Akhanda2 : బాలయ్యకు కెరీర్‌లోనే హయ్యెస్ట్ డీల్.. ఎన్ని కోట్లంటే?
Akhanda 2 OTT : నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ 2 థియేటర్లలో వాయిదా పడినా క్రేజ్ తగ్గలేదు. ఈ సినిమా OTT రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషలకు దాదాపు ₹85 కోట్లకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. డిసెంబర్‌లో విడుదల కానుంది.

అఖండ 2 క్రేజ్
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింహా, లెజెండ్, అఖండ సినిమాల విజయాలతో ఈ జోడీ టాలీవుడ్‌లో మోస్ట్ వెయిటెడ్ కాంబోగా నిలిచింది. ఈ కాంబోలో వస్తున్న అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇంతకీ ఆ సంగతేంటీ?
రిలీజ్ ఎప్పుడంటే?
సింహా, లెజెండ్, అఖండ విజయాల తరువాత బాలయ్య – బోయపాటి కాంబోపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రత్యేకంగా అఖండ విజయం బాలయ్య కెరీర్‌కు కొత్త ఊపిరి నింపింది.
ఇప్పుడు నాలుగోసారి ఈ కాంబినేషన్ వస్తుండటంతో ట్రేడ్‌లో హైప్ రెట్టింపు అయింది. వాస్తవానికి అఖండ 2 మూవీని మొదట సెప్టెంబర్ 25 రిలీజ్ ప్లాన్ చేసినా, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం, పవన్ కళ్యాణ్ ఓజీ విడుదల కారణంగా వాయిదా వేశారు.
తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 4 లేదా 5న అన్ని భాషల్లో అఖండ 2 విడుదలకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. దీని బట్టి చూస్తే.. థియేటర్స్ విడుదలైన తరువాత ఓటీీటీలో సౌత్ వెర్షన్‌కు 4 వారాల, హిందీ వెర్షన్‌కు 8 వారాలకు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నది.
మెగా బడ్జెట్
అఖండ 2 సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే, బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కూడా బాలయ్య ఆస్థాన సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. థమన్ మ్యూజిక్ అఖండలోనే పెద్ద హిట్ కావడంతో, ఈ సారి ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి.
ఇక తారాగణం విషయానికి వస్తే, బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే యంగ్ హీరో ఆది పినిశెట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నుండి స్టార్ నటుడు సంజయ్ దత్ కూడా అఖండ 2లో విలన్ పాత్రలో ఎంట్రీ ఇస్తున్నాడని టాక్ నడుస్తోంది.
అఖండ 2 OTT డీల్ – రికార్డు స్థాయిలో బిజినెస్
అఖండ 2 ఓటీటీ డీల్ విషయంలో రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను దాదాపు 85 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇది సీనియర్ హీరోల సినిమాలకు ఇప్పటివరకు దక్కిన అత్యధిక డీల్ ఇదే. అఖండ 2పై నెలకొన్న భారీ అంచనాల కారణంగా నెట్‌ఫ్లిక్స్ ఈ భారీ మొత్తాన్ని వెచ్చించిందట. ఈ డీల్‌తో బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక డిజిటల్ రైట్స్ సాధించిన సినిమా రికార్డు సృష్టించింది.
థియేట్రికల్ విండో ప్లాన్ కూడా ప్రత్యేకంగా రూపొందించారు. సౌత్ వెర్షన్ కోసం 4 వారాల థియేట్రికల్ గ్యాప్ ఉంటే, హిందీ వెర్షన్ కోసం 8 వారాల గ్యాప్ ఇవ్వనున్నారు. హిందీలో కూడా పెద్ద స్థాయి రిలీజ్ ప్లాన్ చేస్తున్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
బిజినెస్ లో దుమ్మురేపుతున్న అఖండ 2
గతంలో వచ్చిన అఖండ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు అందించింది. అందుకే అఖండ 2 బిజినెస్‌పై కూడా ట్రేడ్ వర్గాల్లో ఎనలేని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కోసం బడా సంస్థలు క్యూలో నిలిచాయి. నెట్‌ఫ్లిక్స్ 85 కోట్ల డీల్ క్లోజ్ చేయడానికి చూస్తే.. బాలయ్య అఖండ 2 సినిమా క్రేజ్ ఏంటో తెలుస్తోంది. రిలీజ్‌కు ముందే అఖండ 2 బిజినెస్ రికార్డులు సృష్టిస్తుందని అంచనా.
ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్
ఓటీటీ డీల్ వార్త బయటపడగానే బాలయ్య అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. అఖండ 2 రిలీజ్‌కు ఇంకా టైం ఉండగానే క్రేజ్, హైప్ పీక్స్‌కి చేరింది. సింహా, లెజెండ్, అఖండ విజయాలు బోయపాటి–బాలయ్య కాంబినేషన్ పవర్‌ను ఇప్పటికే నిరూపించాయి. అందుకే అఖండ 2లో ఈ కాంబినేషన్ మళ్లీ ఏ విధంగా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలని అభిమానులు ఇగర్ గా వేయిట్ చేస్తున్నారు. డిసెంబర్‌లో సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత, అఖండ 2 ఏ స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.