MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `ఆదిపురుష్‌` కారణంగా బాలకృష్ణ `శ్రీరామరాజ్యం` ట్రెండింగ్‌.. అసలు రీజన్‌ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

`ఆదిపురుష్‌` కారణంగా బాలకృష్ణ `శ్రీరామరాజ్యం` ట్రెండింగ్‌.. అసలు రీజన్‌ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

రాముడిగా బాలకృష్ణ నటించిన చిత్రం `శ్రీరామరాజ్యం`. ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్‌ అవుతుంది. చాలా మంది సోషల్‌ మీడియాలో ఈ సినిమా పోస్టర్లు పెడుతున్నారు. `ఆదిపురుష్‌` విడుదల సందర్భంగా ఈ మూవీ ట్రెండ్‌ కావడం ఆశ్చర్యపరుస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 17 2023, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బాలకృష్ణ.. రాముడిగా నటించిన చిత్రం `శ్రీరామరాజ్యం`. బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సీతగా నయనతార, లక్ష్మణుడిగా శ్రీకాంత్ నటించారు. ఈ సినిమా 2011లో విడుదలై ఆకట్టుకుంది. కానీ పెద్ద విజయం సాధించలేదు. నీట్‌గా మనవైన కాస్ట్యూమ్స్ తో, రాముడంటే ఎలా ఉండాలో అలా బాలకృష్ణ పాత్రని తీర్చిదిద్దిన తీరు ఇలా అన్ని యాంగిల్‌లో `శ్రీరామరాజ్యం` నిజంగానే రామాయణాన్ని తలపిస్తుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. చాలా మంది ఆడియెన్స్ ఇప్పుడు దీన్ని చూస్తున్నారు. కారణం మాత్రం ఆశ్చర్యపోయేలాఉంది. 
 

25

ప్రభాస్‌ రాముడిగా నటించిన చిత్రం `ఆదిపురుష్‌`. ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీతగా కృతి సనన్‌ నటించింది. సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో, భారీ విజువల్‌ ఎఫెక్ట్స్ తో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. దీనికి మిశ్రమ స్పందన లభిస్తుంది. చాలా మంది దీనిపై విమర్శలు చేస్తుండగా, యూత్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్ ఎంజాయ్‌ చేస్తున్నారు. పిల్లలకు నచ్చే చిత్రమని అంటున్నారు. సూపర్‌ హీరోల తరహాలో మేకింగ్‌ చేయడంతో పిల్లలు ఎంజాయ్‌ చేసే సినిమా అని చెప్పొచ్చు. 
 

35
Adipurush Movie Reel Vs Real

Adipurush Movie Reel Vs Real

అయితే ఎక్కువగా దీనిపై విమర్శలు వస్తున్నాయి. రామాయణాన్ని తలతోక లేకుండా తీశాడని, అంత షార్ట్ కట్‌ లో ఉందని అంటున్నారు. అయితే పెద్దవాళ్లకి, గతంలో రామాయణం పై వచ్చిన సినిమాలు చూసినవారికి ఈ చిత్రం నచ్చడం చాలా కష్టం. మోడ్రన్‌ స్టయిల్‌లో ఇది సాగడంతో పెద్దవారికి మింగుడు పడన విధంగా ఉంది. అందుకే చాలా మంది ఇప్పుడు బాపు రూపొందించిన బాలకృష్ణ నటించిన `శ్రీరామరాజ్యం` సినిమాని చూస్తున్నారు. తాజాగా ఆ విషయాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. `ఆదిపురుష్‌` వల్ల బాపు `శ్రీరామరాజ్యం` విలువేంటో తెలిసిందని అంటున్నారు. 

45

రాముడిగా బాలకృష్ణ ఒదిగిపోయాడని, లక్ష్మణుడిగా శ్రీకాంత్‌ పర్‌ఫెక్ట్ గా సెట్‌ అయ్యాడని, సీతగా నయనతార తప్ప మరెవ్వరిని ఊహించుకోలేమని అంటున్నారు. ఆ ఫోటోలు, క్లిప్పు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. దీంతోపాటు ఎన్టీఆర్‌ నటించిన `లవకుశ`, జూ ఎన్టీఆర్‌ బాల `రామాయణం`, `ఈ నేపథ్యంలో `ఆదిపురుష్‌` కారణంగా అవి తెరపైకి వస్తున్నాయి. ట్రెండింగ్‌లోకి రావడం గమనార్హం. ఇప్పుడు ఆయా సినిమాలకు ఆదరణ పెరిగిందని చెప్పొచ్చు. 
 

55

ఇక `ఆదిపురుష్‌` పై ఎన్ని విమర్శలు వచ్చినా, ఇది తొలి రోజు మాత్రం రికార్డులు క్రియేట్‌ చేయబోతుంది. ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమాకి సాధ్యం కాని విధంగా భారీ ఓపెనింగ్స్ రాబోతున్నాయి. అడ్వాన్స్ సేల్స్ విషయంలోనే ఇది రికార్డులు క్రియేట్‌ చేసింది. యూఎస్‌లోనూ ఇది ఇప్పటికే ఒక మిలియన్‌ దాటింది. మొత్తానికి ఫస్డ్ డే `ఆదిపురుష్‌` నయా రికార్డులు క్రియేట్‌ చేయబోతుందని చెప్పొచ్చు. ఇక ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఓటీటీ, డిజిటల్‌ ద్వారానే ఏకంగా రూ.250కోట్లు రాబట్టుకుంది. తెలుగుతోపాటు సౌత్‌లో థియేట్రికల్‌ రైట్స్ రూ.185కోట్లకి అమ్ముడు పోయింది. నార్త్, ఓవర్సీస్‌లో టీమ్‌ సొంతంగా రిలీజ్‌ చేసింది. పైగా ఈ సినిమా నార్త్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఇది భారీగా చేసే అవకాశం ఉంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image2
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image3
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved