MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • సీక్రెట్ గా పెళ్ళి.. హాస్టల్ జీవితం.. బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రవంతి భర్త చెప్పిన సంచలన నిజాలు

సీక్రెట్ గా పెళ్ళి.. హాస్టల్ జీవితం.. బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రవంతి భర్త చెప్పిన సంచలన నిజాలు

శ్రవంతి చొక్కవరపు.. బిగ్ బాస్ లో గేమ్ తో పాటు విమర్షలు కూడా ఫేస్ చేస్తున్న ఈ యాంకర్ బ్యూటీకి పెళ్లి అయ్యిందంటే ఎవరూ నమ్మరు. ఈ బ్యూటీ పెళ్ళి కొన్ని అనివార్య పరస్థితుల్లో అయ్యిందట. ఆమె పెళ్ళి వెనుకు దాగి ఉన్న సీక్రేట్స్ ను శ్రవంతి భర్త రీసెంట్ గా రివిల్ చేశారు. 

Mahesh Jujjuri | Updated : Mar 27 2022, 12:24 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

అవ్వడానికి యాంకర్ అయినా.. బిగ్ బాస్ ఓటీటీలోకి వచ్చేవరకూ చాల మందికి తెలియదు యాంకర్ శ్రవంతి చొక్కారపు. బిగ్ బాస్ లో మంచి గేమర్ గా... టాలెంట్ తో గేమ్ ఆడుతున్న శ్రవంతీ.. కొన్ని విమర్షలు కూడా ఫేస్ చేస్తోంది. అయితే శ్రవంతికి సంబంధించిన కొన్నిసీక్రేట్స్ ను ఆమె భర్త ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచారు.తాము ఎన్ని కస్టాలు పడ్డామో వివరించారు. 

27
Asianet Image

స్రవంతిని యాంకర్‌గా ఆమెను గుర్తుపడతారో లేదో తెలియదు కాని బిగ్ బాస్  కంటెస్టెంట్‌ గా మాత్రం ఆమె బాగా ఫేమస్ అయ్యారు. రాయలసీమలోని మారుమూల నుంచి గ్రామం నుంచి వచ్చి సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగే సాధించింది శ్రవంతి. యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకున్న స్రవంతి రీసెంట్ గా బిగ్‌బాస్‌ ఓటీటీలో అడుగుపెట్టింది. 
 

37
Asianet Image

అయితే తనకు పెళ్లైన విషయాన్ని ఎంతోకాలంగా దాచిపెట్టిన ఆమె బిగ్‌బాస్‌ స్టేజీపై మాత్రం తాను రెండుసార్లు పెళ్లి చేసుకున్న విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ రెండు సార్లు పెళ్ళి చేసుకోవడంలో కూడా ఓ మతలబ్ ను కూడా వెల్లడించింది శ్రవంతి. ఎంతో హుషారుగా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె గేమ్‌ పై అందరూ ఆసక్తిగా గమనించారు.

47
Asianet Image

కాని ఆమె మాత్రం గేమ్ ఆడట్లేదంటూ విమర్షలు వస్తున్నాయి. ఎప్పుడూ ఆమె అఖిల్‌ జపం చేస్తోందంటూ విమర్షిస్తున్నారు. రీసెంట్ గా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో  స్రవంతి భర్త ప్రశాంత్‌ స్పందించారు. ట్రోలింగ్‌పై,  రెండు సార్లు పెళ్ళి  గురించి కూడా వివరణ ఇచ్చారు.  

57
Asianet Image

నిజానికి బిగ్‌బాస్‌ సీజన్ 5లోనే శ్రవంతి సందడి చేయాల్సి ఉంది. కాని అప్పుడు ఆమో ఆరోగ్యం సహకరించకపోవడంతో హౌస్ లోకి వెళ్లలేదంటూ ఆమె భర్త చెప్పుకొచ్చారు.  తమకు అనివార్య పరిస్థిస్తుల్లో పెళ్లి జరిగిందన్నారు ప్రశాంత్. ఇంతకుముందు తాను బిజినెస్‌ చేసేవాడినని, హితులను నమ్మి మోసపోవడంతో నష్టపోయాను అన్నారు. అప్పటికే స్రవంతి, తాను ప్రేమలో ఉన్నామన్నారు ప్రశాంత్. 
 

67
Asianet Image

అయితే కరెక్ట్ గా  బిజినెస్‌లో నిండా మునిగిన సమయంలో స్రవంతి ఫోన్‌ చేసి ఇంట్లో పెళ్లంటున్నారు ఏం చేయాలని భయపడిపోయిందన్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఆమెను ఇంట్లో నుంచి వచ్చేయమని చెప్పి సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. పెళ్లి తర్వాత ఆమెను హాస్టల్‌లో ఉంచానని, కొన్నాళ్లకు అందరినీ ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నామన్నారు. శ్రవంతి చెప్పిన రెండు పెళ్లిళ్ల సీక్రేట్ అదే అన్నారు.  

77
Asianet Image

బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తరువాత అడుగుపెట్టాక  శ్రవంతి ఆడాళ్లతో ఉంటుంది అనుకుంటే  అఖిల్‌, అజయ్‌లతో కలిసిపోయిందన్నాడు ప్రశాంత్. ఆమె విన్నర్‌ గా తిరిగి హౌన్ నుంచి బయటకు రావాలి అని కోరుకుంటున్నట్టు తెలిపాడు. శ్రవంతిని ఫిట్టింగ్ మాస్టర్ అని ట్రోల్ చేస్తున్నారని, కానీ అక్కడ గేమ్‌ ఆడుతున్నవాళ్లకి స్రవంతి అంటే ఏంటో తెలుసని  ఆమెను వెనకేసుకొచ్చాడు శ్రవంతి భర్త. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories