బాలయ్య, రవితేజ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే వార్త.. మల్టీస్టారర్లలో ఇది మరో లెవల్.. మాస్ జాతరే ?
బాలకృష్ణ.. మహేష్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ అంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ చిన్న చేంజ్.. ఇప్పుడు మాస్‌కి కేరాఫ్‌గా నిలిచే బాలయ్య, రవితేజ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ సినిమా అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి.
బాలకృష్ణ అడపాదడపా కెరీర్ ప్రారంభంలో మల్టీస్టారర్ చిత్రాలు చేశారు. ఇటీవల ఆయన మల్టీస్టారర్ చిత్రాలు చేయలేదు. ఇప్పుడు పర్‌ఫెక్ట్ మల్టీస్టారర్ సినిమాకి రెడీ అవుతున్నారు. టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల జోరు సాగుతుంది. ఆ మధ్య `గోపాల గోపాల`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` వంటి మల్టీస్టారర్ చిత్రాలొచ్చాయి. కానీ ఇప్పుడు `భీమ్లానాయక్`, `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రాలతో మల్టీస్టారర్ హవా ఊపందుకుంది. `ఆచార్య` కూడా మల్టీస్టారర్‌గానే రాబోతుంది.
చిరంజీవి మరో సినిమా `గాఢ్ ఫాదర్` కూడా ఓ రకంగా మల్టీస్టారరే కాబోతుంది. ఈ నేపథ్యంలో బాలయ్య ఓ భారీ మల్టీస్టారర్ చిత్రానికి రెడీ అవుతున్నారట. అయితే మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా మల్టీస్టారర్ అని, అందులో బాలయ్య మరో హీరోగా నటిస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని రాజమౌళి తేల్చేశారు. అయితే ఇప్పుడు బాలయ్య మరో మల్టీస్టారర్ అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో `ఎన్బీకే 107` సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. అనంతరం అనిల్ రావిపూడితో సినిమా ఉంటుందని టాక్. ఈ చిత్రాన్ని మల్టీస్టారర్‌గా డిజైన్ చేశారట అనిల్‌రావిపూడి. అందులో మాస్ మహారాజా రవితేజ మరో హీరోగా నటించబోతున్నారని సమాచారం. ఇప్పటికే కథ ఓకే అయ్యిందని, దీనిపై రవితేజని అప్రోచ్ కాగా ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇప్పటికే రవితేజ అనిల్‌రావిపూడి కాంబినేషన్ `రాజా ది గ్రేట్` చిత్రం వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ నమ్మకంతోనే మాస్ రాజాఓకే చెప్పారని టాక్.
బేసిక్‌గా బాలకృష్ణ అంటేనే ఊరమాస్. ఆయన మాస్ జాతర ఎలా ఉంటుందో ఇటీవల `అఖండ` చిత్రంలో చూశాం. రవితేజ మరో ఊరమాస్. ఆయన ఎనర్జీని మాటల్లో చెప్పలేం. అలాంటి ఒక ఊర మాస్‌కి, మరో ఊరమాస్ తోడైతే, బాలయ్యకి, రవితేజ తోడైతే అది బాక్సాఫీసు వద్ద మాస్ జాతరే అని చెప్పొచ్చు. మల్టీస్టారర్‌లో ఇది మరో లెవల్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ వార్తలో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
రవితేజ ఇప్పటికే చిరంజీవి సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న `మెగా154`లో రవితేజ కీరోల్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఆయనకు జోడీగా కేథరిన్ నటిస్తుందని సమాచారం. మరోవైపు హీరోగానూ ఫుల్ బిజీగా ఉన్నారు రవితేజ. ప్రస్తుతం ఆయన నటించిన `రామారావుః ఆన్ డ్యూటీ` విడుదలకు రెడీ అవుతుంది. దీంతోపాటు `ధమాకా`, `రావణాసుర`, `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాలు చేస్తున్నారు రవితేజ.