- Home
- Entertainment
- Bheemla Nayak:పవన్ ఫ్యాన్ తో బండ్ల గణేష్ ''త్రివిక్రమ్ వైసీపీ వాళ్ళతో కలిసి'' కలకలం రేపుతున్న లీక్డ్ ఆడియో
Bheemla Nayak:పవన్ ఫ్యాన్ తో బండ్ల గణేష్ ''త్రివిక్రమ్ వైసీపీ వాళ్ళతో కలిసి'' కలకలం రేపుతున్న లీక్డ్ ఆడియో
భీమ్లా నాయక్(Bheemla Nayak) ప్రీ రిలీజ్ వేడుకను ఉద్దేశిస్తూ నటుడు నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బండ్ల గణేష్ ఆడియోగా వైరల్ అవుతున్న లీక్డ్ టేప్ లో సంచలన విషయాలు నమోదయ్యాయి.

ఫిబ్రవరి 21న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏపీ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy)హఠాన్మరణం నేపథ్యంలో ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. అయితే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానం లేదని దానికి కారణం త్రివిక్రమ్ అంటూ బండ్ల గణేష్ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడిన ఆడియో టేపు బయటికి వచ్చింది. సదరు టేపులో బండ్ల గణేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఇక బండ్ల గణేష్ (Bandla Ganesh)ఏం మాట్లాడారని పరిశీలిస్తే... బండ్ల గణేష్ కి పవన్ అభిమాని నుండి ఫోన్ వచ్చింది. సదరు అభిమాని బండ్ల గణేష్ ని, అన్న మీరు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తున్నారా? వేదికపై మాట్లాడడానికి స్పీచ్ రాసుకున్నారా? అని అడిగారు. పవన్ (Pawan Kalyan) ఫ్యాన్ ప్రశ్నలకు సమాధానంగా బండ్ల.. నేను అద్భుతంగా స్పీచ్ రాసుకున్నాను. అయితే నాకు భీమ్లా నాయక్ ఈవెంట్ కి ఆహ్వానం అందలేదు. ఆ త్రివిక్రమ్ గాడు డామినేట్ అయిపోతాడని నన్ను వద్దన్నాడట. అలాగే వైసీపీ వాళ్ళతో కలిసి ఏదో ప్లాన్ చేశాడట. అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఎవరూ పిలవకపోయినా పర్వాలేదు మీరు వచ్చేయండి అన్నా... అని ఫ్యాన్ అన్నారు. దానికి పిలవకుండా రావడం బాగోదు. అయితే మీరు స్టేడియం లో బండ్లన్న... బండ్లన్న... అంటూ గట్టిగా అరవండి. అప్పుడు నేను లోపలి వచ్చేస్తాను.. అన్నారు. దానికి మేము లోపల రచ్చ చేస్తామన్నా, మీరు వచ్చేయాలి, అంటూ బండ్ల గణేష్ కి పవన్ ఫ్యాన్ హామీ ఇచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య సంభాషణ సాగింది.
సదరు ఆడియో కాల్ ప్రకారం త్రివిక్రమ్(Trivikram) కి వైసీపీ వాళ్లతో సంబంధాలు ఉన్నాయి. అలాగే భీమ్లా నాయక్ ఈవెంట్ కి బండ్ల గణేష్ ని రాకుండా త్రివిక్రమ్ అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. ప్రసుత్తం ఈ ఆడియో టేప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఆ కాల్ మాట్లాడింది నిజంగా బండ్ల గణేషేనా? లేక పవన్, బండ్ల గణేష్ విరోధులు బండ్ల గణేష్ ని ఇలా ఇరికించారా? అనేది తేలాల్సి ఉంది.
నిన్నటి నుండి బండ్ల గణేష్ నిఘాడం కొన్ని ట్వీట్స్ వేస్తున్నారు. ఒక ట్వీట్ లో ''ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా చనువు ఇవ్వడం, ఎక్కువగా ఆశించటం... ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగా ఉంటుంది'' అంటూ కామెంట్ చేశారు. మరొక ట్వీట్ లో ''ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించినా చింతించకండి.. అలాంటి వారు ఖరీదైన వాటిని వదిలేసి చౌకైన వాటిని ఎంచుకుంటారు.. వారికీ మీ విలువ తెలియదు'' అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుత వివాదాస్పద ఆడియో టేప్ గురించి నిజానిజాలు బయటికి రావాల్సి ఉంది.