- Home
- Entertainment
- `పుష్ప2 వర్సెస్ గేమ్ ఛేంజర్`.. సుకుమార్ చేసిన పనికి అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య ఫైట్?
`పుష్ప2 వర్సెస్ గేమ్ ఛేంజర్`.. సుకుమార్ చేసిన పనికి అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య ఫైట్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రామ్ చరణ్ ఎప్పుడూ సినిమాల పరంగా పోటీ పడింది లేదు. కానీ ఫస్ట్ టైమ్ ఇద్దరు బాక్సాఫీసు వద్ద కొట్టుకునే పరిస్థితి వస్తుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప2` సినిమాలో నటిస్తున్నారు. మూడేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కిది కొనసాగింపు. ఆ మూవీపెద్ద హిట్ కావడంతో పార్ట్2పై భారీ అంచనాలున్నాయి. సినిమా కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. ఈ మూవీ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. చివరికి ఆగస్ట్ 15న విడుదల చేయాలని నిర్ణయించారు.
కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీ వాయిదా పడుతుందట. షూటింగ్ పూర్తి కాకపోవడం కారణంగా సినిమాని వాయిదా వేయబోతున్నట్టు తెలుస్తుంది. చిత్రీకరణకి ఇంకా రెండు నెలలు పడుతుందని, దీంతో రిలీజ్ డేట్‌కి పూర్తి కావడం కష్టమని, అందుకే వాయిదా పడే అవకాశం ఉందట. దీనికి సంబంధించి టీమ్ మల్లగుల్లాలు పడుతుంది.
టీమ్ నుంచి వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారట. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారట. ఇదే ఇప్పుడు కొత్త రచ్చకి దారితీస్తుంది. ఇది మెగా ఫ్యామిలీల మధ్య వివాదానికి కారణమవుతుందని చెప్పొచ్చు. సుకుమార్ చేసిన పనికి బన్నీ, చరణ్ కొట్టుకునే పరిస్థితి నెలకొంది.
రామ్ చరణ్ హీరోగా `గేమ్ ఛేంజర్` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోగా నటిస్తుంది. శ్రీకాంత్, అంజలి, ఎస్ జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. ఇంకా చాలా షూట్ చేయాల్సింది. అయితే రిలీజ్ మాత్రం ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారట.
క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారట. ఆ దిశగానే మూవీ చిత్రీకరణ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం మేరకు ఈ క్రిస్మస్‌కి రామ్ చరణ్, అల్లు అర్జున్ పోటీపడే అవకాశం కనిపిస్తుంది. `పుష్ప2`, `గేమ్ ఛేంజర్` ఓకే సారి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ రెండు పోటీ పడితే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే.
థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ మధ్య గొడవ పీక్‌కి చేరుతుందని చెప్పడంలో అతిశయేక్తి లేదు. ఇప్పటికే అల్లు అర్జున్ నంధ్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా ప్రచారంలో పాల్గొన్నాడు. ఇది మెగా ఫ్యామిలీని, ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. దీంతో పెద్ద గొడవ నడుస్తుంది. మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరిగింది. ఇలాంటి సమయంలో రామ్ చరణ్, బన్నీలు పోటీ పడితే ఆ వివాదం మరింత పీక్‌కి చేరుతుంది. మరి ఈ విసయంలో మేకర్స్ ఏం చేస్తారనేది చూడాలి.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `పుష్ప2`చిత్రంలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఫహద్ ఫాజిల్ విలన్‌గా చేస్తున్నాడు. సునీల్, అనసూయ వంటివారు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే బిజినెస్ కూడా భారీగా జరిగిందని, థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలుపుకుని వెయ్యికోట్లకు అమ్ముడు పోయిందని సమాచారం. `గేమ్ ఛేంజర్`ని నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.