MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మరోసారి పూరిని కెలికిన బండ్ల గణేష్.. అలాంటివాడు అసలు మనిషేనా అంటూ ఫైర్

మరోసారి పూరిని కెలికిన బండ్ల గణేష్.. అలాంటివాడు అసలు మనిషేనా అంటూ ఫైర్

పూరి తనయుడు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ పూరి జగన్నాధ్ పై డైరెక్ట్ గా అటాక్ చేశారు. సొంత కొడుకుని పట్టించుకోకుండా ఎవరెవరినో సూపర్ స్టార్స్ చేస్తావు ఏంటి అన్నా అంటూ బండ్ల గణేష్ పూరిని విమర్శించిన సంగతి తెలిసిందే.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 30 2022, 09:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పూరి తనయుడు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ పూరి జగన్నాధ్ పై డైరెక్ట్ గా అటాక్ చేశారు. సొంత కొడుకుని పట్టించుకోకుండా ఎవరెవరినో సూపర్ స్టార్స్ చేస్తావు ఏంటి అన్నా అంటూ బండ్ల గణేష్ పూరిని విమర్శించిన సంగతి తెలిసిందే.  ర్యాంపులు, వ్యాంపులు వస్తుంటారు పోతుంటారు.. ఫ్యామిలీ ముఖ్యం అంటూ బండ్ల గణేష్ పూరి జగన్నాధ్ ని ఉద్దేశించి పబ్లిక్ గా షాకింగ్ కామెంట్స్ చేశారు. 

26

ఆ తర్వాత పూరి జగన్నాధ్ పరోక్షంగా బండ్ల కామెంట్స్ కి కౌంటర్ ఇవ్వడం చూశాం. నాలుక జాగ్రత్తగా ఉంచుకోవాలని పూరి హెచ్చరించారు. తాజాగా మరోసారి బండ్ల గణేష్ పూరి పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అక్కడ పూరి జగన్నాధ్ గురించి ప్రస్తావన వచ్చింది. 

36

సదరు యాంకర్ బండ్ల గణేష్ తో ఎక్కువగా వివాదాస్పద అంశాల గురించే ప్రస్తావించే ప్రయత్నం చేశారు. దీనితో బండ్ల గణేష్ యాంకర్ పై శకునిలాగా వ్యవహరించవద్దు అంటూ చిర్రుబుర్రులాడారు. యాంకర్ పూరి జగన్నాధ్ గురించి అలా ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించగా.. భార్యని ప్రేమించని వాడు మనీషా అంటూ బండ్ల గణేష్ ఫైర్ అయ్యాడు. 

46

ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో మాత్రమే ఇది. పూర్తి ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఇంకెన్ని కామెంట్స్ చేశాడో చూడాలి. ఆయన ఫ్యామిలీ ఆయన ఇష్టం అని యాంకర్ అనగా.. పూరి గురించి కామెంట్స్ చేసే రైట్ నాకు ఉంది. పూరి నా ఫ్రెండ్ అంటూ బండ్ల గణేష్ యాంకర్ తో వాగ్వాదం చేశారు. 

56

పూరి జగన్నాధ్, బండ్ల గణేష్ కాంబినేషన్ లో ఇద్దరమ్మాయిలతో, టెంపర్ రెండు చిత్రాలు వచ్చాయి. గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్ లాంటి హిట్ చిత్రాలు నిర్మించిన బండ్ల గణేష్ ఇటీవల నిర్మాతగా సైలెంట్ అయ్యాడు. 

66

ఇటీవల బండ్ల గణేష్ చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. మైక్ పట్టుకుంటే పూనకం తో ఊగిపోయే బండ్ల గణేష్ ని చూస్తూనే ఉన్నాం. కంప్లీట్ ఇంటర్వ్యూలో పూరి ఫ్యామిలీ గురించి బండ్ల గణేష్ ఇంకెన్ని కామెంట్స్ చేశాడో అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Madhavi Deverakonda: కొడుకు పెళ్లిలో అందరి మనసులు గెలిచిన విజయ్ దేవరకొండ తల్లి..
Recommended image2
ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved