రివ్యూ: భానుమతి & రామకృష్ణ

First Published Jul 3, 2020, 1:10 PM IST

ఓటీటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్న సినిమా అనగానే ఏ సస్పన్స్ థ్రిల్లరో లేక మర్డర్ మిస్టరీనో అదీ కాకపోతే హారర్ జానర్ లో వచ్చే సినిమా అయ్యింటుందని ఫిక్సై పోతున్న సమయం ఇది. విరివిగా ప్రపంచ సినిమా, వెబ్ సీరిస్ లు చూస్తున్న ప్రేక్షకుడుని తమ ప్రతిభతో ఆకట్టుకోలేక,మిస్టరీలు ముడి సరిగ్గా విప్పలేక తడబడుతూ అపజయం అంగీకరిస్తున్న తరుణమిది. ఈ టైమ్ లో ఓటీటిలో ఓ రొమాంటిక్ కామెడీ రిలీజ్ అవుతోంది..అంటే ఆసక్తికరమే. అయితే ఈ రొమాంటిక్ కామెడీ సైతం అదే పరాజయ బాటలో ప్రయాణం పెట్టుకుందా లేక గీతా గోవిందం లా గమ్మత్తైన అనుభూతిని ఇచ్చిందా, అసలు రిలీజ్ కు ముందే టైటిల్ మార్చాల్సిన పరిస్దితి  తెచ్చుకున్న ఈ సినిమా కథేంటి.,చూడచ్చా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.