.

35
చిరంజీవి `గూండా` కోసం క్యూ కట్టిన మాస్‌ ఆడియెన్స్
Image Credit : etv win

చిరంజీవి `గూండా` కోసం క్యూ కట్టిన మాస్‌ ఆడియెన్స్

`రక్తసంబంధం` విడుదలైన వారం గ్యాప్‌తో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `గూండా` మూవీ విడుదలైంది. ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులోనూ రాధా హీరోయిన్‌. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. 1984 ఫిబ్రవరి 23న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్‌ టాక్‌ని తెచ్చుకుంది. తొలి వారం భారీ వసూళ్లని రాబట్టింది. ఊపు తెచ్చే పాటలు, యాక్షన్‌ లాంటి కమర్షియల్‌ ఎలిమెంట్లు ఫుల్‌గా ఉండటంతో మాస్‌ ఆడియెన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు.  మెగా అభిమానులు క్యూ కట్టారు. దీంతో `గూండా` బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. చాలా రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది.

45
`రక్తసంబంధం` కలెక్షన్లకి గండికొట్టిన `గూండా`
Image Credit : cinejosh

`రక్తసంబంధం` కలెక్షన్లకి గండికొట్టిన `గూండా`

మెగాస్టార్‌ `గూండా` దెబ్బకి సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన `రక్తసంబంధం` చిత్రం కుదేలైపోయింది. కోలుకోలేకపోయింది. మాస్‌ ఆడియెన్స్ అంతా చిరు మూవీకి క్యూ కట్టడంతో హిట్‌ కావాల్సిన కృష్ణ `రక్తసంబంధం` కాస్త అడ్రస్‌ లేకుండాపోయింది. జస్ట్ బిలో యావరేజ్‌గా మిగిలిపోయింది. దీంతో రిజల్ట్ చూసి కృష్ణ తలపట్టుకునే పరిస్థితి వచ్చిందట. అయితే ఆయన భోళా మనిషి కావడంతో ఈ ఫలితాన్ని కూడా నవ్వుతూనే తీసుకున్నారని సమాచారం. మొత్తంగా చిరంజీవి `గూండా`.. కృష్ణ `రక్తసంబంధం` కలెక్షన్లకి పెద్ద ఎత్తున గండి కొట్టింది. 

55
క్రేజీ లైనప్‌తో దూసుకుపోతున్న చిరంజీవి
Image Credit : Asianet News

క్రేజీ లైనప్‌తో దూసుకుపోతున్న చిరంజీవి

బాక్సాఫీసు వద్ద ఇలా చిరంజీవి, సూపర్‌ స్టార్‌ కృష్ణ చాలా సార్లు పోటీ పడ్డారు. కొన్నిసార్లు కృష్ణ, మరికొన్ని సార్లు చిరంజీవి పైచేయి సాధించారు. ఇండస్ట్రీలో ఇలాంటి పోటీ కామన్‌ అనే చెప్పాలి. అయితే ఎవరైనా వీటిని స్పోర్టీవ్‌గా తీసుకుని మంచి సినిమాలు చేసేందుకు తపించేవారు. ఆడియెన్స్ ని అలరించేందుకు పోటీ పడేవారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మూడేళ్ల క్రితం సూపర్‌ స్టార్‌ కృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. భారీ లైనప్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన `విశ్వంభర`, `మన శంకరవరప్రసాద్‌ గారు` చిత్రాల్లో నటిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
కృష్ణ ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image2
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Recommended image3
The Paradise: ది ప్యారడైజ్ మూవీకి ట్రైలర్ లేదు.. బాంబు పేల్చిన నాని, ఏం జరుగుతోంది
Related Stories
Recommended image1
ఎన్టీఆర్‌ చేతిలో ఉన్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా? ఇంకా హీరోనే కాలేదు, కానీ మైండ్‌ బ్లాక్‌ చేసే క్రేజ్‌
Recommended image2
బావ రామ్‌ చరణ్‌ కోసం అల్లు అర్జున్‌ గెస్ట్ రోల్‌.. బంపర్‌ హిట్‌ కొట్టిన ఏకైక మూవీ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved