- Home
- Entertainment
- బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న ప్రియమణి.. ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న ‘ఢీ’బ్యూటీ అందాలు..
బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న ప్రియమణి.. ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న ‘ఢీ’బ్యూటీ అందాలు..
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి (Priyamani) తన ఫ్యాషన్ సెన్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గ్లామర్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోషూట్ మతిపోగొడుతోంది. ట్రెడిషన్ లుక్ లో ప్రియమణి అదరగొడుతోంది.

సౌత్ ఇండస్ట్రీని తన అందం, అభినయంతో కొన్నేండ్లు ఊపూపిన హీరోయిన్లలో ప్రియమణి ఒకరు. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ పలు హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. అలాగే స్టార్ హీరోల సరసన నటించడంతో అగ్ర స్థాయి హీరోయిన్లలో చోటు సంపాదించుకుంది.
ప్రియమణి నటించిన చిత్రాల్లో ‘పెళ్లైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రక్త చరిత్ర’ చిత్రాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇప్పటికీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సరసన ప్రియమణి నటించిన చిత్రం ‘యమదొంగ’ను ఆడియెన్స్ చాలా ఇష్టపడుతారు.
కొన్నాళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ గతేడాదే రీ ఎంట్రీ ఇచ్చింది. సెకండాఫ్ లో ప్రియమణి మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. ఇతర భాషలతోపాటు తెలుగులోనూ వరుస చిత్రాలను ప్రకటిస్తూ అభిమానులు, ప్రేక్షకులను అలరిస్తోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ తన మార్క్ చూపెడుతోంది.
ఈ ఏడాది ప్రారంభంలో ‘భామా కలాపం’తో ఓటీటీ వేదికన ప్రేక్షకులను అలరించింది. కమ్ బ్యాక్ ఇచ్చిన ప్రియమణికి ఈ చిత్రం మంచి రెస్పాన్స్ తో వెల్ కమ్ చెప్పింది. ఆ తర్వాత తాజాగా వచ్చిన ‘విరాట పర్వం’లోనూ భరతక్కగా కనిపించింది ప్రియమణి. తొలిసారిగా నక్సలైట్ పాత్రలో నటించడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అయితే సెకండాఫ్ లో ప్రియమణి మరింత గ్లామర్ గా కనిపిస్తోంది. తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని పెంచేందుకు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతోంది. ట్రెడిషనల్ లుక్ లో పాత ప్రియమణిని పరిచయం చేస్తూ నెటిజన్లను తనవైపు ఆకర్షిస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఈ పిక్స్ లో ప్రియమణి బ్లాక్ డ్రెస్ లో అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో అందాల విందు చేస్తోంది. మతిపోయేలా ఫొటోలకు ఫోజులిస్తూ కుర్రాళ్లను చూపు తిప్పుకోనివ్వడం లేదు. గ్లామర్ పిక్స్ ను అభిమానులు లైక్ చేస్తూ.. కామెంట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే ‘విరాట పర్వం’ ఆత్మీయ వేడుక సందర్భంగా ఈ అవుట్ ఫిట్ ధరించినట్టు తెలిపింది.