- Home
- Entertainment
- Bheemla Nayak business: నైజాంలో బాహుబలి రికార్డుకు ఎసరు.. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్
Bheemla Nayak business: నైజాంలో బాహుబలి రికార్డుకు ఎసరు.. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్
పవన్ ఫ్యాన్స్ లో, ట్రెండ్ వర్గాల్లో భీమ్లా నాయక్ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్, రానా ఇద్దరూ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ శుక్రవారమే బాక్సాఫీస్ పై దండయాత్రకు భీమ్లా నాయక్ సిద్ధం అవుతున్నాడు.
పవన్ ఫ్యాన్స్ లో, ట్రెండ్ వర్గాల్లో భీమ్లా నాయక్ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్, రానా ఇద్దరూ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. దీనితో ఇద్దరి మధ్య జరిగే రసవత్తర పోరాటాన్ని ఎంజాయ్ చేసేందుకు అభిమానులు సిద్ధం అవుతున్నారు.
ఏపీలో టికెట్ ధరల సమస్య ఇంకా తేలలేదు. అయినప్పటికీ 100 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చారు. దీనితో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ రూపంలో సునామి చూడబోతున్నాం అంటూ అంచనాలు మొదలయ్యాయి. అంచనాలకు తగ్గట్లుగానే అన్ని ఏరియాలలో భీమ్లా నాయక్ చిత్రం అదిరిపోయే ప్రీరిలీజ్ బిజినెస్ చేసుకుంది. పవర్ స్టార్ స్టామినాతో ప్రీరిలీజ్ బిజినెస్ 100 కోట్ల దాటింది.
భీమ్లా నాయక్ టోటల్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా రూ 107 కోట్ల వరకు నమోదైంది. ఏపీ తెలంగాణాలో ప్రీ రిలీజ్ బిజినెస్ 89 కోట్ల వరకు జరిగింది. ఏరియాల వారీగా గమనిస్తే.. నైజాం ఏరియాలో భీమ్లా నాయక్ థియేట్రికల్ హక్కులు రూ 35 కోట్లకు అమ్ముడయ్యాయి. ఉత్తరాంధ్రలో రూ.9.2 కోట్లు, సీడెడ్ లో రూ.17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇక ఈస్ట్ గోదావరిలో 6.4 కోట్లు, గుంటూరులో 7 కోట్లు వెస్ట్ గోదావరిలో 5.6 కోట్లు , కృష్ణా 6 కోట్లు, నెల్లూరులో 3.5 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు 9 కోట్లకు అమ్ముడయ్యాయి. దీనితో వరల్డ్ వైడ్ గా ప్రీరిలీజ్ బిజినెస్ 107 కోట్ల వరకు ఉంది.
చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మాస్ మూవీ కావడంతో ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అన్ని అనుకూలంగా జరిగితే నైజాం ఏరియాలో భీమ్లా నాయక్ చిత్రం బాహుబలి 2 రికార్డుని అధికమించి అవకాశం ఉందంటూ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా డే 1 కలెక్షన్స్ నాన్ బాహుబలి రికార్డ్ సృష్టించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.