పాలిటిక్స్ పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు.. జీవితంలో చాలా నష్టపోయానంటూ షాక్
నిర్మాత, నటుడు బండ్ల గణేష్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో చాలా నష్టపోయానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సంచలన నిర్మాత, నటుడు బండ్ల గణేష్ రాజకీయాలపై స్పందించారు. తాను జీవితంలో పాలిటిక్స్ కారణంగా చాలా నష్టపోయానని తెలిపారు. నెటిజన్లు చేసిన కామెంట్లకి తానూ ఆయన స్పందించారు. గతంలో పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఓ టీవీ డిబేట్లో వాదించిన వీడియోని షేర్ చేశారు. అందులో ఎమ్మెల్యేగా ఉన్న రోజాతో బండ్ల గణేష్ టీవీ డిబేట్లో వాగ్వాదం చేసుకుంటున్నారు.
Puri jagannadh
పళ్లు రాలిపోతాయని రోజా విమర్శలు చేయగా, దానికి బండ్ల గణేష్ కూడా నీ పళ్లు రాలిపోతాయి. నీ పళ్లు రాలగొడతా అంటూ ఫైర్ అయ్యారు. ఏ మాట్లాడుతున్నావ్ వెదవ, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా ఉండి అలానేనా మాట్లాడేది అంటూ తనదైన స్టయిల్లో రెచ్చిపోయాడు బండ్లగణేష్ తాజాగా ఈ వీడియోని ఓ అభిమాని షేర్ చేస్తూ రోజాకి మన బండ్ల అన్నగారే కరెక్ట్ అప్పట్లోనే రోజాకి లైవ్ డిబేట్లోనే చుక్కలు చూపించారని పేర్కొన్నారు.
మళ్లీ రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ పోస్ట్ పెట్టగా, దీనికి బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను రాజకీయాల వల్ల చాలా నష్టపోయానని తెలిపారు. `రాజకీయాల వలన జీవితంలో చాలా నష్టపోయాను, నాకు ఏ రాజకీయాలతో, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అందరూ ఆత్మీయులే` అని పేర్కొన్నారు.
కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నవారే రాజకీయాలకు రావాలి, మా బాస్ లాగా అని మరో జనసేన అభిమాని పోస్ట్ చేయగా, `నాకంత స్థాయి లేదు. అంత గొప్ప వాన్ని కాదు సోదర` అని దెండం పెట్టాడు బండ్ల గణేష్. ఇన్నాళ్లకు సరైన నిర్ణయం తీసుకున్నావ్ అన్నా అని మరో అభిమాని పెట్టిన పోస్ట్ కి ధన్యవాదాలు తెలిపారు బండ్ల. బండ్ల గణేష్ ఆ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కొన్ని రోజులపాటు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు. కానీ ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఎంపీగానూ అవకాశం దక్కలేదు. దీంతో సైలెంట్ అయ్యారు బండ్ల గణేష్.
ఇదిలా ఉంటే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఆయన దేవుడిగా పరిగణిస్తుంటారు. దేవర అంటూ కొలుస్తుంటారు. పవన్ తనకు `గబ్బర్‌సింగ్` వంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో అప్పుల్లో ఉన్న బండ్ల గణేష్ ని బయటపడేసిందని టాక్. ఇప్పుడు మరోసారి పవన్‌తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు బండ్ల. మరి ఆ అవకాశం పవన్ ఎప్పుడిస్తారో చూడాలి. ఇంతకి అది కుదురుతుందా అనేది సస్పెన్స్ గా ఉంది.