18 ఏళ్ల వయసులో ప్రేమ, బ్రేకప్, తండ్రి మరణం, ఒంటరి జీవితం గడుపుతోన్న నటి ఎవరు?
తల్లిదండ్రుల ప్రేమ వివాహం, తండ్రి అకాల మరణం, 18 ఏళ్లకే లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఒంటరి జీవితం గడుపుతోన్న నటి ఎవరో తెలుసా?

బిగ్ బాస్ మలయాళం సీజన్ 7 ప్రముఖ పోటీదారుల్లో జిసెల్ ఒకరు. పంజాబ్‌లో పుట్టి పెరిగిన జిసెల్ తల్లి ఆలప్పుళకు చెందినవారు. హిందీ బిగ్ బాస్‌లో కూడా పోటీదారుగా ఉన్న జిసెల్, నటిగా, మోడల్‌గా గుర్తింపు పొందారు. బిగ్ బాస్ ప్రేక్షకుల మనసు దోచుకోవడంలో జిసెల్ సక్సెస్ అయ్యారు. 30 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత, జిసెల్ తన జీవిత కథను పంచుకున్నారు.
నేను ఆలప్పుళకి చెందిన దాన్ని. మా అమ్మ పేరు పొన్నమ్మ. పిన్ని తంకమ్మ. మా పెద్దమ్మ పంజాబ్‌లో నర్స్‌గా పనిచేసేవారు. అప్పుడు మా అమ్మకి పదిహేను లేదా పదహారు సంవత్సరాలు. చదువుకోవడానికి మా అమ్మను పంజాబ్‌కి తీసుకెళ్లారు. అక్కడే అమ్మానాన్నలు కలుసుకున్నారు. నాన్న పంజాబీ. మిస్టర్ పంజాబ్ టైటిల్ కూడా గెలుచుకున్నారు. చాలా అందమైన, హ్యాండ్సమ్ అబ్బాయి. అమ్మ సగం క్రైస్తవురాలు, సగం హిందువు అని చెప్పారు.
నాన్నగారి తండ్రి అక్కడి కలెక్టర్. ఆయనకీ ఈగో ఉండేది. అమ్మానాన్నల ప్రేమను తాతగారు ఒప్పుకోలేదు. నాన్నకి వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేశారు. చివరికి ఇద్దరూ పారిపోయి గురువాయూర్‌లో పెళ్లి చేసుకున్నారు. తిరిగి పంజాబ్‌కి వెళ్ళాక పెద్ద గొడవ జరిగిందని జిసెల్ చెప్పారు.
నాన్న బంధువులు వచ్చి మా అమ్మను బెదిరించారు. నిన్ను చంపుతాం, ఆయన్ని వదిలేసి వెళ్ళిపో అని అమ్మతో అన్నారు. కానీ ఇద్దరూ ఒప్పుకోకపోయేసరికి, నాన్నకి ఆస్తిలో ఎలాంటి హక్కు లేదని రాసిచ్చుకున్నారు. తర్వాత నేను పుట్టాను. నాన్నకి 33 ఏళ్ళ వయసులో గుండెపోటు వచ్చింది. ఆఫీసులోనే చనిపోయారు.
18 ఏళ్ళ వయసులో నేను ప్రేమలో పడ్డాను. మూడు సంవత్సరాల తర్వాత బ్రేకప్ అయ్యింది. రెండు సంవత్సరాల తర్వాత అతను పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఆ తర్వాత బ్రిటిష్ అబ్బాయితో ప్రేమలో పడ్డాను. 2022లో అది కూడా బ్రేకప్ అయ్యింది. ఇప్పుడు నేను సింగిల్‌ని. ఒక సినిమా విడుదలైన తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా హిందీ బిగ్ బాస్‌కి వెళ్ళాను. రెండున్నర వారాలు మాత్రమే అక్కడ ఉన్నాను. ఒక టాస్క్ చేస్తున్నప్పుడు కాలికి గాయమైంది. డాక్టర్ చెప్పినందువల్ల షో నుండి బయటకు వచ్చాను. ఐదు నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నాను అని తన జీవిత కథను చెప్పుకున్నారు.