BiggBoss7:ప్రియాంకకి శివాజీ వార్నింగ్.. అంత లేదమ్మా, నేను బిగ్ బాస్ మాట తప్ప ఎవడి మాట వినను
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇటీవల ప్రారంభమై తొలి వారం పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్ లో నటి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ ఆయన సంగతి తెలిసిందే.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇటీవల ప్రారంభమై తొలి వారం పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్ లో నటి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ ఆయన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా బిగ్ బాస్ 7లో అంతా మార్పులు చేశామని ఉల్టా పుల్టా అంటూ హడావిడి చేశారు. బిగ్ బాస్ లో మార్పులు అయితే కనిపిస్తున్నాయి కానీ అవి రొటీన్ గా ఉన్నాయి అనే ఫీలింగ్ ఆడియన్స్ వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని రూల్స్ మార్చినప్పటికీ బిగ్ బాస్ జరుగుతున్న విధానం మాత్రం ఏమాత్రం భిన్నంగా లేదు. బోర్ కొట్టించే విధంగా ఉందని అంటున్నారు. అదే తరహా టాస్క్ లు.. ఒకరిపై ఒకరు చెప్పుకునే కన్విన్సింగ్ గా లేని చాడీలతో బిగ్ బాస్ 7 కూడా చప్పగా సాగుతోంది. ఇక శివాజీ లాంటి ఒకరిద్దరు మాత్రం వినోదం అందించే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. సోమవారం రోజు నామినేషన్స్ కి సంబంధించిన ప్రక్రియ మొదలైపోయింది. దీనికోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారిని షవర్ కిందికి పంపాలి. బజర్ నొక్కితే షవర్ పడుతుంది. ఆ తర్వాత ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణాలు చెప్పాలి.
ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం హీటెక్కింది. ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం మొదలు పెట్టారు. టేస్టీ తేజ పీకుతున్నావ్ అని మాట్లాడడం తనకి నచ్చలేదని చెబుతుంది. తిని తొంగుంటున్నాడు అని నువ్వు అన్నప్పుడు ఏం పీకుతున్నావ్ అని నేను అనడంలో తప్పేముంది అని తేజ కౌంటర్ ఇచ్చాడు.
ఇక యావర్ మాట్లాడుతూ ఆట సందీప్ తనని నామినేట్ చేస్తున్నాడు అంటూ అసహనం వ్యక్తం చేసాడు. ఇక ప్రియాంక, శివాజీ మధ్య చిన్న మాటల యుద్ధమే జరిగింది. నేను ఒక పాయింట్ చెబుతుంటే మీరు దబాయించే విధంగా అడ్డుకుంటున్నారు అని ప్రియాంక.. శివాజీని ఆరోపించింది. దీనికి శివాజీ బదులిస్తూ నేను ఇక్కడ బిగ్ బాస్ మాట తప్ప ఎవడి మాట వినను అని అన్నారు.
ఇలా మాట్లాడొద్దు అని ప్రియాంక అంటే అంతలేదమ్మా అంటూ శివాజీ ఫైర్ అయ్యాడు. చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగేటట్లు కనిపిస్తోంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో కన్ఫర్మ్ అయిన తొలి కంటెస్టెంట్ గా ఆట సందీప్ నిలిచారు. అతడు పవర్ అస్త్ర సాధించడంతో బిగ్ బాస్ 7 ఫస్ట్ కంటెస్టెంట్ గా అర్హత పొందారు.