కెప్టెన్సీ వార్.. లవ్ బర్డ్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు..
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9లో కెప్టెన్సీ టాస్క్ వల్ల లవ్ బర్డ్స్ రీతూ చౌదరి- కళ్యాణ్ మధ్య గొడవ స్టార్ అయ్యింది. తాజా టాస్క్ తో ఇద్దరి మధ్య వాదనలు, కౌంటర్‌లు ఉత్కంఠభరితంగా మారింది.

రసవత్తరంగా మారుతోన్న బిగ్ బాస్
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ షో అనగానే ఎమోషన్స్, ఫన్, ఫైట్స్, కాంట్రవర్సీలు, లవ్ ట్రాక్స్… ఇలా అన్నీ గుర్తొస్తాయి. అందుకే ఈ రియాలిటీ షో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. రియాలిటీ షో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రతి సీజన్‌లోనూ కొత్తగా ఏదో ఒక ట్విస్ట్ చూపిస్తూ టీఆర్పీ రేటింగ్స్‌లో దూసుకెళ్తుంది. తాజాగా సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ అంటూ కొత్త థీమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంటెస్టెంట్లు తన టాలెంట్ తో బీబీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తున్నారు. ఇందులో రీతూ చౌదరి (సెలబ్రిటీ) - ఆర్మీ కళ్యాణ్ (కామనర్) లవ్ ట్రాక్ హౌస్ హైలైట్‌గా మారింది. మరో వైపు రీతును డిమాన్ పవన్ కూడా ట్రై చేస్తున్నాడు. సాఫీగా సాగుతున్న ఈ లవ్ బర్డ్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు పెట్టారు.
నామినేషన్ లిస్ట్ ఇదే..
ప్రస్తుతం బిగ్ బాస్ 9 రెండు వారంలో అడుగుపెట్టింది. తొలుత నామినేషన్ ప్రక్రియతో హౌస్ ఒక్కసారిగా హీటెక్కింది. ఈ నామినేషన్స్ లో వ్యూహాత్మక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు ఫ్రెండ్స్ గా ఉన్నకంటెస్టెంట్లు ఒక్కసారిగా శత్రువులుగా మారారు. అలా తమ మధ్య ఉన్న వైరాలను బయటపెట్టారు. రెండో వారం నామినేషన్లలో మాస్క్ మ్యాన్ హరీష్, భరణి శంకర్, ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్, ప్రియా, సుమన్ శెట్టి, డీమాన్ పవన్ మొత్తం 7 మంది కంటెస్టెంట్స్ నిలిచారు. నామినేషన్ ముగిసిన వెంటనే ఆన్‌లైన్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను ఎలిమినేషన్ నుంచి కాపాడుకునేందుకు అభిమానులు, ఆడియెన్స్ ఓటింగ్‌లో భారీగా పాల్గొంటున్నారు.
కెప్టెన్సీ టాస్క్‌లో మలుపు
మొదటి వారం సంజన హౌస్ కెప్టెన్‌గా ఉన్న తర్వాత, రెండో వారానికి కొత్త కెప్టెన్ ఎవరు అన్నది హౌస్‌లో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ పోరు మరింత హాట్‌గా మారింది. మర్యాద మనీష్ టాస్క్‌ను ఆడే విధానాన్ని వివరించారు. బిగ్ బాస్ దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చారు. "కెప్టెన్సీకి అర్హులు కాని నలుగురిని ఎంచుకోవాలి" అని సంజనకు టాస్క్ ఇచ్చారు. దీంతో సంజన భయపడింది. టీమ్ అందరూ చర్చించుకుని అభిప్రాయం చెబుతానని అన్నది. సంజన తన టీం సభ్యులతో చర్చింది. ఆ తరువాత సంజన తన టీ మెంబర్స్ తో చర్చించి నలుగురు పేర్లను ప్రకటించింది అందులో ముందుగా ప్రియా పేరు చెప్పింది. దీంతో ప్రియా రియాక్ట్ అవుతూ..తను హ్యాండిల్ చేయలేకపోయిందా? మీరందరూ హ్యాండిల్ చేయలేకపోయారా? అంటూ ప్రశ్నించింది. ఇలా ప్రియా-సంజన మధ్య మాటల తూటాలు రేగాయి.
లవ్ బర్డ్స్ మధ్య చిచ్చు
ఇక ఆ తర్వాత మాస్క్ మాన్ హరిత హరీష్ ను సెలెక్ట్ చేసి, అతని ప్రవర్తన ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు అంటూ షాకింగ్ కామెంట్ చేసింది సంజన. దీంతో మాస్క్ మాన్ తనదైన స్టైల్ లో మాట్లాడుతూ.. తనని నామినేట్ చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ పంచ్ వేస్తాడు. ఆ తర్వాత సోల్జర్ పవన్ కూడా సెలెక్ట్ చేశారు సంజన. దీంతో అతడు రియాక్ట్ అవుతూ కెప్టెన్ అంటే నామినేషన్ లో ఉన్న వాడు కాదు. పరిస్థితులను హ్యాండిల్ చేయగలడా? లేదా? అనేది తెలుసుకోవాలని ప్రశ్నించాడు. దీంతో వెంటనే రీతు చౌదరి రియాక్ట్ అవుతూ.. ‘నువ్వు కెప్టెన్ గా ఉంటే అథారిటీ చూపిస్తావు, కానీ, ఎదుటివారి మాటలు అస్సలు వినవు’అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇలా రీతు కళ్యాణ్ మధ్య వాగ్వివాదం మొదలైంది. ఈ కౌంటర్‌తో బిగ్ బాస్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇలా కెప్టెన్సీతో లవ్ జంట మధ్య పెద్ద చిచ్చు పెట్టిందనే చెప్పాలి.
ఎమోషన్స్ మిక్స్ ప్రోమో
ఇక మొత్తానికి ప్రోమోలో లవ్, ఫైట్ మిక్స్ అయి హౌస్ వాతావరణం హీట్ పెంచేసింది. రీతూ–కళ్యాణ్ లవ్ ట్రాక్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్‌కి ఈ కొత్త గొడవ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి. బిగ్ బాస్ మేకర్స్ మాత్రం ఈ డ్రామాతో TRP గ్యారంటీ సాధించినట్టే.