- Home
- Entertainment
- సినిమా తీయడం చేతకాక మంగళవారం అన్నారట.. బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు, అశ్విని దత్ కి సపోర్ట్
సినిమా తీయడం చేతకాక మంగళవారం అన్నారట.. బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు, అశ్విని దత్ కి సపోర్ట్
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ బండ్ల గణేష్. ముక్కుసూటిగా మాట్లాడడం అతడి నైజం. బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ కొన్ని సందర్భాల్లో వివాదంగా మారుతుంటాయి.

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ బండ్ల గణేష్. ముక్కుసూటిగా మాట్లాడడం అతడి నైజం. బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ కొన్ని సందర్భాల్లో వివాదంగా మారుతుంటాయి. నిర్మాతగా బండ్ల గణేష్ గబ్బర్ సింగ్, టెంపర్, బాద్షా లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రొడ్యూసర్ గిల్డ్ షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. టికెట్ ధరలు పెంచేది, తగ్గించేది వారే.. మళ్ళీ బంద్ లు నిర్వహించేది కూడా వారే అంటూ విమర్శించారు. స్టార్ హీరోలని రెమ్యునరేషన్ తగ్గించుకోమని అడగడాన్ని అశ్విని దత్ తప్పుబట్టారు. అశ్విని దత్ వ్యాఖ్యలకు బండ్ల గణేష్ తాజాగా మద్దతు తెలిపారు. ఈ మేరకు బండ్ల గణేష్ ఓ ఆడియో బైట్ రిలీజ్ చేశారు.
హీరోని కానీ, దర్శకుడిని కానీ రెమ్యునరేషన్ తగ్గించుకోమని అడిగే హక్కు ఎవరికీ లేదు. తమ మార్కెట్ ని బట్టి ఆయా హీరోలు పారితోషికం తీసుకుంటూ ఉంటారు. మార్కెట్ లో చాలా కార్లు ఉంటారు. అన్ని కార్లే కాబట్టి అన్నింటికి ఒకే ధర ఉండదు. ఒక్కో కారుని బట్టి ఒక్కో ధర ఉంటుంది. ఆ కారు మార్కెట్ విలువ బట్టి మనం కొనుక్కోవాలి అంతే.
అలాగే హీరోలకు వారి మార్కెట్ విలువ బట్టి రెమ్యునరేషన్ ఉంటుంది. ఏ హీరో స్థాయి ఎంత.. వారితో సినిమా చేస్తే బడ్జెట్ ఎంత అవసరం అనే విషయాల్లో అవగాహనతో వెళ్లి నిర్మాతలు సినిమాలు తీయాలి. అంతే కానీ రెమ్యునరేషన్ తగ్గించుకోమని అడగకూడదు అని బండ్ల గణేష్ అన్నారు. నేను హీరోలని బతిమాలుకొని వారితో సినిమాలు నిర్మించి బ్లాక్ బస్టర్స్ కొట్టాను.
కాల్ షీట్స్ కి, షీట్స్ కి తేడా తెలియని వారు కూడా ప్రొడ్యూసర్ గిల్డ్ లో ఉన్నారు. లైట్స్ ఎలా వాడుతారు.. ఏ లొకేషన్స్ లో ఎంత ఖర్చు అవుతుంది అని తెలియని నిర్మాతలు కూడా ప్రొడ్యూసర్ గిల్డ్ లో ఉన్నారు. నేను నటుడిగా, ప్రొడక్షన్ మేనేజర్ గా, నిర్మాతగా చేశాను. సినిమా తీయడం చేతకాక మంగళవారం అంటున్నట్లు ఉంది చాలా మంది పరిస్థితి అని బండ్ల గణేష్ ఎద్దేవా చేశారు.
ప్రొడ్యూసర్ గిల్డ్ అవసరం లేదు. ఛాంబర్, కౌన్సిల్ సరిగ్గా పని చేస్తే సరిపోతుంది అని బండ్ల గణేష్ అన్నారు. ప్రొడ్యూసర్ గిల్డ్ పై బండ్ల గణేష్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఎంత దూరం వెళతాయో చూడాలి. మరోవైపు అశ్విని దత్ గతంలో తన చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకుని సినిమాలు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆయన ప్లేటు మార్చి మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.