- Home
- Entertainment
- నాగ చైతన్య ఫ్యాన్స్ వల్లే సమంత 'శాకుంతలం' ఫ్లాప్.. వివాదాస్పద వ్యాఖ్యలతో చిచ్చు పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ
నాగ చైతన్య ఫ్యాన్స్ వల్లే సమంత 'శాకుంతలం' ఫ్లాప్.. వివాదాస్పద వ్యాఖ్యలతో చిచ్చు పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ
స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సర్వత్రా నెగిటివ్ రివ్యూలు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చిత్రానికి బిగ్ బాస్ ఫేమ్ ఆరోహి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చింది.

స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. శకుంతల, దుశ్యంతుడు ప్రేమ కథగా తెరకెక్కిన ఈ పౌరాణిక చిత్రంలో సమంత టైటిల్ రోల్ ప్లే చేసింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సర్వత్రా నెగిటివ్ రివ్యూలు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఫలితంగా శాకుంతలం చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచింది.
దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు గుణశేఖర్ తన వద్ద అద్భుతమైన కథ ఉన్నప్పటికీ దానిని ఆసక్తికరంగా చూపించలేకపోయారు. ఈ చిత్రంలో విఎఫెక్స్ వర్క్ దారుణంగా దెబ్బేసింది. పురాణాల పేరుతో ఏం చూపించినా చెల్లుతుంది అని భావించిన గుణశేఖర్ కి ఎదురుదెబ్బ తప్పలేదు. ఈ చిత్రంలో సమంత నటన బావున్నప్పటికీ.. ఆమె ఇలాంటి చిత్రాలకు సూట్ అవుతుందా అనే విమర్శలు కూడా వినిపించాయి.
ఇక ఈ చిత్రానికి బిగ్ బాస్ ఫేమ్ ఆరోహి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చింది. బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన ఆరోహి.. బిగ్ బాస్ 6తో తన ఇమేజ్ మరింత పెంచుకుంది. తాజాగా ఆరోహి సోషల్ మీడియాలో శాకుంతలం చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఆరోహి పోస్ట్ చేస్తూ..' శాకుంతలం చిత్రం కొంచెం లాగ్ ఉంది నిజమే. పురాణాల గురించి తెలియని వారికి ఈ చిత్రం పంచతంత్రం కథలాగే అనిపిస్తుంది. ఈ చిత్రం ఫ్లాప్ కావడం వెనుక నాగ చైతన్య ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సమంత పెర్ఫామెన్స్ బాగాలేదు అని కామెంట్స్ చేసింది నాగ చైతన్య అభిమానులు మాత్రమే. ఉన్నది ఉన్నట్లు తీశారు.. కాబట్టే అందరికి ఈ చిత్రం నచ్చలేదు. కాస్త ఫిక్షన్, మసాలా జోడించి ఉంటే బాగా చూసేవాళ్ళు.
అల్లు అర్హ బాగానే చేసింది. కానీ ఆమె కంటే అద్భుతంగా చేసే చైల్డ్ ఆర్టిస్టులు బయట అవకాశాల కోసం చూస్తున్నారు అంటూ ఆరోహి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓవరాల్ గా శాకుంతలం చిత్రం యావరేజ్ మూవీ. బయట ప్రచారం జరుగుతున్నట్లు దారుణంగా అయితే లేదు అని తెలిపింది.
ఆరోహి ఇలా బోల్డ్ గా శాకుంతలం చిత్రం గురించి మాట్లాడడం, నాగ చైతన్య ఫ్యాన్స్ ని విమర్శించడంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో నెలరోజులు ఉన్న ఆరోహి ఆ తర్వాత ఎలిమినేట్ అయింది.