- Home
- Entertainment
- ఓవరాక్షన్ చేసిన మల్టీస్టార్ మన్మధ రాజా.. చిరాకుతో అతడిని జడ్జీలు ఎలా గెంటేశారో తెలుసా
ఓవరాక్షన్ చేసిన మల్టీస్టార్ మన్మధ రాజా.. చిరాకుతో అతడిని జడ్జీలు ఎలా గెంటేశారో తెలుసా
ఓవరాక్షన్ చేసిన మల్టీస్టార్ మన్మధరాజాకి జడ్జీలు తగిన విధంగా సమాధానం ఇచ్చారు. శ్రీముఖి కాళ్లపై పడి ఛాన్స్ కోసం బతిమాలుకున్న విధానం జడ్జీలకు చిరాకు తెప్పించింది.

ఓవరాక్షన్ చేస్తూ ఎంట్రీ
మల్టీస్టార్ మన్మధ రాజా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పెద్ద హైడ్రామా చేశాడు. ఖాతోజ్ రామాచారి అలియాస్ మల్టీస్టార్ మన్మధరాజా థియేటర్ ముందు మూవీ రివ్యూలు చెబుతూ.. మినిమమ్ డిగ్రీ ఉండాలి అనే డైలాగ్ తో పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వేదికపైకి రాగానే ఓవరాక్షన్ చేస్తూ శ్రీముఖి కాళ్లపై పడి.. బిగ్ బాస్ లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం అంటూ అడుక్కున్నాడు.
నవదీప్ కి నచ్చలేదు
అతడి బిహేవియర్ నవదీప్ కి ఏమాత్రం నచ్చలేదు. దీనితో అతడితో ఏమి మాట్లాడకుండానే డైరెక్ట్ గా రెడ్ ఫ్లాగ్ ఇచ్చేశాడు. రామాచారి తన కష్టాలు చెప్పుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు. అతడు అలా ఏడుస్తుంటే అభిజీత్ కి కూడా చిరాకు వేసింది.
నీ ఏడుపు పెళ్లి కాలేదనా ?
తాను నల్గొండ జిల్లాకి చెందిన వాడిని అని.. అమ్మా నాన్న ఎవరూ లేరు, ఆస్తులు కూడా లేవు అంటూ సింపతీ పొందే ప్రయత్నం చేశాడు. తన ప్రతిభ గురించి చెప్పుకోకుండా ఇలా ఏడుస్తూ సింపతీ కార్డు ఉపయోగించడం జడ్జీలకు నచ్చలేదు. తనకి పెళ్లి చేసే వాళ్ళు కూడా లేరని ఏడ్చేశాడు. ఇప్పుడు నీ ఏడుపు పెళ్లి కాలేదనా, మేము నీకు పెళ్లి చేయాలా ఏంటి అంటూ నవదీప్, బిందుమాధవి అతడిపై సెటైర్లు వేశారు.
బిగ్ బాస్ లో ఛాన్స్ కోసం నిరాహార దీక్ష
గతంలో రామాచారి.. పల్లవి ప్రశాంత్, ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై విమర్శలు చేస్తూ యూట్యూబ్ లో అటెన్షన్ పొందాడు. బిగ్ బాస్ లో ఛాన్స్ కోసం నిరాహార దీక్ష కూడా చేపట్టాడు. బిగ్ బాస్ లో ఛాన్స్ కోసం ఎవరిని అడగాలి అనేది నాకు తెలియదు. అందుకే అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్ష చేశా. అలాగైనా నా గురించి నాగార్జున సార్ కి తెలుస్తుంది అనేది తన ఉద్దేశం అని రామాచారి తెలిపారు.
బయటకి పంపేసిన జడ్జీలు
బిందు మాధవి, అభిజీత్ కూడా మీరు బిగ్ బాస్ కి సెట్ అవ్వరు అని చెప్పి రెడ్ ఫ్లాగ్ ఇచ్చి అతడిని గెంటేశారు. దీనితో రామాచారి ఏడ్చుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు.