- Home
- Entertainment
- బాలయ్య చేసిన దరిద్రపు పని సుమన్, చిరంజీవి కూడా చేశారా ? ఆ మూవీస్ లో హీరోయిన్లు వీళ్ళే
బాలయ్య చేసిన దరిద్రపు పని సుమన్, చిరంజీవి కూడా చేశారా ? ఆ మూవీస్ లో హీరోయిన్లు వీళ్ళే
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉన్నారు. బాలయ్యకి అన్నీ బాగా కలసి వస్తున్నాయి. రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇటీవలే పద్మభూషణ్ అవార్డు కూడా దక్కింది. అఖండ నుంచి బాలయ్యకి వరుసగా సూపర్ హిట్స్ దక్కుతున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Suman, Chiranjeevi, Balakrishna
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉన్నారు. బాలయ్యకి అన్నీ బాగా కలసి వస్తున్నాయి. రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇటీవలే పద్మభూషణ్ అవార్డు కూడా దక్కింది. అఖండ నుంచి బాలయ్యకి వరుసగా సూపర్ హిట్స్ దక్కుతున్నాయి. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ ఇలా బాలయ్య జైత్ర యాత్ర కొనసాగుతోంది.
Balakrishna
డాకు మహారాజ్ సూపర్ హిట్ అయినప్పటికీ ఒక విషయంలో వివాదంలో చిక్కుకుంది. ఊర్వశి రౌతేలా చేసిన ఐటెం సాంగ్ విమర్శలకు కారణం అయింది. దబిడి దిబిడి సాంగ్ లో ఊర్వశి రౌతేలా, బాలయ్య చేసిన డ్యాన్స్ మూమెంట్స్ చాలా వల్గర్ గా అనిపించాయి అని ప్రేక్షకులు, క్రిటిక్స్ విమర్శించారు. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ మాస్ ఆడియన్స్ మాత్రం థియేటర్స్ లో ఆ సాంగ్ ని బాగా ఎంజాయ్ చేశారు.
Suman
తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ.. బాలయ్య స్థాయికి ఎలాంటి సాంగ్ లో నటించాల్సింది కాలేదు. అలా అసభ్యంగా డ్యాన్స్ చేస్తేనే టికెట్లు తెగుతాయని వాళ్ళ నమ్మకమా ? సినిమా బాగా ఆడింది కదా.. అలాంటి అసభ్యకరమైన సాంగ్ తో సినిమా పేరుని ఎందుకు చెడగొట్టుకోవడం అని అన్నారు. బాలయ్య చేసిన దరిద్రపు పని నేను కూడా సుమన్ తో చేయించాను. బంగారు మొగడు చిత్రంలో అక్కడ చెయ్యి వేస్తే అనే సాంగ్ ఉంది.
Chiranjeevi
సుమన్, మాలశ్రీ మధ్య సాంగ్ అది. మంచి పాటలు పెడితే ప్రేక్షకులు ఆదరించడం లేదు అనే కోపంతో నేనే ఆ సాంగ్ పెట్టమని చెప్పాను. కాబట్టి నేను చేసింది కూడా తప్పే. అదే విధంగా చిరంజీవి కూడా అలాంటి సాంగ్ చేశారు. ఆ టైంలో నేనే విమర్శించాను అని తమ్మారెడ్డి అన్నారు. ఖైదీ నెంబర్ 150 చిత్రంలో అమ్మడు కుమ్ముడు అనే సాంగ్ తనకి నచ్చలేదని తమ్మారెడ్డి విమర్శించడం జరిగింది. చిరంజీవి, కాజల్ ఈ సాంగ్ లో బోల్డ్ గా డ్యాన్స్ చేశారు.
అఖండ చిత్రం అద్భుతంగా ఉంది. భగవంత్ కేసరి కూడా మంచి సినిమా. అసభ్యత లేకుండానే బాలయ్య చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నాయి. అలాంటప్పుడు డాకు మహారాజ్ లో ఈ సాంగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. అనవసరమైన కాంట్రవర్సీ తప్ప ఆ సాంగ్ వల్ల ఉపయోగం లేదు. బాలయ్య ఈ పాట వద్దు అని చెప్పి ఉంటే ఆయన వ్యక్తిత్వం పెరిగేది అని తమ్మారెడ్డి అన్నారు.