MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బండ్ల గణేష్ చెప్పిన పూరి జీవితంలోని ఆ వ్యాంప్ ఎవరు?... కలకలం రేపుతున్న కామెంట్స్!

బండ్ల గణేష్ చెప్పిన పూరి జీవితంలోని ఆ వ్యాంప్ ఎవరు?... కలకలం రేపుతున్న కామెంట్స్!

బండ్ల మైక్ పడితే మాములుగా ఉండదు ఎవరికో ఒకరికి రేగిపోవాల్సిందే. పొగిడితే ఆకాశానికి ఎత్తే బండ్ల గణేష్ విమర్శించినా అదే స్థాయిలో విమర్శిస్తారు. పూరి జగన్నాథ్ వైఫ్ లావణ్యను పొగిడే క్రమంలో బండ్ల పరోక్షంగా కొందరికి చురకలు వేశాడు. చోర్ బజార్ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన స్పీచ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 23 2022, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bandl Ganesh

Bandl Ganesh

పూరి కొడుకు ఆకాష్ పూరి లేటెస్ట్ మూవీ చోర్ బజార్. దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 24న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చోర్ బజార్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ హాజరయ్యారు. వేదికపై మాట్లాడిన బండ్ల కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

26
Bandl Ganesh

Bandl Ganesh

ఆయన వస్తూ వస్తూనే పూరి వైఫ్ లావణ్య గురించి మాట్లాడారు. మా వదిన అంటూ ఆమె గురించి చాలా ఉన్నతంగా మాట్లాడారు. లావణ్య వదిన శ్రీజాతిలోనే ఉత్తమురాలు. ఒక మంచి అక్క, భార్య, కోడలు, వదిన, తల్లి ఆమెలో ఉన్నారు. నేను సీతమ్మవారిని చూడలేదు కానీ సీతమ్మ అంత సహనం లావణ్య గారిలో ఉంది. పాండవుల తల్లి కుంతీ అంత మహోన్నత వ్యక్తి లావణ్య అంటూ కొనియాడారు.

36

పూరి స్టార్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు లావణ్య ఆయన జీవితంలోకి  రాలేదు. జేబులో వంద రూపాయలు కూడా లేనప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  జీవితంలోకి ర్యాంప్ లు వ్యాంప్ లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. భార్య శాశ్వతం. లావణ్య గారిని జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పూరి అన్న, ఆకాష్ పై ఉంది అన్నారు. ఈ మాటలకు లావణ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె ఎమోషనల్ అయ్యారు.

46


లావణ్యను పొగిడే క్రమంలో బండ్ల గణేష్ ఉపయోగించిన ఆ పదం హాట్ టాపిక్ అవుతుంది. పూరి జీవితంలో బండ్ల గణేష్ చెప్పిన ర్యాంప్ వ్యాంప్ ఎవరనే చర్చ మొదలైంది. నేరుగా ఈ మాట హీరోయిన్ ఛార్మికి తగులుతుంది. ఆమెను ఉద్దేశించే బండ్ల ఆ పదాలు వాడారని కొందరు బహిరంగంగా అంటున్నారు. కొన్నాళ్లుగా పూరి, ఛార్మి కలిసి ఉంటున్నారు. నటన మానేసిన ఛార్మి పూరి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

56


ఛార్మి కారణంగా పూరి. లావణ్య మధ్య అనేక గొడవలు జరిగినట్లుగా కథనాలు వెలువడ్డాయి. ఎవరు ఏమనుకున్నా పూరి, ఛార్మి విడిపోయే సూచనలు లేవు. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఆమె సహభాగస్వామి గా ఉన్నారు. ఒక సందర్భంలో నటి హేమ మాట్లాడుతూ... ఛార్మి దర్శకుడి పూరీని మబ్బులా కమ్మేసింది. ఆమెను వదిలించుకుంటే తప్ప పూరికి హిట్స్ రావు అంటూ ఓపెన్ కామెంట్ చేశారు. 

66


ప్రస్తుతం పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్, జనగణమన చిత్రాలు తెరకెక్కుతున్నాయి. లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. జనగణమన మూవీ ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. ఈ చిత్రాలు విజయం సాధిస్తే పూరి, ఛార్మి పంట పండినట్లే. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతూన్నాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kantara Secret: కాంతారకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా? గూస్‌ బంమ్స్ తెప్పించే విషయం చెప్పిన రిషబ్ శెట్టి
Recommended image2
Vijay Rashmika: దేశ వ్యాప్తంగా అన్నదానం, స్వీట్ల పంపిణి.. అభిమానులకు విజయ్‌ దేవరకొండ, రష్మిక సర్‌ప్రైజ్‌
Recommended image3
Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved