MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గాండీవధారి అర్జున ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్ కి భారీ షాక్!

గాండీవధారి అర్జున ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్ కి భారీ షాక్!

గాండీవధారి అర్జున హీరో వరుణ్ తేజ్ కి భారీ షాక్ ఇచ్చింది. కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ వైపు అడుగులు వేస్తుంది. ఫస్ట్ డే వసూళ్లు దారుణంగా ఉన్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 26 2023, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Gandeevadhari Arjuna Review

Gandeevadhari Arjuna Review

గాండీవధారి అర్జున సినిమాపై ఎలాంటి హైప్ లేదు. దానికి తోడు ఫస్ట్ డేనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. వెరసి గాండీవధారి అర్జున కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. వరుణ్ తేజ్ కెరీర్లో గని డిజాస్టర్ అనుకుంటే ఆ చిత్ర ఫస్ట్ డే వసూళ్ళలో మూడో వంతు వసూళ్లు గాండీవధారి అర్జున చిత్రానికి దక్కాయి. గని ఫస్ట్ డే రూ. 3 కోట్ల షేర్ వసూలు చేసింది. కాగా గాండీవధారి వరల్డ్ వైడ్ షేర్ కేవలం కోటి రూపాయలు, అంతకంటే తక్కువగా నమోదైంది. 


 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Gandeevadhari Arjuna Review

Gandeevadhari Arjuna Review

నైజాంలో గాండీవధారి అర్జున రూ. 60 లక్షల గ్రాస్ రాబట్టింది, ఆంధ్రాలో రూ. 65 లక్షలు, సీడెడ్ లో రూ. 15 లక్షల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఏపీ/తెలంగాణాలలో గాండీవధారి అర్జున రూ. 1.40 లక్షల గ్రాస్, రూ. 75 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక రెస్టాప్ ఇండియా, ఓవర్సీస్, కర్ణాటక కలుపుకుని ఫస్ట్ డే రూ. 50 లక్షల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గాండీవధారి అర్జున రూ.1.90 కోట్ల గ్రాస్ రూ. 1 కోటి షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. 

35
Gandeevadhari Arjuna Review

Gandeevadhari Arjuna Review

ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 17 కోట్లు  కాగా రూ. 18 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్. ట్రెండ్ చూస్తుంటే అది అసాధ్యం అనిపిస్తుంది. సెకండ్ డే గాండీవధారి అర్జున చిత్ర వసూళ్లు మరింత దారుణంగా పడిపోయాయని సమాచారం. థియేట్రికల్ బిజినెస్ పక్కన పెడితే... దాదాపు రూ. 60 కోట్లతో గాండీవధారి అర్జున చిత్రం తెరకెక్కించారని సమాచారం. లండన్ లో చిత్రీకరించడం వలన అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయ్యిందని వరుణ్ తేజ్ అన్నారు. 

 

45

ఈ క్రమంలో గాండీవధారి అర్జున భారీగా నష్టాలు మిగిల్చే సూచనలు కలవు. కథ, కథనంపై దృష్టి పెట్టకుండా దర్శకుడు కేవలం స్టైలిష్ మేకింగ్, రిచ్ విజువల్స్ పై దృష్టి పెట్టి సినిమా తీశాడన్న వాదన వినిపిస్తోంది. గరుడవేగ చిత్రంతో వచ్చిన ఫేమ్ ని ప్రవీణ్ సత్తారు ఘోస్ట్, గాండీవధారి చిత్రాలతో పోగొట్టుకున్నారు. సాలిడ్ హిట్ పడితే కానీ ఆయన కమ్ బ్యాక్ కాలేరు. మరోవైపు గాండీవధారి అర్జున వరుణ్ తేజ్ కెరీర్ ని ప్రమాదంలో పడేసింది. ఎఫ్2 అనంతరం వరుణ్ కి క్లీన్ హిట్ లేదు. 
 

55

గాండీవధారి అర్జున చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్. నాజర్ కీలక రోల్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image2
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image3
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved