Intinti Gruhalakshmi: తులసి మీద పగబట్టిన బెనర్జీ.. సరికొత్త ప్లాన్ వేసిన లాస్య?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 3వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ మీరు ఇంకా బయలుదేరొచ్చు అనడంతో ఇంకొకసారి ఆలోచించుకోండి తర్వాత మీరు చాలా నష్టపోతారు అని అంటాడు. అప్పుడు బెనర్జీ నువ్వు కాకపోతే ఇంకా వందమంది వస్తారు మార్కెట్లో మీది మంచి కంపెనీ కదా అని వచ్చాను అంతే అని అంటాడు. అప్పుడు తులసి చూడండి బెనర్జీ గారు ఇలాంటి అర్హత లేని ప్రాజెక్టుని మేమే కాదు ఇంకెవరిని చేయనివ్వము అనడంతో వెంటనే బెనర్జీ ఏంటి నాకే వార్నింగ్ ఇస్తున్నావా అని అంటాడు. మీలాంటి వాళ్లకు అలాంటి భాషలోని చెప్పాలి. జనాలను మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోము. చరిత్ర ఎంత తెలుసుకునే మాట్లాడుతున్నాము అనడంతో షట్ అప్ అని గట్టిగా అరుస్తాడు బెనర్జీ.
అదే స్కూల్ ప్రాజెక్టు ఫుల్ ఫీల్ చేసి ఓపెనింగ్ నీకు నీ బాస్ కు ఓపెనింగ్ కి ఇన్విటేషన్ పంపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరొకవైపు శృతి తల తుచుడుచుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి ప్రేమ్ వచ్చి శృతి ఏం చేస్తున్నావు తెలుస్తోందా తల తుడుచుకోవడం కోసం ఇంత పైకి మెట్లు అన్ని ఎక్కి వస్తావా అని అంటాడు. నేను ఉన్నప్పుడే ఇన్ని చెప్తున్నా నా మాట వినకుండా ఇన్ని చేస్తున్నావు అంటే నేను లేనప్పుడు ఇంకా ఎన్ని చేస్తున్నావో నాకు అర్థం అయిపోయింది అనడంతో ఇప్పుడు ఏమైంది ప్రేమ్ అనే శృతి అడగగా అప్పుడు ప్రేమ్ జాగ్రత్తలు చెబుతూ ఉండగా అది కాదు ప్రేమ్ అని అన్నా కూడా ప్రేమ్ వినిపించుకోకుండా శృతికి జాగ్రత్త చెబుతూ ఉంటాడు. అప్పుడు శృతి ఎంత చెప్పినా వినిపించుకోకుండా శృతికి తల తుడుస్తూ ఉంటాడు.
చూసి అంకిత మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అంకిత గురించి మాట్లాడుకుంటూ నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వదిన సేవలు చేస్తోంది తర్వాత నువ్వు వదినకు సేవలు చేయొచ్చు అని అనుకుంటూ ఉండగా అంకిత బాధపడుతూ ఉంటుంది. అదంతా కూడా లాస్య చూస్తూ ఉంటుంది. అప్పుడు నీ ఫేస్ ద్వారా నువ్వే నాకు ఒక బలమైన ఆయుధాన్ని ఇచ్చావు ఇప్పుడు చూడు అంకిత నాకే వార్నింగ్ ఇస్తావు కదా ఏం చేస్తానో చూడు అనుకుంటూ ఉంటుంది లాస్య. మరొకవైపు సామ్రాట్ తులసిని పొగుడుతూ మీరు మీ పర్సనల్ పని మీద బయటకు వెళ్లారు అనుకున్నాను కానీ ఆఫీస్ పని మీద వెళ్లారని నేను అనుకోలేదు అనడంతో నన్ను నమ్మి నాకు పని అప్పచెప్పినప్పుడు సవ్యంగా చేయాలి కదా అంటుంది తులసి.
అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ వాడి మీద వాడుకున్న నమ్మకం కంటే నీపైనే నమ్మకం ఎక్కువగా ఉంది వాడు నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు అనడంతో సామ్రాట్ తల ఒకవైపు పెట్టుకుంటాడు. తరువాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్ స్కూల్ నుంచి హనీ వచ్చే టైం అయింది నేను వెళ్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు బెనర్జీ తులసి అన్న మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తులసీ నన్ను రెచ్చగొట్టింది నేనంటే ఏంటో చూపిస్తాను అని అనుకుంటూ ఉంటాడు. సామ్రాట్ తులసి గారు మీరు బెనర్జీ విషయంలో చేసిన ధైర్యానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మిమ్మల్ని సీఈవోగా నియమించి నేను రిటైర్మెంట్ తీసుకుందామనుకున్నాను అనడంతో నేను తప్ప జోకింగ్ చేయడానికి మీకు ఎవరు దొరకలేదా అని అంటుంది తులసి.
అప్పుడు వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఫైల్ తీసుకొని ఇస్తే వెళ్ళిపోతాను అనడంతో ఇంతలోనే అక్కడికి హనీ వస్తుంది. హాయ్ హాని అనడంతో ఎవరు మీరు అని అంటుంది. అప్పుడు తులసి హనికి నచ్చ చెబుతూ బుజ్జగిస్తూ ఉంటుంది. అప్పుడు హనీ బయటకి తీసుకుని వెళ్ళమని తులసికి చెబుతుంది. తులసి కుదరదు అనడంతో లేదు తీసుకెళ్లాలి అని మొండి పట్టి పడుతుంది. అప్పుడు సామ్రాట్ ఇందాక నేను డిన్నర్ కో ఉండమంటే ఏదో పని ఉందన్నారు కదండీ అనడంతో హనీ అడిగితే ఏదైనా చేయాల్సిందే అని అంటుంది తులసి. ఇప్పుడు నేను మీతో పాటు గుడికి రావచ్చా అని సామ్రాట్ అడగడంతో పర్లేదులే ఆంటీ అంతలా అడుగుతున్నారు అని కామెడీ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది హనీ.
ఇంతవరకు హనీ నీరసంగా మౌనంగా ఉంది కానీ ఒక్కసారిగా నువ్వు కనిపించేసరికి మొత్తం మాయం అయిపోయింది అని అంటాడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్. అప్పుడు అదే కదా తులసి గారి మాయ అంటే అని అంటాడు సామ్రాట్. మరొకవైపు ప్రేమ్ శృతికి ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఏంటి ప్రేమ్ ఇలా చేస్తున్నావ్ నేను ఏమైనా చిన్నపిల్లనా నాకు ఇలా గోరుముద్దలు పెడుతున్నావు అనడంతో కలిపి గోరుముద్దలు పెట్టడానికి వయసుతో సంబంధం లేదు అని అంటాడు ప్రేమ్. నేను తింటాను ప్లేట్ ఇలా ఇవ్వు ప్రేమ్ అనడంతో నీకు నువ్వు తింటే నీ కడుపు నిండుతుందేమో కానీ నా మనసు నిండదు అని శృతికి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు ప్రేమ్. అప్పుడు వారిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.