`వీరమాస్`గా బాలకృష్ణ.. బర్త్ డే రోజు ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్.. అవేంటో తెలుసా?
బాలకృష్ణ తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. వీరమాస్ ట్రీట్‌కి సిద్ధమవుతున్నారు. ఈ సారి ఆయన బర్త్ డే చాలా స్పెషల్‌గా నిలవబోతుంది.

నందమూరి నట సింహం బాలకృష్ణ ఇటు సినిమాల్లో హ్యాట్రిక్ కొట్టాడు. ఇప్పుడు రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ కొట్టాడు. ఎప్పుడూ సాధ్యం కాని విధంగా ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ మూడు హిట్లు కొట్టారు బాలకృష్ణ. `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి` చిత్రాలతో విజయాలు అందుకున్నారు. తన సమకాలీన హీరోల్లో ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నది ఆయనే అని చెప్పొచ్చు.
అయితే సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ బాలయ్య జోరు చూపించారు. బాలకృష్ణ రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ కొట్టాడు. హిందూపూర్ నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. రాజకీయాల్లోనూ బాలయ్య సక్సెస్ అయ్యాడు. ఇలా డబుల్ కిక్‌తో ఉన్నాడీ నటసింహం. ఈ ఆనందంలో ఆయన పుట్టిన రోజు వచ్చింది. రేపే(జూన్ 10)న బాలకృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా గ్రాండ్‌గానే సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారట. అటు హిందూపూర్‌లో తన నియోజకవర్గం ప్రజలతోనూ మరోవైపు ఇక్కడ అభిమానులతోనూ ఈ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు బాలయ్య.
ఫ్యాన్స్ కోసం ఆయన అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఒక్కటి కాదు రెండు ట్రీట్‌లు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న `ఎన్బీకే109` చిత్రానికి సంబంధించిన టైటిల్‌ని విడుదల చేయబోతున్నారు. దీనికి `వీరమాస్` అనే టైటిల్‌ని ఖరారు చేశారట. ఈ టైటిల్ ఫస్ట్ లుక్‌ని సోమవారం రిలీజ్ చేయబోతున్నారు. చిన్న గ్లింప్స్ కూడా వస్తుందని సమాచారం.
మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు బాలకృష్ణ. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందట. ఉదయం ఎనిమిది గంటల సమయంలోనే ఈ మూవీని అనౌన్స్ చేస్తారని సమాచారం. కేవలం ప్రకటించడం వరకే కాదు, సినిమాని కూడా ప్రారంభించే అవకాశాలున్నాయని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈ రెండు సినిమాల నుంచి అదిరిపోయే అప్‌డేట్లు మాత్రం రాబోతున్నాయి.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఇప్పటికే `సింహా`, `లెజెండ్`, `అఖండ` చిత్రాలు వచ్చాయి. వచ్చిన మూడూ సంచలన విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో మరో హ్యాట్రిక్ కోసం ఈ కాంబో కలవబోతుంది. అయితే బోయపాటి శ్రీనుకి మాత్రం బాలయ్యతోనే సక్సెస్ వస్తుంది. `అఖండ` తర్వాత ఆయన చేసిన `స్కంధ` డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు నాల్గో సారి బాలయ్య, బోయపాటి కలిసి రాబోతున్నారు. మరి ఇది ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి.
సమాజానికి సంబంధించిన సందేశంతో ఉండబోతుందట. ఏది మంచి, ఏది చెడు, ఎలాంటి పనులు చేయాలనేది ఇందులో చెప్పబోతున్నారు. చిన్న సందేశాన్ని కమర్షియల్ వేలో చెప్పబోతున్నారట. దేవుడు, ప్రకృతి అంశాలు కూడా ఇందుటో టచ్ చేయనున్నారు బోయపాటి. బాలయ్యని ఈ సారి మాస్ లో ఊరమాస్‌ని చూపించబోతున్నారని టాక్.