- Home
- Entertainment
- బ్లాక్ బస్టర్ కావాల్సిన చెన్నకేశవరెడ్డి మూవీని డ్యామేజ్ చేసిందెవరు? తెరవెనుక కథ బయటపెట్టిన దర్శకుడు
బ్లాక్ బస్టర్ కావాల్సిన చెన్నకేశవరెడ్డి మూవీని డ్యామేజ్ చేసిందెవరు? తెరవెనుక కథ బయటపెట్టిన దర్శకుడు
బాలకృష్ణ నటించిన సినిమాల్లో చాలా పరాజయం చెందాయి. కానీ ఒక హిట్ కావాల్సిన మూవీని ఫ్లాప్ అయ్యింది. అదే `చెన్నకేశవరెడ్డి`. అందుకు కారణం తెలిపారు డైరెక్టర్.

బాలయ్య, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన `చెన్నకేశవ రెడ్డి`
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ఫ్యాక్షన్ మూవీస్‌లో `చెన్నకేశవరెడ్డి` ఒకటి. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ఇది. వినాయక్ అప్పుడే ఎన్టీఆర్‌తో `ఆది` చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. దీంతో మరో ఆలోచన లేకుండా వినాయక్‌కి ఓకే చెప్పారు బాలయ్య. ఈ మూవీలో టబు, శ్రియా శరణ్ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ బాలయ్యకి టబు, జూ బాలయ్యకి శ్రియా జోడీగా చేశారు. బెల్లంకొండ సురేష్ నిర్మించారు. అప్పట్లో ఫ్యాక్షన్ సినిమాల జోరు నడుస్తోంది. అందులో భాగంగానే ఫ్యాక్షన్ నేపథ్యంలోనే ఈ మూవీ కూడా వచ్చింది.
బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసిన `చెన్నకేశవరెడ్డి`
అయితే అంతకు ముందు బాలయ్య ఇలాంటి కాన్సెప్ట్ తోనే `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` చిత్రాలు చేశారు. అవి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కానీ ఆ స్థాయిలో `చెన్నకేశవరెడ్డి` ఆడలేదు. 2002లో విడుదలైన ఈ మూవీ ఓపెనింగ్స్ బాగానే రాబట్టినా, ఆ తర్వాత పడిపోయింది. బిలో యావరేజ్‌కే పరిమితమయ్యింది. అయితే ఈ మూవీ పెద్ద రేంజ్ హిట్ కావాల్సి ఉందట. కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల డిజప్పాయింట్ చేసిందన్నారు దర్శకుడు వినాయక్. సినిమాని అనుకున్న డేట్‌కి రిలీజ్ చేయాలని ఓ పాట లేకుండానే విడుదల చేశారు. ఆ తర్వాత షూట్ చేసి జోడించారు. అదే `తెలుపు తెలుపు` పాట. అయినా ఏమాత్రం సినిమాకి హెల్ప్ కాలేదు. ఈ మూవీపై ప్రారంభంలో చాలా అంచనాలున్నాయి. బాలయ్య వరుస ఫ్యాక్షన్ మూవీస్ హిట్ కావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. దీంతో భారీ బిజినెస్ కూడా జరిగింది. అప్పట్లో ఈ రేంజ్ బిజినెస్ మరే మూవీకి జరగలేదు. అయితే రొటీన్ ఫ్యాక్షన్ స్టోరీ కావడంతో, ఇలాంటివి బాలయ్య అప్పటికే చేయడంతో ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు.
నిర్మాత స్టేట్‌మెంట్ కారణంగా సినిమా ఫ్లాప్
ఈ నేపథ్యంలో ఈ మూవీకి గురించి దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కారణంగానే సినిమా డల్ అయ్యిందని తెలిపారు. ఆయన అన్న ఒక్క మాట సినిమాపై చాలా ప్రభావం చూపించిందని, హిట్ కావాల్సిన మూవీ ఫ్లాప్ అయ్యిందన్నారు. అయితే ఆ మాట ఏంటనేది వినాయక్ రివీల్ చేయలేదు. కానీ దాని వల్లే సినిమా డౌన్ అయ్యిందని, లేదంటే ఇంకా బాగా ఆడేదని, మంచి వసూళ్లని రాబట్టేదని తెలిపారు. ఓ రకంగా బ్లాక్ బస్టర్ రేంజ్ అని చెప్పారు వినాయక్. రాజేష్ మన్నెకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.
వినాయక్‌కి బాలయ్య ధైర్యం
ఆ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్.. సినిమాల జయాపజయాలు దైవాదీనం, మేం సినిమా కోసం చాలా కష్టపడ్డామని ఆయన అన్నట్టు తెలిసింది. మరి ఇవే వ్యాఖ్యలు సినిమాపై ప్రభావం చూపాయా? అనేది క్లారిటీ లేదు. ఏదేమైనా `చెన్నకేశవరెడ్డి` మూవీ వ్యక్తిగతంగా తనకు ఇష్టమైన మూవీ అని దర్శకుడు వినాయక్ తెలిపారు. ఈ మూవీ ఫలితం తర్వాత బాలయ్య దర్శకుడికి ధైర్యాన్నిచ్చారట. బాధపడవద్దని, అన్నీ మన చేతుల్లో ఉండవని, మనం వంద శాతం కష్టపడ్డామా లేదా? అనేది చూసుకోవాలని బాలయ్య తెలిపినట్టు వెల్లడించారు. ప్రస్తుతం వినాయక్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చివరగా వినాయక్ హిందీలో `ఛత్రపతి` మూవీని రూపొందించారు. ఇది డిజాస్టర్ అయ్యింది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో కావడం విశేషం.
అఖండ 2తో రాబోతున్న బాలయ్య
ఇక ప్రస్తుతం బాలయ్య `అఖండ 2` చిత్రంతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల గ్లింప్స్ విడుదలైన విషయం తెలిసిందే. బాలయ్య యాక్షన్‌తో రెచ్చిపోయి ఆకట్టుకున్నారు. డిసెంబర్ 5న పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.