- Home
- Entertainment
- సంచలన ప్రాజెక్ట్ సెట్ చేసిన బాలయ్య.. రెండు కాదు, మూడు భాగాలు.. కమల్, మోహన్‌లాల్ కూడా.. డైరెక్టర్ అతనే ?
సంచలన ప్రాజెక్ట్ సెట్ చేసిన బాలయ్య.. రెండు కాదు, మూడు భాగాలు.. కమల్, మోహన్‌లాల్ కూడా.. డైరెక్టర్ అతనే ?
బాలయ్య జోరు మామూలుగా లేదు. వరుస సక్సెస్‌లతో జోరుమీదున్న ఆయన తాజాగా ఓ సంచలన ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. సౌత్ బిగ్గెస్ట్ స్టార్స్ తో కలిసి సినిమా చేయబోతున్నారు. తాజాగా దర్శకుడెవరో రివీల్ అయ్యింది.

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి వేడుకలో బాలకృష్ణతో చేయబోతున్న సినిమాని ప్రకటించారు. బాలకృష్ణ ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ సెట్ చేశారని తెలిపారు. త్వరలో తాము కలిసి నటించబోతున్నామని, దాన్ని తానే నిర్మిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందులో రజనీకాంత్ కూడా నటిస్తారట. రజనీకాంత్‌తోపాటు శివరాజ్‌కుమార్, బాలకృష్ణ నటిస్తారని, ఇది రెండు భాగాలుగా రాబోతుందని తెలిపారు.
శివరాజ్ కుమార్ తన సొంత ప్రొడక్షన్‌లో నిర్మించబోతున్న ఈ సినిమాకి కన్నడ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ఆ డైరెక్టర్ ఎవరో తేలిపోయింది. శివరాజ్‌కుమార్‌తో `వేద` సినిమాని రూపొందించిన హర్ష దర్శకత్వం వహిస్తారట. అంతకు ముందు ఆయన `బజరంగీ` సినిమాని రూపొందించారు. ఈ రెండు బంపర్ హిట్లు అయ్యాయి. తాజాగా సౌత్ బిగ్గెస్ట్ స్టార్లతో కలిసి ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారట. త్వరలోనే ఇది పట్టాలెక్కబోతుందని ప్రచారం జరుగుతుంది.
అయితే దర్శకుడు వివరాలే కాదు, మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా రెండు పార్ట్ లు కాదు, మూడు పార్ట్ లుగా రాబోతుందట. మొదటి పార్ట్ లో బాలకృష్ణ, శివరాజ్‌కుమార్ నటిస్తారట. రెండో పార్ట్ లో బాలకృష్ణ, రజనీ కాంత్ నటిస్తారని తెలుస్తుంది. అటు రజనీకాంత్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య, రజనీ, శివన్న వంటి ముగ్గురు మాస్ హీరోలు కలిసి సినిమా అంటే దానిపై అంచనాలకే ఆకాశమే హద్దు కాబోతుంది.
ఈ సినిమాని నిజానికి మూడు పార్ట్ లుగా చేయబోతున్నారట. మూడో భాగంలో లోకనాయకుడు కమల్ హాసన్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూడా నటిస్తున్నారట. మూడో భాగంలో బాలయ్యగానీ, రజనీ, శివన్నగానీ కనిపించరని, పూర్తిగా కొత్త స్టార్స్ కమల్, మోహన్‌లాల్ కలిసి నటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సౌత్‌లో సంచలనంగా మారింది. ఈ ప్రాజెక్ట్ సంచలనాత్మక ప్రాజెక్ట్ గా నిలుస్తుంది మరి ఇందులో నిజమెంతా? కార్యరూపం దాల్చేవరకు ఎలాంటి మార్పులుంటాయనేది చూడాలి. ఇదిలా ఉంటే ఇప్పటికే శివన్న, మోహన్‌లాల్.. రజనీ `జైలర్`లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేయడంలో బాలకృష్ణ కీలక భూమిక పోషిస్తున్నారని శివన్న మాటలను బట్టి తెలుస్తుంది. ఇక ప్రస్తుతం బాలయ్య.. అనిల్ రావిపూడితో `ఎన్బీకే108` చిత్రంలో నటిస్తున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తుంది. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తుంది. అనంతరం బోయపాటి శ్రీనుతో సినిమా చేయనున్నారు. అలాగే బాబీతోనూ ఓ సినిమా చేయాల్సిన కమిట్‌మెంట్ ఉంది. మరి వీటి తర్వాత ఈ సంచలన ప్రాజెక్ట్ ఉంటుందా? లేక పారలల్‌గా రూపొందిస్తారా? అనేది చూడాలి.