బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఆల్రెడీ 2 ఎలిమినేషన్స్.. గోల్డెన్ ఛాన్స్ ఆరుగురికి మాత్రమే
బిగ్ బాస్ తెలుగు 9 అగ్నిపరీక్ష గురించి ఆసక్తికర విషయాలు లీక్ అవుతున్నాయి. ఇప్పటికే 2 ఎలిమినేషన్స్ జరిగినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష
ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ కొత్త సీజన్ ముందు ప్రత్యేక కార్యక్రమంగా రూపొందించిన బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ ప్రీ-షోకు సంబంధించిన ప్రోమోలు విడుదలై, ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
అగ్నిపరీక్ష ఎప్పటి వరకు అంటే
తాజా సమాచారం ప్రకారం, బిగ్‌బాస్ 9 తెలుగు అగ్నిపరీక్ష షో ఆగస్టు 22, 2025న జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ప్రతి రోజు ఒక గంటపాటు ఈ షో ప్రసారం అవుతుంది. ఆగష్టు 22 నుంచి సెప్టెంబర్ 4 వరకు బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రీ షో ప్రసారం ఉంటుంది. అంటే సరిగ్గా రెండు వారాలు ప్రీ షో ప్రసారం అవుతుంది.
ఆరుగురికి మాత్రమే ఛాన్స్
45 మంది కామనర్స్ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ కోసం పోటీ పడుతున్నారు. అగ్నిపరీక్షలో ఇప్పటికే రెండు ఎలిమినేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. 45 మంది నుంచి ఆరుగురు కామనర్లు మాత్రమే చివరికి ఎంపిక కానున్నారు. ఈ 45 మందిలో కామనర్స్ తో పాటు కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ లు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ ఈ విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక జరగలేదు.
న్యాయ నిర్ణేతలు వారే
ఈ ప్రీ-షోకు టాలెంటెడ్ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, నవదీప్, అభిజీత్, బిందు మాధవి న్యాయనిర్ణేతలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరి జడ్జ్‌మెంట్ ఆధారంగా పాల్గొనే వారికి తుది అవకాశాలు లభించనున్నాయి.
బిగ్ బాస్ తెలుగు 9పై భారీ అంచనాలు
బిగ్‌బాస్ 9 తెలుగు అగ్నిపరీక్షతో కొత్త సీజన్‌కు మంచి ప్రారంభం లభిస్తుందని ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు 9 షో ప్రారంభం కానుంది.